అక్షాంశ రేఖాంశాలు: 17°35′28″N 79°18′04″E / 17.5912°N 79.3012°E / 17.5912; 79.3012

సోమిడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోమిడి
—  రెవెన్యూ గ్రామం  —
సోమిడి is located in తెలంగాణ
సోమిడి
సోమిడి
అక్షాంశరేఖాంశాలు: 17°35′28″N 79°18′04″E / 17.5912°N 79.3012°E / 17.5912; 79.3012
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ
మండలం కాజీపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 506003
ఎస్.టి.డి కోడ్

సోమిడి తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, కాజీపేట మండలంలోని గ్రామం.[1] ఇది కాజీపేట 52వ డివిజన్ పరిధిలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని హన్మకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన కాజీపేట మండలం (హన్మకొండ జిల్లా) లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది. [3]

సమీప గ్రామాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో కాజీపేట, తరాలపల్లి, కడిపికొండ, కొత్తపల్లి, బట్టుపల్లి, అమ్మవారిపేట, రాంపూర్, మడికొండ, శాయంపేట మొదలైన గ్రామాలు ఉన్నాయి.[4]

ఉపప్రాంతాలు

[మార్చు]

ఇక్కడ వెంకటాద్రినగర్, సిద్ధార్థనగర్, సిద్ధార్థనగర్, భవాని నగర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ మొదలైనవి సోమిడి ఉపప్రాంతాలు.[5]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • గణపతి దేవాలయం
  • సాయిబాబా దేవాలయం
  • ఆంజనేయస్వామి దేవాలయం
  • మహంకాళి దేవాలయం
  • మస్జిద్ ఇ మహమ్మద్ ఫసీహ్
  • మదరసా దారుల్ ఖురాన్

విద్యాసంస్థలు

[మార్చు]
  • చైతన్య డిగ్రీ కళాశాల
  • రైల్వే జూనియర్ కళాశాల
  • నేతాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్
  • సెయింట్ ఆన్స్ హైస్కూల్
  • రైల్వే మిక్స్‌డ్ స్కూల్
  • సెయింట్ ఫ్రాన్సిస్ అక్షర హైస్కూల్

రవాణా

[మార్చు]

సమీప రైల్వేస్టేషను హసన్‌పర్తి, కాజీపేట, వరంగల్లు పట్టణాలలో ఉంది. ఈ పట్టణాల నుండి రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది.

ఇతర వివరాలు

[మార్చు]
  • వైద్య చికిత్స కోసం ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.[6]
  • రెండవ విడత మిషన్ కాకతీయ పనుల్లో సోమిడి ఊర చెరువును ఎంపిక చేసి దాదాపు రూ. 65 లక్షల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టి, జేసీబీల సహకారంతో మట్టిని తీసి వ్యయసాయ భూముల్లోకి తరలించారు. చెరువు లోతు గణనీయంగా పెరగడంతో దీనిద్వారా దాదాపు 102 ఎకరాల్లో ఖరీఫ్, రబీ పంటలు పండుతాయి.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "Somidi Village in Warangal Urban district of Telangana". study4sure.com. Retrieved 2021-11-18.
  5. "Somidi Road, Rahamatnagar, Kazipet Locality". www.onefivenine.com. Retrieved 2021-11-18.
  6. "'వ్యాక్సీన్ తీసుకున్నా కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి'". ETV Bharat News. 2021-01-19. Archived from the original on 2021-11-18. Retrieved 2021-11-18.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సోమిడి&oldid=4325963" నుండి వెలికితీశారు