Jump to content

సోనాల్ కౌశల్

వికీపీడియా నుండి
సోనాల్ కౌశల్
జననం (1991-06-21) 1991 జూన్ 21 (వయసు 33)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుది మోటార్ మౌత్[1]
వృత్తివాయిస్ ఆర్టిస్టు / డబ్బింగ్ ఆర్టిస్టు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
డోరేమాన్ హిందీ వాయిస్
జీవిత భాగస్వామి
ఉత్కర్ష్ బలి
(m. 2020)

సోనాల్ కౌశల్ భారతీయ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, చిన్నపిల్లల ధారావాహిక డోరేమాన్‌లో ప్రధాన పాత్ర అయిన డోరేమాన్ కు గాత్రదానం చేసి ప్రసిద్ధి చెందింది.

ఆమె పలు కార్టూన్ ధారావాహికలలో అనేక పాత్రలకు గాత్రదానం చేసినందున ఆమెను ది మోటర్ మౌత్ అని గుర్తింపుతెచ్చుకుంది. ఆమె బంద్‌బుద్ ఔర్ బుడ్‌బాక్‌లో బుద్‌దేవ్, లిటిల్ సింఘంలో బబ్లీ.. ఇలా మరెన్నో పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్గ్ గా చేసింది.[2][3]

పవర్ రేంజర్స్ మెగాఫోర్స్, పవర్ రేంజర్స్ సూపర్ మెగాఫోర్స్‌లలో ఎమ్మా గూడాల్ వాయిస్ ఆమె చేసింది. ఆమె మాలిబు రెస్క్యూ, మాలిబు రెస్క్యూ: ది నెక్స్ట్ వేవ్, మాలిబు రెస్క్యూ టీవీ సిరీస్‌లలో గినాకు కూడా గాత్రదానం చేసింది. ఆమె జానీ టెస్ట్, దాని పునరుద్ధరణ కార్యక్రమంలో కూడా హిందీ డబ్బింగ్ వాయిస్ అందించింది.

కెరీర్

[మార్చు]

సోనాల్ కౌశల్ డబ్బింగ్ కెరీర్ 8 ఏళ్ల వయసులో మొదలుపెట్టింది. 2005లో ఆమె డబ్బింగ్ చెప్పిన పాత్ర డోరేమాన్. దీంతో ఆమె ఒక్కసారిగా వేలాది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె దిమోటర్మౌత్ (TheMotorMouth) పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది, అక్కడ ఆమె వివిధ పాత్రలకు గాత్రదానం చేయడంతో పాటు ఇతర వాయిస్ ఆర్టిస్టులను కూడా ఇంటర్వ్యూ చేసింది.[4] 2023లో స్టూడియో 88 పిక్చర్స్ ద్వారా స్టార్ వార్స్ విజన్స్ సీజన్ 2లో బండిట్స్ ఆఫ్ గోలక్ అనే షార్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ లో ఆమె ప్రధాన పాత్ర రాణికి గాత్రదానం చేసింది.[5][6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

యానిమేటెడ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర నోట్స్
2005–2020 డోరేమాన్ డోరేమాన్
2015–ప్రస్తుతం బంద్‌బుద్ ఔర్ బుడ్‌బాక్ బుద్ధదేవ్
2019–ప్రస్తుతం లిటిల్ సింగం బబ్లీ
2020–ప్రస్తుతం పినాకి అండ్ హ్యాపీ పినాకి, టిటూ
2010-ప్రస్తుతం ఛోటా భీమ్ భీమ్
2023 స్టార్ వార్స్: విజన్స్ రాణి ఎపిసోడ్: "ది బాండిట్స్ ఆఫ్ గోలక్"

బాలీవుడ్ సినిమాలు

[మార్చు]
సినిమా నటుడు పాత్ర భాష సంవత్సరం
ప్రీకీ అలి ఎమీ జాక్సన్ మేఘా హిందీ 2016
ది బాడీ వేదిక తు/ఇషా హిందీ 2019

మూలాలు

[మార్చు]
  1. "YouTube Channel". YouTube. Retrieved 23 May 2020.
  2. "Meet Sonal Kaushal, Doraemon's Hindi voice". femina.in.
  3. Sharma, Sunil (14 April 2019). "महज 6 वर्ष की उम्र में शुरू की वॉइस रिकॉर्डिंग, पलक झपकते बनी पूरे इंडिया की पसंद" [Voice recording started at the age of just 6, became the choice of whole India in the blink of an eye]. Patrika News (in హిందీ).
  4. "ভবিষ‍্যতের ক‍্যাট রোবট, দীর্ঘ ১২ বছর ধরে ভারতে জাপানি কার্টুন ডোরেমনের হিন্দি ডাবিং করছেন সোনল". banglahunt.com. 14 July 2020.
  5. ""Star Wars: Visions" The Bandits of Golak". imdb.com. 3 May 2023.
  6. "With Star Wars: Visions Volume 2, Creators from Around the World". starwars.com. 4 May 2023.