Jump to content

సైనా (సినిమా)

వికీపీడియా నుండి

సైనా
దర్శకత్వంఅమోల్ గుప్తే
రచనఅమోల్ గుప్తే
అమితోష్‌ నగపాల్‌(డైలాగ్స్‌)
దీనిపై ఆధారితంసైనా నెహ్వాల్
నిర్మాతభూషణ్‌కుమార్‌
కృష్ణన్‌ కుమార్‌
సుజయ్‌ జైరాజ్‌
రాశేష్‌ షా
తారాగణంపరిణీతి చోప్రా
మానౌవ్‌ కౌల్
ఛాయాగ్రహణంపీయూష్ షా
కూర్పుదీపా భాటియా
సంగీతంఅమాల్‌ మాలిక్‌
నిర్మాణ
సంస్థలు
టి-సిరీస్‌ ఫిల్మ్స్‌
‌ఫ్రంట్‌ ఫుట్‌ పిక్చర్స్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
26 మార్చి 2021 (2021-03-26)[1]
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన హిందీ చిత్రం 'సైనా". పరిణీతి చోప్రా ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా 2021 మార్చి 26న విడుదలైంది. 23 ఏప్రిల్ ‌2021న ఓటీటీలో "అమెజాన్‌ ప్రైమ్"‏లో విడుదలైంది.[2]

ఒక చిన్న పట్టణంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన బాలిక సైనా నెహ్వాల్‌ (పరిణీతి చోప్రా). చిన్నప్పటి నుంచి ఆమెకు బ్యాడ్మింటన్‌ అంటే ఎంతో ఇష్టం. కుమార్తె ఇష్టాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఎలాగైనా ఆమె బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిని చేయాలనుకుంటారు. షటిల్‌ కాక్స్‌ కొనడానికి సైతం అప్పులు చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సైనా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది? ఆమెను వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపింది ఎవరు? అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణించింది? ఆమె జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎలా ప్రభావితం చేశాయి? అన్నదే సినిమా కథ.[3]

నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు

[మార్చు]
  • పరిణీతి చోప్రా - సైనా నెహ్వాల్
  • నైషా కౌర్ భటోయే - సైనా నెహ్వాల్ చిన్ననాటి పాత్ర
  • మానౌవ్‌ కౌల్ - పుల్లెల గోపీచంద్|రాజన్ సర్
  • ఇషాన్ నాక్వి- పారుపల్లి కశ్యప్
  • మేఘనా మాలిక్ - ఉష రాణి నెహ్వాల్, సైనా తల్లిగా[4]
  • సుభ్రజ్యోతి భారత్ - హర్వీర్ సింగ్ నెహ్వాల్, సైనా తండ్రిగా[4]
  • అంకుర్ వికాల్ - జీవన్ కుమార్
  • తావిద్ రైక్ జమాన్ - రోహన్ స్నేహితుడిగా
  • ష్రర్మాన్ దే - దామోదర్
  • సమీర్ బస్సి - రోహన్

మూలాలు

[మార్చు]
  1. Outlook India (2 మార్చి 2021). "Parineeti Chopra-starrer Saina Nehwal biopic to release in March". Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 ఏప్రిల్ 2021.
  2. Republic World (24 ఏప్రిల్ 2021). "Saina movie available on Amazon Prime Video, here's how you can watch the film" (in ఇంగ్లీష్). Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 ఏప్రిల్ 2021.
  3. Andhrajyothy (29 ఏప్రిల్ 2021). "'సైనా'.. నిరాశేనా?". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 ఏప్రిల్ 2021.
  4. 4.0 4.1 "Saina trailer out. Parineeti Chopra-starrer promises to be an inspiring ride". India Today. Retrieved 8 మార్చి 2021.