Jump to content

సెట్విన్

వికీపీడియా నుండి
సెట్విన్
ప్రధాన
కార్యాలయాలు
అజ్మత్ జా ప్యాలెస్ నం. 4, పురాని హవేల్లి, హైదరాబాద్, ఇండియా
ముఖ్యమైన వ్యక్తులుఎన్. గిరిధర్ రెడ్డి
జాలగూడుhttp://setwin.in

సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక సంస్థ. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల నిరుద్యోగులకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను అందించడానికి ఈ సంస్థ నామమాత్రపు ఫీజుతో వివిధ కోర్సులలో శిక్షణ ఇస్తోంది. వివిధ సెట్విన్ శిక్షణా కేంద్రాలలో దాదాపు 16 వేర్వేరు కోర్సులలో విద్యార్థులు ఉచిత ప్రవేశం పొందవచ్చు. నిరుద్యోగ యువతకు సహాయం చేయడానికి ఈ సంస్థ నుండి అనేక పథకాలు, జాబ్ మేళాలను నిర్వహించబడ్డాయి.

చరిత్ర

[మార్చు]

1978, ఆగస్టు 15న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఖాదర్ అలీ ఖాన్ సెట్విన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ సంస్థ ప్రారంభించబడింది.[1] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2015లో పి. వైద్యానాథరావును మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించాడు. 2017లో మీర్ ఇనాయత్ అలీ బక్రీ సెట్విన్ చైర్మన్ గా నియమించబడ్డాడు.

సంస్థ

[మార్చు]
ఒక మహిళా అభివృద్ధి కార్యక్రమంలో సెట్విన్ విద్యార్థినితో సమీరా అజీజ్

శిక్షణ కేంద్రాలతోపాటు ప్రింటింగ్ ప్రెస్‌లు, చెరకు కేంద్రాలు, బుక్ బైండింగ్ వంటి వివిధ ఉత్పత్తి యూనిట్లను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది. 2007 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి హైదరాబాదు నుండి జిల్లాలకు ఈ సంస్థ తన సేవలను విస్తరించింది.[2] ఈ సంస్థ 32వ, 33వ శిక్షణా కేంద్రాలను మహబూబ్‌నగర్ జిల్లా 10వ బెటాలియన్‌లో, కర్నూలు జిల్లా 2వ బెటాలియన్‌ను సంస్థ చైర్మన్ మొహమ్మద్ మక్సూద్ అహ్మద్ ప్రారంభించాడు.[3] 2015, జూలై లో సెట్విన్ సంస్థ పేద మైనార్టీల విద్యార్థుల కోసం "ఐయుమిన్" అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా శిక్షణ కోర్సును పూర్తిచేసి, పథకంలో నమోదు చేసుకున్న విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌లను అందించడంలో ఈ సంస్థ కృషి చేస్తోంది. యువజన సేవల విభాగం, మైనారిటీ సంక్షేమ శాఖ సహకారంతో సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ పి. వైద్యనాథరావు ఈ పథకాన్ని ప్రారంభించాడు.

రవాణా సేవలు

[మార్చు]

వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం, వాటిని నిర్వహించడంతోపాటు, హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలను విస్తరింపచేయడానికి ఈ సంస్థ ఆధ్వర్యంలో సెట్విన్ మినీ బస్సులను కూడా నడుపుతోంది. ఈ బస్సు సేవలు 1979, అక్టోబరులో ప్రారంభించబడ్డాయి. నాణ్యత లేని బస్సులు, అధిక ప్రమాదాల కారణంగా నిలిపివేయబడిన సెట్విన్ మినీ బస్సు సర్వీసులు. 2006లో మళ్ళీ ప్రారంభమయ్యాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Setwin popular with unemployed youth". The Times of India. 15 July 2003. Archived from the original on 3 January 2013. Retrieved 10 July 2021.
  2. "SETWIN to be extended". Business Line. Retrieved 10 July 2021.
  3. "Archived copy". Archived from the original on 2013-12-02. Retrieved 10 July 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "SETWIN buses back on roads". The Hindu. Chennai, India. 4 September 2006. Archived from the original on 1 May 2008. Retrieved 10 July 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సెట్విన్&oldid=4387272" నుండి వెలికితీశారు