సూర్యాపేట జంక్షన్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యాపేట జంక్షన్
దర్శకత్వంరాజేష్ నాదెండ్ల
రచనరాజేంద్ర భరద్వాజ్
సత్య ఋషి
నిర్మాతఅనీల్ కుమార్ కాట్రగడ్డ
ఎన్ శ్రీనివాస్ రావు
వంగర విష్ణువర్ధన్
తారాగణంఈశ్వర్
నైనా సర్వర్
అభిమన్యు సింగ్
ఛాయాగ్రహణంఅరుణ్ ప్రసాద్
కూర్పుఎమ్ ఆర్ వర్మ
సంగీతంరోషన్ సాలూరి
నిర్మాణ
సంస్థ
యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
సినిమా నిడివి
150 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

సూర్యాపేట జంక్షన్ 2023 లో పొలిటికల్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న తెలుగు సినిమా. యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, వంగర విష్ణువర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు. ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ 2023 ఫిబ్రవరి 2న విడుదల చేసారు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
 • నిర్మాతలు: అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, వంగర విష్ణువర్ధన్
 • దర్శకత్వం: రాజేష్ నాదెండ్ల
 • కథ: ఈశ్వర్
 • మాట‌లు: రాజేంద్ర భరద్వాజ్, సత్య ఋషి
 • సంగీతం: రోషన్ సాలూరి, గౌర హరి
 • సినిమాటోగ్రఫీ : అరుణ్ ప్రసాద్
 • ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్
 • ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ
 • సౌండ్ డిజైన్: పద్మారావు
 • సౌండ్ ఎఫెక్ట్స్ : ద్వని స్టూడియోస్
 • విజువల్ ఎఫెక్ట్స్: సోమేశ్
 • ఫైట్స్: రామకృష్ణ, మల్లేష్
 • కోరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, చక్రి
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.పాండు

చిత్ర నిర్మాణం[మార్చు]

రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రకృతి అందాలతోపాటు షూటింగ్‌కు అనువుగా ఉన్న హైదరాబాద్, సూర్యాపేట, నర్సాపూర్ [2] పరిసర ప్రాంతాల్లో 45 రోజులపాటు చిత్రీకరణ జరుపుకుంది.[3] ఈ చిత్రంలో అర్.ఎక్స్ 100 ఫేమ్ పూజ నర్తించిన 'మ్యాచింగ్ మ్యాచింగ్' అనే ఐటమ్ సాంగ్ ని 2023 ఫిబ్రవరి 26న లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, హైదరాబాదులో టీ20 మ్యాచ్ క్రికెట్ కప్ విన్నర్స్ చేతుల మీదుగా విడుదల చేసారు.[4]

సంగీతం[మార్చు]

నేపథ్యసంగీతంతో పాటు పాటు రెహమాన్ రాసిన మూడు పాటలకు రోషన్ సాలూరి సంగీతం అందించారు. గౌర‌హ‌రి ఓ ప్ర‌త్యేక గీతాన్ని రచించి స్వరపరిచారు. టిప్స్ మ్యూజిక్ కంపనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[5]

External audio
సూర్యాపేట జంక్షన్ - Full Songs Jukebox యూట్యూబ్లో
సం.పాటనేపధ్య గాయకులుపాట నిడివి
1."మేరె యారా"రాహుల్ సిప్లిగంజ్ , కోరస్ 
2."చెంగు చెంగున"సాయి చరణ్ , కోరస్ 
3."ఒక ప్రాణం"శ్రీకృష్ణ (గాయకుడు) 
4."మ్యాచింగ్ మ్యాచింగ్"కీర్తన శర్మ, గౌర హరి 

మూలాలు[మార్చు]

 1. "కొత్తగా మా ప్రయాణం' చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన 'సూర్యాపేట్‌ జంక్షన్‌' చిత్రం టీజర్‌ విడుదలైంది". చిత్రజ్యోతి. 7 February 2023. Retrieved 7 August 2023.
 2. "యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్". Manatelangana=22 September 2022. Retrieved 7 August 2023.
 3. "షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న 'సూర్యాపేట జంక్షన్‌'". సాక్షి. 23 September 2022. Retrieved 7 August 2023.
 4. "Suryapet Junction Movie Song Launch". ఫిల్మి ఫోకస్. 27 ఫిబ్రవరి 2023. Retrieved 7 August 2023.
 5. "'RX 100' famed Pooja's 'Suryapet Junction' team released the item song 'Matching Matching' with CCC Cup winners". Timesofindia. 28 February 2023. Retrieved 7 August 2023.

బయటి లింకులు[మార్చు]