స్ట్రయినరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Y స్ట్రయినరు
Y స్ట్రయినరు
Y-స్ట్రయినరు అడ్దుకోత చిత్రం
బాస్కెట్ ఆకృతి స్ట్రయినరు

స్ట్రయినరు అనునవి ఒక పైపులో ప్రవహిస్తున్న ద్రవం లేదా వాయువు లేదా నీటి ఆవిరి /స్టీములోని అతి తక్కువ ప్రమాణంలో వున్న ఘనపదార్థాలను వేరుచేయు పరికరం.స్ట్రయినరు అనునది ఒక వడబోత పరికరం/ వడియకట్టు సాధనము[1].అనగా ఫిల్టరు అనబడు వడబోత భాగాన్ని కల్గివున్న పరికరం. వాయువు లేదా ద్రవం గొట్తంలోప్రవాహిస్తున్నప్పుదు పైపు అరుగుదల వలన ఏర్పడిన ఇనుప రేణువులు, లేదా పైపును వెల్డింగు చేసినపుడు లోపల ఏర్పడు మిగిలిన వెల్డింగు కచ్చులు, పైపుల జాయింటుల మధ్య వుంచు ప్యాకింగు ముక్కల అవశేషాలు, పంపింగు చేయు ట్యాంకుల్లోని ఇతర మలినాలు, ప్రవాహంతో పాటు వచ్చు అవకాశం ఉంది.ఇలాంటి మలినాలు తొలగించనిచో, అవి ఏదైనా నాజిలు సన్నని రంధ్రాలద్వారా ప్రవహిస్తున్నప్పుడు వాటి రంధ్రాలను మూసి వేయును, వ్యాకుం ఎజెక్టరు నాజిల్ల రంధ్రాలు పూడుకు పోయిన వాక్యుం ఏర్పడరు.అలాగే టర్బైనులకు వెళ్ళు స్టీములోని లోహరేణువుల వలన టర్బైను ఫ్యాను బ్లేడులు పాడైపోవును.ఇలాంటి వాటిని స్ట్రయినరులో అమర్చిన ఒక ఫిల్టరు ఎలిమెంటు ద్వారా వేరు చెయ్యడం జరుగును.

స్ట్రయినరులు వాటి ఆకృతి పరంగా ప్రధానంగా రెండు రకాలు.

  • 1.Y ఆకృతి స్ట్రయినరు
  • 2.బాస్కెట్ ఆకృతి స్ట్రయినరు

పై రెండురకాలను మరికొన్ని ఉపరకాలుగా విభజించారు.

Y ఆకృతి స్ట్రయినరులో ఫిల్టరుఎలిమెంటు ఏటవాలుగా అమర్చి వుండగా, బాస్కెటు రకపు స్ట్రయినరులో నిలువుగా వుండును. బాస్కెట్ లో ఫిల్టరు అమరికను బట్టి బాస్కెటు రకపు స్ట్రయినరులోరెండు మూడు రకాలు ఉన్నాయి.

Yరకపు స్ట్రయినరు[మార్చు]

Yరకపు స్ట్రయినరులను ఎక్కువగా స్టీము పైపులలో ఉపయోగిస్తారు.ఈ రకపు స్ట్రయినరుల బాడీ (దేహాకృతి) స్తూపాకారంగా వుండి బలిష్టమైన నిర్మాణం ఉన్నందున అధిక పీడనం కల్గిన స్టీము పైపులలో వాడుటకు అనుకూ లం.Y రకపు స్ట్రయినరులను 400 బార్ స్టీము వత్తిడి వరకు ఉపయోగించడం సాధారణం.సాధారణ మధ్య స్థితి పీడనం వున్న స్టీము అయిమచో కాస్ట్ ఐరను (పోత ఇనుము) లేదా కాస్ట్ స్టీలు ఉపయోగిస్తారు.స్టీము వత్తిడి /పీడనం పెరిగే కొలది స్టీము ఉష్ణోగ్రత కూడా పెరుగును.కావున ఎక్కువ పీడనం వున్న స్టీము అయినచో క్రోమ్ మాలిబ్డినం ఉక్కుతో చేసిన స్ట్రయినరులను ఉపయోగిస్తారు.

Yరకపు స్ట్రయినరుల లోపల సన్నని రంధ్రాలు కల్గిన పలుచని రేకుతో చేసిన గొట్టంవంటి ఆకారంలో ఫిల్టరు వుండును.స్ట్రయినరుల సైజు ప్రకారం చూస్తే బాస్కెట్ రకపు స్ట్రయినరులు Y రకపు స్ట్రయినరులకన్న ఎక్కువ మలినా లను ఆపు, నిలువరించు సామర్ధ్యం కల్గివున్నవి.అందువలన Y రకపు స్ట్రయినరుల ఫిల్టరులను తరచుగా విప్పి శుభ్రపరచవలసి ఉంది.అయినప్పటికీ ఇది అంత సమస్య కాదు.ఎందుకనగా అదే స్టీము లైనులో మరో Yరకపు స్ట్రయినరును అదనంగాఅమర్చి, మొదటి స్ట్రయినరును క్లీను చెయ్యునపుడు రెండో స్ట్రయినరులో స్టీమును పంపించవచ్చు, రెండోస్ట్రయినరును క్లీను చేయునపుడు మొదటి స్ట్రయినరులో స్టీమును పంపించవచ్చు. అయితే ప్రవాహంలో ఎక్కువ పరిమాణంలో మలినాలు ఉండే అవకాశం వున్నప్పుడు బాస్కెట్ స్ట్రయినరును అమర్చవచ్చు.

స్టీము లేదా వాయువు గొట్టాలలో బిగించు Y స్ట్రయినరును క్షితిజసమాంతరంగా అమర్చి, స్ట్రయినరు యొక్క ఫిల్టరు పాకెట్ ను క్షితిజ సమతలంగా వుండునట్లు అమర్చుతారు. ఈ విధంగా అమర్చడం వలన స్టీములోని నీరు ఈ ఫిల్టరు ప్యాకెట్ లో జమ అవ్వదు. ద్రవాలు ప్రవహించు గొట్టాలకు క్షితిజసమాంతరంగా అమర్చిన ఈ ఫిల్టరు ప్యాకెట్ కిందికి నిలువుగా వుండునట్లు అమర్చుతారు.ఇలా అమర్చడం వలన ప్రవాహం వెనక్కి ప్రవహించినపుడు ఫిల్టరులో జమ అయిన లోహముక్కలు తిరిగి పైపులోకి పెళ్లవు.

సాధారణంగా Y రకపు స్ట్రయినరును క్షితిజసమాంతరంగాఅమర్చినప్పటికీ నిలువుగా వుండు పైపులకు ఈ స్ట్రయినరును నిలువుగా అమర్చవలసి వుండును. అలాంటి సందర్భాలలో ఫిల్టరు ప్యాకెట్ కింది వైపుగా వుండేటట్లు అమర్చ వలెను. Yరకపు స్ట్రయినరుల సైజు (పరిమాణం 1/2"నుండి 10"అంగుళాలు వరకు ఉండును[2].

Y రకపు స్ట్రయినరులోని మెష్/స్క్రీన్(జల్లెడ)[మార్చు]

Yరకపు స్ట్రయినరుల లోపలి గొట్టం వంటి జల్లెడను 304 స్టెయిన్‌లెస్‌ స్టీలు లేదా, మోనెల్ లోహం (monel, ఇత్తడి లేదా 316 స్టెయిన్‌లెస్‌ స్టీలుతో చేస్తారు.జల్లెడ రెండురకాలు.ఒకటి రేకు జల్లెడ మరొకటి రేకు జల్లెడ[2].

తిన్నని, కోణాకృతి స్ట్రయినరులు(Straight and angle type strainers)[మార్చు]

స్టీము ఉపయోగించు పైపులలో Y స్ట్రయినరుతో పాటు ఇతర ఆకృతులున్న వాటిని కుడా ఉపయోగిస్తారు అలాంటి వాటిలో సరళాకృతి/ తిన్ననగా (నిటారుగా) వున్న, కోణాకృతిలో (వంపువున్నవి) ఉన్నాయి.ఈ రకపు స్ట్రయినరులను Y స్ట్రయినరులను క్షేత్రపరంగా వాడుటకు వీలు కానిచోట ఉపయోగిస్తారు.

బాస్కెట్ రకపు స్ట్రయినరులు[మార్చు]

బాస్కెట్ స్ట్రయినరులు

బాస్కెట్ రకపు స్ట్రయినరులో సాధారణంగా బాడీ (దేహాకృతి) నిలువుగా గుల్లగా వున్న స్తూపాకారంగా వుండి, లోపల బుట్ట ఆకారంలో వడబోత భాగం అయిన ఫిల్టరు వుండును.బాస్కెట్ రకపు స్ట్రయినరులు పరిమాణంలో Y ఆకారపు స్ట్రయినరులకన్న పెద్దవిగా వుండును.ఒకే పరిమాణం వున్న Y స్ట్రయినరు, బాస్కెట్ స్ట్రయినరులను పోల్చి చూసిన, బాస్కెట్ స్ట్రయినరులో ప్రవాహం యొక్క పీడన క్షీణత (తగ్గుదల) తక్కువగా వుండును. అంతే కాకుండా ఎక్కువ పరిమాణంలో మురికిని, మలినాలను వడగట్టు నిలువరించు సామర్ధ్యం ఉన్నందున బాస్కెట్ స్ట్రయినరులను ద్రవప్రవాహ గొట్టాలలో ఎక్కువ ఉపయోగిస్తారు. బాస్కెట్ స్ట్రయినరులను కేవలం గొట్టాలలో క్షితిజసమాంతరంగా మాత్రమే అమర్చవచ్చు. అందువలన క్షితిజసమాంతర పైపులలో మాత్రమే ఉపయోగిస్తారు. పెద్ద సైజు బాస్కెట్ స్ట్రయినరులను పైపులకు బిగించి నపుడు పైపుల మీద భారాన్ని తగ్గించుటకు బాస్కెట్ స్ట్రయినరుల సిలిండరు అడుగు భాగాన ఏదైనా ఆధారాన్ని తప్పని సరిగా అమర్చవలసి వుండును.చాలా సందర్భాలలో బాస్కెట్ స్ట్రయినరులను రెండింటిని ఒకదాని పక్కన మరొకటి సమాంతరంగా బిగించి, ఒక స్ట్రయినరు మలినాలతో/వ్యర్థాలతోలో నిండినపుడు, ప్రవాహాన్ని రెండో స్ట్రయినరుకు మరల్చి మొదటి స్ట్రయినరును శుభ్రం చేస్తారు. రెండో స్ట్రయినరు మలినాలతో పూడుకు పోయినపుడు ప్రవాహాన్ని మొదటి స్ట్రయినరుకు మరల్చి, రెండవ స్ట్రయినరును శుభ్రపరచెదరు[3].

స్ట్రయినరులో వడబోతకై ఉపయోగించు వడగట్టు భాగాలు లేదా ఫిల్టరు ఎలిమెంట్/జల్లెడలు[మార్చు]

స్ట్రయినరులో మలినాలు/వ్యర్థాలు వడగట్టు భాగాన్ని ఫిల్టరు ఎలిమెంట్ లేదా స్క్రీన్ (జాలీ) అంటారు.కొందరు ఫిల్టరు అనికూడా అంటారు.ఈ స్క్రీన్ రెండురకాలుగా వుండును.అవి

  • 1.రంధ్రాలు వున్న రేకు లేక తగడు జాలీ/జల్లెడ.ఇంగ్లీసులో పెర్ఫోరేటెడ్ స్క్రీన్ (Perforated screens)
  • 2.మెష్ స్క్రీన్ లేదా తీగ జల్లెడ/జాలీ

రేకు(ఱేకు)జల్లెడ లేదా జాలీ[మార్చు]

ఇది సన్నని రంధ్రాలు కల్గిన గొట్టం వంటి లోహరేకు లేక తగడు. చదునుగా వున్న లోహ రేకు మీద సన్నని రంధ్రాలను దగ్గరగా వేసి, ఆతరువాత రేకును కావలసిన సైజులో గొట్టంలా గుండ్రంగా చుట్టెదరు. స్తూపాకారఅంచులను స్పాట్ వెల్డింగు చేయుదురు, లేదా రెండుఅంచులను దగ్గరగా చేసి మడిఛి ఒక అతుకులాగా గట్టిగా నొక్కెదరు.ఈ రంధ్రాలు సాధారణంగా గుండ్రంగా వుండును.ఈ బెజ్జాల పరిమాణం 0.8 నుండి 3.0 మి.మీ వరకు వుండును. రేకును రాగి లేదా స్టెయిన్‌లెస్ స్టీలుతో చేస్తారు.రేకు జల్లెడలో ఒక అంగుళం పొడవులో వున్న రంధ్రాల సంఖ్యను బట్టీ లేదా రంధ్రం వ్యాసం బట్తి మెష్ సైజును నిర్దారిస్తారు.

తీగ జల్లెడ / తంతి జల్లెడ లేదా జల్లెడతెర(mesh screen)[మార్చు]

ఇందులో సన్నని లోహ తీగలను దగ్గరగా ఒకదానితో మరొకటి పేని/అల్లి పలుచని తెరలా తయారు చేయుదురు. తీగ జల్లెడ పరిమాణాన్ని బట్టి తీగ మందం, తీగల మధ్య దూరం (సందు) మారును. ఇలా అల్లిన తీగజల్లెడను నేరుగా స్ట్రయినరులో అమర్చేదరు లేదా రంధ్రాలు వున్న మరోరేకు మీద చుట్టి ఉపయోగిస్తారు. బాగా సన్నని లోహ తీగలను ఉపయోగించి తీగలను దగ్గర దగ్గరగా అల్లి 0.07 మి.మీ ఖాళి వున్న జల్లెడతెర కూడా చెయ్యవచ్చు.ఈ జల్లెడతెర సైజును మెష్ (mesh) అని పదం చేర్చి వ్యవరిస్తారు. ఒక అంగుళం పొడవులో వున్నా తీగ గడుల/గదుల సంఖ్యను మెష్ సంఖ్యగా వ్యవహారిస్తారు. ఉదాహరణకు 3వ నంబరు మెష్ అనగా ఒక అంగుళం వైశాల్యంలో 3 గడులు అడ్డంగా,3 నిలువుగా అల్లబడి వుండును (అనగా 9 గదులు, నాలుగు తీగెలు నిలువుగా, నాలుగు తీగెలు అడ్డంగా అల్లబడి వుండును). 20 నెంబరు మెష్ అనగా ఒక అంగుళం వైశాల్యంలో 21 తీగెలు నిలువుగా,21 తీగెలు అడ్డంగా ( లేదా చదరపు అంగుళంలో 20నిలువుగా 20 అడ్డంగా గదులుండును) అల్లబడి వుండును. ఎక్కువ నెంబరు మెష్ చెయ్యుటకు తక్కువ సైజు తీగెను, తక్కువ నంబరు తీగ జల్లెడ చేయుటకు ఎక్కువ మందం/వ్యాసం వున్న తీగ/వైరు/తంతిని ఉపయోగిస్తారు. తంతి నిర్మాణానికి జల్లెడ అవసరాన్ని బట్టి, గాల్వనైజ్ద్ ఐరను తంతి, రాగి లేదా ఇత్తడి తంతి లేదా స్టెయిన్‌లెస్ ఉక్కు తంతిని ఉపయో గించి తయారు చేస్తారు. ఎక్కువ ఉష్ణోగ్రత వున్న ద్రవాలను లేదా వాయువులు అయినచో లోహతీగల జల్లెడను తక్కువ ఉష్ణోగ్రత (60°C తక్కువ ) వున్న ప్రవాహ పదార్థాలకు ప్లాస్టిక్ దారాలతో చేసిన జల్లెడను ఉపయో గిస్తారు.

ప్రవాహ పీడన క్షీణత[మార్చు]

ఈజల్లెడలోని తీగెలు స్ట్రయినరు లోని ప్రవాహ పీడనాన్ని నిరోదించడం వలన జల్లెడ తరువాత ప్రవాహ పీడనం తగ్గి ప్రవాహ వేగం పెరుగును.జల్లెడ లోని తీగెల సంఖ్యపెరిగే కొలది అనగా మెష్ సంఖ్య పెరిగే కొలది ప్రవాహ పీడన క్షీణత పెరుగును.

ఆధారాలు/మూలాలు[మార్చు]