స్పాట్ వెల్డింగు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
స్పాట్ వెల్డింగు యంత్రం-ఛాయాచిత్రం
కాలితో లివరు నొక్కె మెషిన్
పోర్టబుల్ వెల్డింగు మెషిన్
వెల్డింగు రేఖాచిత్రం

స్పాట్ వెల్డింగు అనునది ఆంగ్ల పదం. తెలుగులో అనువదించిన బిందు రూప అతుకు ప్రక్రియ అని పిలువ వలసి వున్నది. ఈ వృత్తిలో వున్నవారు సింపుల్ గా స్పాట్ వెల్డింగు అని పిలవడం మాములై పోయినది.విద్యుత్తు మరియు లోహంవిధ్యుత్తు నిరోధకత్వం గుణాన్ని అధారంచేసుకొని లోహాలను వెల్డింగు చేయు విధానమిది. సచేతనమైన ఒక విద్యుత్తు ప్రవాహ వలయంలో ఎలక్ట్రానులు ధన దృవం (Anode) నుండి ఋణ దృవం (cathode) వైపు నిరంతరం సెకండుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి.ఇలాంటి స్థితిలో ఎలక్ట్రానుల ప్రవాహనికి ప్రతిబంధకం,లేదా నిరోధం కలిగించిన, ప్రతి బంధకానికి కారణమైన పదార్థంలో అధిక సంఖ్యలో ఎలక్ట్రానులు జమపడి పోవడం వలన ఏర్పడిన ఘర్షణ ఫలితంగా ఉష్ణోగ్రత ఏర్పడుతుంది.ఈ ఫలిత ఉష్ణోగ్రత ను ఉపయోగించుకొని లోహములను అతుకు ప్రక్రియ ఇది. అందు వలన దీనిని ప్రతి బంధక లేదా నిరోధక అతుకు ప్రక్రియ అంటారు. ఆంగ్లంలో Resistance/resistence Welding(RW) లేదా Resistance/resistence Spot Welding(RSW) అందురు. ఎక్కువగా ఈ వెల్డింగు ప్రక్రియలో లోహ పలకలను అతుకుట వలన షీట్ స్పాట్ వెల్డింగు అని కూడా అంటారు. [1].స్పాట్ వెల్డింగు ప్రక్రియలో వెల్డింగు సమయంలో కొంతమేరకు అతుకు వస్తువు/లోహం మీద భౌతిక వత్తిడిని తప్పని సరిగా ప్రయోగించ వలసి వున్నది.స్పాట్ వెల్డింగులో పూరక లోహంను ప్రత్యేకంగా ఉపయోగించ వలసిన అవసరంలేదు. స్పాట్ వెల్డింగు మొదటగా 100-1905 లో ఉపయోగంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది[2].ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా ఎక్కువ వినియోగంలో వున్న వెల్డింగు ప్రక్రియలలో స్పాట్ వెల్డింగు ప్రక్రియ ఒకటి.

విధానం[మార్చు]

స్పాట్ వెల్డింగులో ఉపయోగించు విద్యుత్తు ఏకముఖ విద్యుత్తు(direct current).ఎలక్ట్రోడులు రెండు యంత్రానికి(భూమికి) నిలువగా వుండును.అందులో క్రిందు ఎలక్ట్రోడు స్థిరంగా,కదలకుండ వుండును. చేతితో లేదా కాలితో లివరును నొక్కడం ద్వారా పై ఎలక్ట్రోడు పైకి క్రిందికి కదిలే అమర్చబడివుండును,ఎలక్ట్రొడులు స్తుపాకారంగా వుండి అంచులు శంఖువులా కొనదేలి(Taper shape) వుండును.వెల్డింగు నాలుగుదశలలో జరుగును.మదటిదశలో క్రింది ఎలక్ట్రొడు మీద అతుక వలసిన లొహపలకలను ఒకదానిమీద ఒకటి వుండెలా అమర్చి,లివరును నొక్కిఅతుకవలసిన భాగంపై వత్తడం జరుగుతుంది.రెండవ దశలో ఎలక్ట్రోడును అలా నొక్కివుంచి, కొన్ని క్షణాలపాటు విద్యుత్తును పంపెదరు.అతుకబడు లోహాల విద్యుత్తు ప్రతిబంధక లక్షణం కారణంగా,రెండు ఎలక్ట్రోడుల అంచులమధ్య అధిక ఉష్ణోగ్రత జనించును.పలితంగా లోహం కరగి,ఎలక్ట్రోడు మీద ప్రయోగించిన బలం/వత్తిడి వలన అతుకబడు తుంది.మూడవ దశలో విద్యుత్తును ఆపివేశినప్పటికి లివరు/ఎలక్ట్రోడును బలంగా అలాగే కొద్దిసేపు నొక్కి వుంచెదరు.ఇలాచెయ్యడం వలన అతుకు దృఢపడుతుంది.నాలుగవదశలో లివరును వదలి ఎలక్ట్రోడును దూరంగా జరపడం జరుగుతుంది.స్పాట్ వెల్డింగులో అతుకు చిన్న బిందువు లేదా చిన్న చుక్కవంటి ఆకారంలో ఏర్పడటం వలన దీనిని స్పాట్ వెల్డింగు అని సాధారణపేరు వుండిపోయినది[3].

స్పాట్ వెల్డింగు మెచిన్[4][మార్చు]

స్పాట్ వెల్డింగు యంత్రాలను వాటి నిర్మాణాన్నిబట్టి ,వాటితో వెల్డింగుచెయ్యు పద్ధతిని బట్టి కొన్ని రకాలుగా వర్గికరించారు.

 • రాకరు-ఆర్ము వెల్డింగు మెషిను
 • ప్రెస్ టైపు వెల్డింగు మెషిను
 • తెలికగా తీసుకెళ్లు తేలికరకం వెల్డింగు మెషిన్ లేదా వెల్డింగు గన్
 • బహుళ ఎలక్ట్రొడులున్న వెల్డింగు మెషిన్

వెల్డింగు మెషినులో వుండు యంత్ర భాగాలు

 • ఫ్రేమ్:ఇది వెల్డింగు మెషిన్ యొక్క ముఖ్య భాగం.విద్యుత్తు ట్రాన్సుఫారం,విద్యుత్తు మీటలు(switch),లీవరు వంటివి కలిగివుండును.ఎలక్ట్రోడులను పట్టి వుంచు లోహా బంధకాలు ఫ్రేముకు బిగించబడివుండును.
 • క్రింది మరియి పై నుండు ఎలక్ట్రోడులు బిగించిన బంధక యంత్ర లోహభాగాలు,వీటిని ఎలక్ట్రోడు ఆర్మ్స్ లేదా హోల్డరు సి ఆంగ్లంలో అందురు. .ఇందులో పైనున్న ఎలక్ట్రోడు బిగించిన లోహభాగం పైకి,క్రిందకు చలిస్తుంది.దిగువభాగంలోనున్న ఎలక్ట్రొడుబిగించిన లోహ భాగం స్థిరంగా వుండును.
 • వోల్టేసిని తగ్గించి కరెంటు (amps)పెంచు స్టెప్ డవున్ ట్రాన్సుఫారం,దానికి సంబంధించిన సర్క్యుట్.
 • విధ్యుత్తు ప్రవాహన్ని సరిదిద్దగల పరికరసముదాయం.

స్పాట్ వెల్డింగు చెయ్యుటకు అనువైన లోహంలు[5][మార్చు]

 • బిందు అతుకు ప్రక్రియకు తక్కువ కార్బను వున్న ఉక్కులోహం అనువైనది.ఎక్కువ కార్బను వున్న ఉక్కు స్పాట్ వెల్డింగునకు అనువైనది కాదు.వెల్డింగు తరువాత లోహ అతుకువద్ద కఠినత్వం పెరగడం వలన వెల్డింగు నిలవదు,త్వరగా విడిపోవును.
 • శ్రేణి 300 కు చెందిన తుప్పుపట్టని ఉక్కు(stainless steel)లోహాలైన ఫెర్రిటిక్(ferritic) మరియ అస్టినిటిక్(Austenitic)ఉక్కును స్పాట్ వెల్డింగు చెయ్యవచ్చును.మర్టెనిటిక్(Martensitic)ఉక్కు మాత్రం బిందు అతుకు ప్రక్రియకు అనువైనది కాదు.
 • అల్యుమినియం లోహాన్ని అతుకవచ్చును.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]