Jump to content

దీపా భాటియా

వికీపీడియా నుండి
దీపా భాటియా
జననం
భారతదేశం
వృత్తిఎడిటర్, దర్శకురాలు
జీవిత భాగస్వామిఅమోల్ గుప్తే
పిల్లలుపార్థో గుప్తే

దీపా భాటియా ముంబైలో ఉన్న బాలీవుడ్ ఫిల్మ్ ఎడిటర్, నిర్మాత, దర్శకురాలు. ఆమె తారే జమీన్ పర్, మై నేమ్ ఈజ్ ఖాన్, రాక్ ఆన్, కై పో చే, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, రయీస్ వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలను ఎడిటింగ్ చేయడంలో పేరుగాంచింది.[1] ఆమె కేదార్‌నాథ్ (2018), డ్రైవ్ (2019), సచిన్ టెండూల్కర్‌ బయోపిక్, సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ వంటి చిత్రాలను కూడా ఎడిట్ చేసింది.[2]

అలాగే భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన హిందీ చిత్రం సైనా (2021)కి కూడా ఆమె ఎడిటర్. ఈ చిత్రంలోని ముఖ్యపాత్ర పరిణీతి చోప్రా పోషించింది.[3]

నీరోస్ గెస్ట్స్: ది ఏజ్ ఆఫ్ ఇనీక్వాలిటీ అనే డాక్యుమెంటరీకి ఆమె దర్శకత్వం వహించింది.[4]

కెరీర్

[మార్చు]

సహాయ దర్శకురాలిగా ఆమె తన కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత, పూర్తి స్థాయి పోస్ట్ ప్రొడక్షన్‌లోకి ప్రవేశించింది. ఆమెకు ఎడిటర్‌గా 20 నుండి 30 ఏళ్ల అనుభవం ఉంది. గోవింద్ నిహలానీ (దేవ్, హజార్ చౌరాసి కి మా, దేహం), జహ్ను బారువా (మైనే గాంధీ కో నహీ మారా, హర్ పాల్) వంటి దర్శకులతో కలిసి ఆమె పనిచేసింది.[5] కై పో చే, రాక్ ఆన్ వంటి చిత్రాలు ఆమె ఎడిటింగ్ లో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు. వీటికి ఆమె స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వంటి అవార్డులను ఎన్నో పొందింది.[6]

బాలీవుడ్‌లో ఫిల్మ్ ఎడిటర్‌గా ఆమె కెరీర్‌తో పాటు, మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై నీరోస్ గెస్ట్స్: ది ఏజ్ ఆఫ్ ఇనీక్వాలిటీ అనే పేరుతో విమర్శకుల ప్రశంసలు పొందిన డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించి, నిర్మించింది.[7] ఈ డాక్యుమెంటరీ ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (MIFF)లో రెండు అవార్డులను గెలుచుకుంది.[8] ఈ ఛాలెంజింగ్ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించడానికి ఆమె 5 సంవత్సరాలు, ఎడిట్ చేయడానికి ఒక సంవత్సరం పట్టింది.[9]

2009లో నీరోస్ గెస్ట్స్ అనే డాక్యుమెంటరీ సినిమాకు ఆమె దర్శకత్వం వహించింది. ఇందులో పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకుడిగా ఉన్న భారతదేశంలో పేరు గాంచిన జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ కూడా ఉన్నాడు. ఆయన జర్నలిజం విభాగంలో 2007వ సంవత్సరపు రామన్ మెగసెసె పురస్కార గ్రహీత. హిందూ పత్రికలో గ్రామీణ వ్యవహారల ఎడిటర్‌గా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన చేసిన పనిని మెచ్చి నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యా సేన్ "ఆకలి, కరువుల వంటి విషయాలపై నేడు ప్రపంచం లోని ఉత్తమ పరిశోధకులలో ఒకరు" అని ప్రశంచించారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

దీపా భాటియా స్క్రీన్ రైటర్ అమోల్ గుప్తేని వివాహం చేసుకుంది. వారికి పార్థో గుప్తే అనే కుమారుడు ఉన్నాడు.[10] ఆమె సోఫియా పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థి.[11][12]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

ఎడిటర్

[మార్చు]
సంవత్సరం సినిమా నోట్స్
1998 హజార్ చౌరాసి కి మా
1999 తక్షక్
2004 దేవ్
2005 మైనే గాంధీ కో నహిం మారా
ది హ్యాండ్ మ్యాన్
2007 తారే జమీన్ పర్
2008 రాక్ ఆన్!!
2010 మై నేమ్ ఈజ్ ఖాన్
2011 స్టాన్లీ కా డబ్బా నిర్మాత
2012 ఫెరారీ కి సవారీ
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్
2013 కై పో చే!
బాంబే టాకీస్
2014 హవా హవాయి
ప్లేసిబో (డాక్యుమెంటరీ) కన్సల్టింగ్ ఎడిటర్[13]
ఉంగ్లీ
2016 జుబాన్
ఫితూర్
2017 రయీస్
సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్
డాడీ
2018 కేదార్నాథ్
2019 డ్రైవ్
2021 స్కేటర్ గర్ల్

పురస్కారాలు

[మార్చు]

స్టార్ స్క్రీన్ అవార్డులు

మూలాలు

[మార్చు]
  1. "Deepa Bhatia – JNAF". Retrieved 2019-11-23.
  2. "Deepa Bhatia on her cutting (edge) career (and how it came together)". The Times of India (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-06-07. Retrieved 2019-11-23.
  3. Republic World (24 April 2021). "Saina movie available on Amazon Prime Video, here's how you can watch the film" (in ఇంగ్లీష్). Archived from the original on 24 ఏప్రిల్ 2021. Retrieved 24 April 2021.
  4. "EDITOR'S CUT". epaper.timesofindia.com. Retrieved 2017-09-26.
  5. "Magic Lantern Movies LLP". magiclanternmovies.in. Retrieved 2019-11-23.
  6. Jani, Shruti (2018-03-23). "5 Women Editors in Indian Cinema We Should Know About". Feminism in India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-11-23.
  7. oberon.nl, Oberon Amsterdam, Nero's Guests | IDFA, retrieved 2019-11-23
  8. "EDITOR'S CUT". epaper.timesofindia.com. Retrieved 2017-09-26.
  9. "Deepa Bhatia on her cutting (edge) career (and how it came together)". The Times of India (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-06-07. Retrieved 2019-11-23.
  10. "Roast of Patriarchy | Latest News & Updates at Daily News & Analysis". Daily News and Analysis (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-11-19. Retrieved 2017-09-26.
  11. "Film editor Deepa Bhatia to turn director". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-08-22. Retrieved 2017-11-25.
  12. "'Sachin: A Billion Dreams': You don't have to be a cricket fan to love the biopic". The News Minute. 2017-05-26. Retrieved 2017-11-25.
  13. Ramnath, Nandini. "Documentary 'Placebo' offers a dose of student life, and it isn't easy to swallow". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2017-09-26.