Jump to content

సోరెంగ్ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 27°12′N 88°12′E / 27.2°N 88.2°E / 27.2; 88.2
వికీపీడియా నుండి
సోరెంగ్ జిల్లా
ఏప్రిల్ చివరిలో పూర్తిగా వికసించిన పువ్వులతో వర్సే రోడోడెండ్రాన్ అభయారణ్యం,
ఏప్రిల్ చివరిలో పూర్తిగా వికసించిన పువ్వులతో వర్సే రోడోడెండ్రాన్ అభయారణ్యం,
Location in Sikkim
Location in Sikkim
Coordinates: 27°12′N 88°12′E / 27.2°N 88.2°E / 27.2; 88.2
దేశం భారతదేశం
రాష్ట్రం సిక్కిం
ప్రధాన కార్యాలయంసోరెంగ్
కాల మండలంUTC+05:30 (IST)
ISO 3166 codeIN-SK

సోరెంగ్ జిల్లా, సిక్కిం రాష్ట్రంలోని గ్యాల్‌షింగ్ జిల్లాను విభజించగా కొత్తగా ఏర్పడింది. ఈ జిల్లా విస్తీర్ణం 176.40 చ.కి. జిల్లా ముఖ్యపట్టణం సోరెంగ్ పట్టణం.[1] సోరెంగ్ జిల్లా అధికారికంగా పశ్చిమ సిక్కిం (ఇప్పుడు గ్యాల్‌షింగ్ జిల్లా) నుండి 2021 డిసెంబరులో సిక్కిం జిల్లాల పునర్య్వస్థీకరణ చట్టం 2021 ప్రకారం ఆరవ జిల్లాగా ఏర్పడింది. సోరెంగ్ పట్టణం 27.17˚ ఉత్తర 88.20˚ తూర్పున ఉంది. జిల్లాలో మే నుండి నవంబరు వరకు ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ఎత్తైన ప్రదేశాల కారణంగా ఈ జిల్లా ట్రెక్కింగ్ చేసేవారికి చాలా ఇష్టపడతారు. జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. అయితే చాలా భూమి అగాధం, రాతి పొరల కారణంగా సాగుకు పనికిరాకుండా మిగిలిపోయింది.[2]

జిల్లా ముఖ్య పట్టణం సోరెంగ్‌ నుండి రాజధాని గ్యాంగ్‌టాక్‌ను కలుపుతూ రహదారి ఉంది. జిల్లాలో ప్రధాన భాష నేపాలీ. ఇక్కడ మాట్లాడే ఇతర భాషలు భూటియా, లెప్చా, లింబు, నెవారి, రాయ్, గురుంగ్, మంగర్, షెర్పా, తమంగ్, సన్వర్ మొదలైనవి. జిల్లాలోని ప్రధాన పట్టణాలు సోరెంగ్, నయాబజార్, కలుక్, మంగళ్‌బరే, సోంబరే, దరామ్‌దిన్, చకుంగ్, రించెన్‌పాంగ్, రేషి. ఈ జిల్లా గ్యాల్‌షింగ్, నాంచితో, దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో సరిహద్దులను పంచుకుంటుంది. దీనికి పశ్చిమాన నేపాల్‌తో అంతర్జాతీయ సరిహద్దు కూడా ఉంది.[3]

జనాభా

[మార్చు]
2011 భారతజనాభా లెక్కల ఆధారంగా సోరెంగ్ జిల్లాలో మతాల ప్రకారం జనాభా[4]
హిందూజం
  
49.77%
బౌద్ధులు
  
27.42%
క్రైస్తవులు
  
13.37%
ఇతరులు ( ప్రధానంగా కిరాత్ ముందం)
  
8.72%
ఇస్లాం
  
0.45%
ఇతర లేదా పేర్కొనబడనివారు
  
0.27%

2011 జనాభా లెక్కల ప్రకారం, ఇప్పుడు సోరెంగ్ జిల్లా మొత్తం జనాభా 64,760. ప్రతి 1000 మంది పురుషులకు 959 మంది స్త్రీల నిష్పత్తి ఉంది. అక్షరాస్యత రేటు 77.68%. జనాభాలో 1.91% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుకు చెందినవారు 2,544 (3.93%) మంది 25,970 (40.10%) వరుసగా ఉన్నారు.[5]


సోరెంగ్ జిల్లాలో భాషలు (2011)[6]

  నేపాలీ (65.11%)
  లింబు భాష (14.13%)
  లెప్చా భాష (5.05%)
  షెర్పా భాష (3.47%)
  తమంగ్ భాష (3.39%)
  సిక్కిమీస్ భాష (2.62%)
  కిరంతి భాషలు (1.97%)
  హిందీ (1.45%)
  ఇతర భాషలు (2.81%)

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలోని జనాభాలో 65.11% మంది నేపాలీ, 14.13% లింబు, 5.05% లెప్చా, 3.47% షెర్పా, 3.39% తమాంగ్, 2.62% భోటియా, 1.97% రాయ్, 1.45% హిందీ వారి మాతృభాషగా మాట్లాడతారు.[7]

జిల్లా చరిత్ర

[మార్చు]

సోరెంగ్ జిల్లా సముద్ర మట్టానికి 500 మీటర్ల నుండి 2600 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ జిల్లాలో వ్యవసాయ భూములు విస్తారంగా ఉన్నాయి. వసంతకాలంలో ప్రత్యేకమైన టెర్రస్ వాలుల అలలతో కనులవిందు గావించే ప్రదేశాలతో ఉంటుంది. విస్తారంగా వ్యాపించిన అడవులతో, గ్రామీణ ప్రాంతాలతో, మొత్తం 17640 హెక్టార్ల వైశాల్యంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం దీని మొత్తం జనాభా సుమారు 65,000. సోరెంగ్ పట్టణం సోరెంగ్ జిల్లాకు ప్రధాన కార్యాలయం. ఇది సముద్రమట్టానికి 8500 అడుగుల ఎత్తులో, కొండల మధ్య ఉంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, విస్తారమైన లోయలు పర్యాటకుల దృష్టిని మరింత ఆకర్శించి, విస్తృత దృశ్యాలను అందిస్తుంది. సోరెంగ్ రాజధాని గాంగ్‌టక్ , సోరెంగ్ పట్టణానికి 100 కి.మీ దూరంలో ఉంది. పశ్చిమ బెంగాల్ నుండి సిక్కింలో ప్రవేశించడానికి ప్రవేశ ద్వారం అయిన సిలిగురికి సుమారు 95 కి.మీ దూరంలో ఉంది. సోరెంగ్ నుండి సమీప రైల్వే స్టేషన్ న్యూ జల్పైగురి (NJP) సుమారు 115 కి.మీ, సమీప విమానాశ్రయం బాగ్డోగ్రా సుమారు 130 కి.మీ దూరంలో ఉన్నాయి. జోరెథాంగ్‌లోని అకార్ వంతెన నాంచి జిల్లా నుండి సోరెంగ్ జిల్లాకు ప్రవేశ స్థానంగా గుర్తింపు పొందింది. సామాన్య మతపరమైన ప్రజలు, కొన్ని పురాతన మఠాలు, గొప్ప ప్రకృతి సౌందర్యం, వ్యవసాయ సమాజం, శాంతి, ప్రశాంతతతో కూడిన వాతావరణంతో నిండి ఉంటుంది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతం.[8]

వాతావరణం

[మార్చు]

సోరెంగ్ వివిధ రకాల వాతావరణ పరిస్థితులతో కూడుకుని ఉంది. సగటు వార్షిక వర్షపాతం 162.5 సెం.మీ.లు. ఇక్కడి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 17-27 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 02-21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. జిల్లాలో రించెన్‌పాంగ్‌లోని రించెన్‌పుంగ్ మొనాస్టరీ, శ్రీ బాదంలోని శ్రీ బాదం ఫంట్‌షాగ్ న్గాయాబ్లింగ్ మొనాస్టరీ పురాతన మఠాలలో ఉన్నాయి. ఇతర ముఖ్యమైన ప్రదేశాలు రించెన్‌పాంగ్, కలుక్, సబ్‌గాడోర్జీ.

ఉప విభాగాలు

[మార్చు]

సోరెంగ్ జిల్లా, మంగళ్‌బరే జిల్లాలోని ఉపవిభాగాలు కొన్ని కలిసి ఉంటాయి. వాటిలో రించెన్‌పాంగ్, కమ్లింగండ్ సోంబారియా, డారండిన్ ముఖ్యమైన పట్టణాలు. సోరెంగ్ నుండి 11 కి.మీ దూరంలో ఉన్న వర్సే రోడోడెండ్రాన్ అభయారణ్యం పశ్చిమ సిక్కింలోని సింగలిలా శ్రేణిలో 104 కి.మీ. ప్రాంతాన్ని ఆక్రమించింది. సోరెంగ్ జిల్లాలో 4 శాసనసభ నియోజకవర్గాలు, 1 నగర పంచాయతీ, 33 గ్రామ పంచాయతీలు, 11 రెవెన్యూ సర్కిల్‌లు, 48 రెవెన్యూ బ్లాక్‌లు ఉన్నాయి.

పర్యాటకం

[మార్చు]

జిల్లాలో మఠాలు, తోటలు, కొండలు, జలపాతాలు, ట్రెక్కింగ్ జోన్‌ల వంటి అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. బార్సీ రోడోడెండ్రాన్ అభయారణ్యం, భిర్ దారా, అంగనే దారా చకుంగ్, రాక్ గార్డెన్ జూమ్, బృందాబన్ ధామ్, స్వర్గానికి మెట్ల మార్గం, పాయిజన్ లేక్ రించెన్‌పాంగ్ వంటివి వీటిలో ప్రముఖమైనవి.

భౌగోళిక సరిహద్దులు

[మార్చు]

దానికి పశ్చిమాన నేపాల్, ఉత్తరాన గ్యాల్‌షింగ్ జిల్లా, తూర్పున నాంచి జిల్లా, దక్షిణాన పశ్చిమ బెంగాల్‌ లోని డార్జిలింగ్ జిల్లాతో సరిహద్దులను పంచుకుంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "Sikkim forms Soreng and Pakyong districts, total number rises to six". www.telegraphindia.com. Retrieved 2022-06-21.
  2. "Website of Soreng District, Govt of Sikkim | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-11-20.
  3. https://www.sikkim.gov.in/media/press-release/press-info?name=Press+Release+from+DPO+Zilla&id=132977
  4. "Table C-01 Population by Religion: Sikkim". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  5. "District Census Hand Book – Sikkim" (PDF). Census of India. Registrar General and Census Commissioner of India.
  6. "Table C-16 Population by Mother Tongue: Sikkim". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
  7. "Table C-16 Population by Mother Tongue: Sikkim". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
  8. "A Brief Resume Of District | Website of Soreng District, Govt of Sikkim | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-11-20.