మల్లెడి రవికుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లెడి రవికుమార్
జననం (1980-10-05) 1980 అక్టోబరు 5 (వయసు 43)
వృత్తిరంగస్థల, సినిమా నటుడు
తల్లిదండ్రులునరసింహారావు - లక్ష్మి

మల్లెడి రవికుమార్ తెలుగు నాటకరంగ, సినిమా నటుడు. అనేక నాటకాల్లో, సినిమాల్లో నటించిన రవికుమార్, 2023లో వచ్చిన సైతాన్ వెబ్‌సీరీస్ లోని సాంబన్న పాత్రతో గుర్తింపు పొందాడు.[1]

జననం, విద్య

[మార్చు]

రవికుమార్ 1980, అక్టోబరు 5న నరసింహారావు -  లక్ష్మి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని కొత్తపేటలో జన్మించాడు. విజయవాడలోని రాజా హైస్కూలులో విద్యను, ఎస్ఏఎస్ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీలను, ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఎం.కాంను చదివాడు. ఆ తరువాత పడాల రామిరెడ్డి కళాశాలలో ఎల్.ఎల్.బి. పూర్తిచేసి వి.జి. శివకుమార్, పల్లెం చిట్టిబాబు వంటి న్యాయవాదుల దగ్గర మెళకువలు నేర్చుకొని 2012 నుండి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు.[2]

నాటకరంగం

[మార్చు]

తన తండ్రి నరసింహారావు, మామ లంకాడ గోవిందరాజు ప్రోత్సాహంతో రవికుమార్, నటనారంగంలోకి అడుగుపెట్టాడు. ఇంటర్మీడియట్ చదుతున్నప్పుడు నాటకరంగ దర్శకులు పుప్పాల శ్రీనివాస్, పిళ్ళా నటరాజ్, ఎం.ఎస్. చౌదరి[3] దగ్గర నటనలో శిక్షణ పొందాడు. నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్ కళాశాలల యువజనోత్సవాలలోని నాటక పోటీలో పాల్గొని తన నట జీవితాన్ని ప్రారంభించిన రవికుమార్, తరువాత అనేక నాటకాలలో నటించాడు.

2008లో జరిగిన నంది నాటకోత్సవాలలో ఎం.ఎస్. చౌదరి దర్శకత్వంలో గిలి గిలి గిలి దుంతనక్క నాటకంలో నటించి రాష్ట్ర ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.[4][5] 2009లో పరుచూరి రఘుబాబు పరిషత్తులో ఉత్తమ నటన, ఉత్తమ విలన్ విభాగాల్లో బహుమతులతోపాటు అనేక పరిషత్తు, నాటక పోటీలలో ఉత్తమ విలన్ అవార్డులతోపాటు ఉత్తమ సహాయనటుడి అవార్డులు గెలుపొందాడు.

నటించినవి

[మార్చు]
 1. రుద్రవీణ
 2. హెచ్చరిక
 3. గిలి గిలి గిలి దుంతనక్క (నాటకం)
 4. రాజు-పేద
 5. నచ్చావోయ్ నారాయణ
 6. పిపీలికం
 7. సంభవామి పదేపదే
 8. జజ్జనకరి జనారె (నాటకం)
 9. ఈ కథలు మార్చి చెప్పండి
 10. గుండమ్మగారి లేడీస్ హాస్టల్
 11. 5గురిలో ఆరవవాడు (నాటకం)
 12. ఒహోం ఒహోం భీం
 13. ఆ వెచ్చని సముద్ర గర్భం

సినిమారంగం

[మార్చు]

2009లో వచ్చిన జంక్షన్ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించాడు. తరువాత పలు సినిమాలలో నటించాడు. 2023లో సైతాన్ అనే వెబ్‌సీరీస్ లో సాంబన్న పాత్రలో నటించి తన నటనకు ప్రశంసలు పొందాడు.[6]

 1. జంక్షన్ (2009)
 2. మిస్టర్ రాస్కెల్
 3. రంగు (2018)
 4. చట్టం
 5. కొండా (2022)
 6. న భయం న లజ్జ
 7. ఉనికి (2022)
 8. విరూపాక్ష (2023)
 9. ధహనన్ (వెబ్‌సీరీస్)
 10. సైతాన్ (వెబ్‌సీరీస్) (2023)

మూలాలు

[మార్చు]
 1. "OTT Review: Shaitan - Telugu web series on Disney Plus Hotstar". 123telugu.com (in ఇంగ్లీష్). 2023-06-15. Archived from the original on 2023-06-15. Retrieved 2023-07-19.
 2. India, The Hans (2023-07-18). "Advocate turns actor: The Vijayawada laywer acted in Virupaksha". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-18. Retrieved 2023-07-19.
 3. Deccan Chronicle, Life Style (4 June 2019). "Factory of dreams". Deccan Chronicle. K Kalyan Krishna Kumar. Archived from the original on 2 July 2019. Retrieved 19 July 2023.
 4. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది నాటక బహుమతులు 2007". apsftvtdc.in. Archived from the original on 2023-07-25. Retrieved 2023-07-25.
 5. 2008 నంది నాటకోత్సవ బహుమతులు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.711.
 6. "'Shaitan' web series review: Director Mahi V Raghav's partly engaging survival". The Hindu. 2023-06-17. ISSN 0971-751X. Archived from the original on 2023-06-17. Retrieved 2023-07-19.

బయటి లింకులు

[మార్చు]