Jump to content

సెబాస్టియన్ పి.సి.524

వికీపీడియా నుండి
సెబాస్టియన్ పి.సి.524
దర్శకత్వంబాలాజీ సయ్యపు రెడ్డి
నిర్మాతసిద్ధారెడ్డి. బి, ప్ర‌మోద్, రాజు
తారాగణం
ఛాయాగ్రహణంరాజ్ కే న‌ల్లి
కూర్పువిప్ల‌వ్ నైశా‌దం
సంగీతంజిబ్రాన్‌
నిర్మాణ
సంస్థ
జోవిత సినిమాస్
విడుదల తేదీ
2022 మార్చి 4
సినిమా నిడివి
129 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

సెబాస్టియన్‌ పి.సి.524 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జోవిత సినిమాస్ బ్యానర్‌పై సిద్ధారెడ్డి. బి, ప్ర‌మోద్, రాజు నిర్మించిన ఈ సినిమాకు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. సెబాస్టియ‌న్ పి.సి. 524” ఫ‌స్ట్ లుక్‌ని దర్శకుడు హరీష్ శంకర్ ఆన్‌లైన్‌లో జూలై 15న‌ విడుద‌ల చేశాడు.[2]ఈ సినిమా  టీజర్‌ను ఫిబ్రవరి 5న విడుదల చేశారు.[3]. కిరణ్ అబ్బవరం, నువేక్ష, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్‌ అయ్యంగర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని మార్చి 4న విడుదలైంది..[4]

సెబాస్టియన్ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) తల్లిదండ్రుల కోరిక మేరకు పోలీస్ ఉద్యోగం సాధించి మదనపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తుంటాడు. అతనికి రేచీక‌టి. అప్పటివరకు తన రేచీకటితో ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను పోలీస్ స్టేషన్ లో కూడా కేవలం మార్నింగ్ డ్యూటీలతో నెట్టుకొస్తాడు. ఈ క్రమంలో అతనికి ఒక రోజు నైట్ డ్యూటీ వేస్తారు. కానీ, త‌నకున్న స‌మ‌స్య వ‌ల్ల ఓరోజు ఆప‌ద‌లో ఉన్న నీలిమ (కోమ‌లీ ప్రసాద్‌) హ‌త్యకు గురై చ‌నిపోతుంది, ఫ‌లితంగా అత‌ను స‌స్పెండ్ అవుతాడు. అస‌లు ఆమెను హ‌త్య చేసిందెవ‌రు? ఈ క్రమంలో అతను ఎదుర్కొనే సవాళ్లేంటి? ఈ హత్య కేసును ఎలా ఛేధించాడు? అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "హేలి... నీ మాట వింటే"  కపిల్‌ కపిలాన్‌ 4:02
2. "రాజాధి రాజాధి రాజో రాజా"  పద్మలత 3:27

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: సిద్ధారెడ్డి. బి, ప్ర‌మోద్, రాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలాజీ సయ్యపు రెడ్డి
  • సంగీతం: జిబ్రాన్‌
  • సినిమాటోగ్రఫీ: రాజ్ కే న‌ల్లి
  • ఎడిటర్: విప్ల‌వ్ నైశా‌దం
  • ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎల్. మదన్
  • పాటలు: సనపాటి భరద్వాజ పాత్రుడు
  • గాయకులు: కపిల్‌ కపిలాన్‌, పద్మలత

మూలాలు

[మార్చు]
  1. Zee Cinemalu (4 February 2022). "సెబాస్టియన్ 'పి.సి.524'" (in ఇంగ్లీష్). Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
  2. 10TV (16 July 2020). "కిరణ్ అబ్బవరం.. 'సెబాస్టియ‌న్ P.C. 524'.. రిపోర్టింగ్ from మదనపల్లి పోలీస్ స్టేషన్.. Kiran Abbavaram". 10TV (in telugu). Archived from the original on 22 జూన్ 2021. Retrieved 22 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Eenadu (5 February 2022). "ఒక రాత్రి వీళ్లకీ కళ్లు కనబడకుండా చూడు: కిరణ్‌ అబ్బవరం". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
  4. Suryaa (1 February 2022). "'సెబాస్టియన్ పి.సి. 524' రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
  5. NTV (3 March 2022). "రివ్యూ: సెబాస్టియ‌న్ పి.సి. 524". Archived from the original on 3 మార్చి 2022. Retrieved 4 March 2022.