సైతాన్ (వెబ్​సిరీస్‌)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సైతాన్ 2023లో విడుదలైన వెబ్ సిరీస్. హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పణలో మహి. వి. రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి నిర్మించినా ఈ వెబ్ సిరీస్ కు మహి. వి. రాఘవ్ దర్శకత్వం వహించాడు. రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్స్ తో జూన్ 15న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]

కథ[మార్చు]

సావిత్రి (షెల్లీ నబు కుమార్)కు బాలి(రుషి), జ‌యప్ర‌ద‌(దేవ‌యాని), గుమ్తి (జాఫ‌ర్ సాధిక్‌) ముగ్గురు పిల్లలు. భర్త వదిలేసి వెళ్లడంతో పిల్ల‌ల్ని పోషించ‌డం కోసం యాకుబ్ అలీ అనే పోలీస్ కానిస్టేబుల్‌తో స‌హ‌జీవ‌నం చేస్తుంది. త‌ల్లి చేసే ప‌ని ఆమె పిల్ల‌లకు న‌చ్చ‌దు. దింతో బాలి కుటుంబాన్ని క‌ష్ట‌ప‌డి పోషించాల‌ని అనుకోని పని కోసం వెతకగా అతనికి పని దొరకదు. ఈ క్రమంలో బాలి అనుకోని ప‌రిస్థితుల్లో యాకుబ్ అలీని చంపి జైలుకెళ్లి తిరిగి వచ్చి కుటుంబం కోసం బాలి జైలుకెళ్లాడు. అక్క‌డ నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా నక్సలైట్లలో క‌లుస్తాడు. నేర‌మ‌య సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన బాలి జీవితం చివ‌ర‌కు ఏమైంది? బాలి జీవితం చివ‌ర‌కు ఏ మ‌లుపు తిరుగుతుంది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: హాట్‌స్టార్ స్పెషల్స్
  • నిర్మాత: మహి. వి. రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహి. వి. రాఘవ్[3]
  • సంగీతం: శ్రీరామ్ మద్దూరి
  • సినిమాటోగ్రఫీ: షణ్ముగ సుందరం
  • ఆర్ట్: రాజ్ కుమార్ మురుగేశన్
  • ఎడిటర్: శ్రవణ్

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (15 June 2023). "ఓటీటీలోకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ అండ్ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ 'సైతాన్‌'.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (18 June 2023). "రివ్యూ: సైతాన్‌ (వెబ్‌సిరీస్‌)". Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.
  3. Andhra Jyothy (18 June 2023). "సంకెళ్లు వేస్తానంటే...ఓటీటీలెందుకు?". Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.