ఫ్లాష్ బట్ వెల్డింగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్లాష్ బట్ వెల్డింగు తెలియజేసే యానిమేషన్

ఫ్లాష్ బట్ వెక్డింగు (Flash Butt welding) అను ప్రక్రియ రెండు లోహంలను అతుకు విధానం.సరిగ్గా నిర్వచించినచో ఒకేరకమైన రెండు లోహభాగంలను అతుకు ప్రక్రియం.లోహాంలను అతుకు ఈ ప్రక్రియ లోహంల కున్న వాటి ప్రత్యేకమైన ఒక గుణాన్ని ఆధారం చేసుకొని పనిచేయును.లోహంలన్నియు విద్యుత్తు వాహకంలైనప్పటికి, అన్నియు ఒకే రకమైన విద్యుత్తు ప్రవాహక లక్షణాన్ని చూపించవు.అన్నిలోహంలు కొంతమేర విద్యుత్తు నిరోధక తత్వాన్ని చూపించును.ముఖ్యంగా వాహకంలో ప్రవహించు విద్యుచ్ఛక్తి యొక్క విద్యుచ్ఛాలక శక్తి పెరిగే కొలది, వాహక లోహంయొక్క మందం (వ్యాసం) తగ్గెకొలది, వాహకంయొక్క పొడవు పెరిగే కొలది ఈ విద్యుత్తు వాహక నిరోధం విలువ పెరుగుతుంది.

ఫ్లాష్ బట్ వెల్డింగు పనిచేయు విధానంలో బట్ లేదా అప్‌సెట్ వెల్డింగు వంటిదే.నిజం చెప్పాలంటే బట్ వెల్డింగునుండే ఫ్లాష్ బట్ వెల్డింగ్ పరిణితి/అభివృద్ధ్ చెందినది అనిచెప్పవచ్చును. ఫ్లాష్ బట్ వెల్డింగులో కూడా విద్యుత్తు ప్రవాహం (current flow), వత్తిడి (pressure) రెండింటిని ఉపయోగ్స్తారు.బట్ (అప్‌సెట్) వెల్డింగులో మొదట వత్తిడిని కలిగించి ఆతరువాత విద్యుత్తు ప్రవాహాన్ని కలుగచేసి, వేడిని పుట్టించి, లోహాలను కరగించి అతికెదరు.ఫ్లాష్ బట్ వెల్డింగు విధానం లేదా ప్రక్రియలో మొదట అతుకవలసిన రెండు లోహ అంచులు/చివరల లలో విద్యుత్తును ప్రవహింపచేసి, అంచులవద్ద ఎలక్ట్రానుల ప్రవాహ వత్తిడివలన క్షణికదీప్తి/క్షణప్రభ (flash) ఏర్పడటం వలన లోహాలను వేడిచేసి, అంచులు/చివరలపై ఇప్పుడు వత్తిడిని ఉపయోగించి లోహంలను అతికెదరు. [1]

ఫ్లాష్ బట్ వెల్డింగు యంత్రభాగాలు[మార్చు]

 1. ప్రధాన చత్రం లేదా సంధాన బల్ల (మmain frame)
 2. స్థిరంగా వుండు ప్లాటెన్ (platen)
 3. కదిలే ప్లాటెన్ (platen) .
 4. లోహ బంధకాలు (clamps, నీటిద్వారా చల్లబరచే అమరిక వుండును.
 5. విద్యుత్తు ట్రాన్సుఫార్మర్
 6. విద్యుత్తు మీటలు, నియంత్రణ పరికరాలు

ప్లాష్ బట్ వెల్డింగు యంత్రాలలో పలురకాలున్నాయి.మనిషి పర్యవేక్షణ (manually operated) లో పనిచేయునవి, మనిషి పర్యవేక్షణ లేకుండ స్వయం పనిచేయు (automated) రకాలు, కంప్యూటరు నియంత్రణ (PLC) రకాలున్నాయి.

ఫ్లాష్ బట్ వెల్డింగు విధానంద్వారా అతుకు లోహాలు[2][మార్చు]

 1. తక్కువ కార్బన్ వున్న ఉక్కు
 2. పనిముట్లు (tools) చేయు ఉక్కు
 3. తుప్పు పట్టని ఉక్కు (stainless steel)
 4. అల్యూమినియం లోహం, దాని మిశ్రమథాతువులు
 5. మధ్యంతర, అధిక దృఢత్వంవున్న మిశ్రమథాతువులు
 6. రాగి యొక్క మిశ్రమథాతువులు (జింకును అధిక మోతాదులోకలిగివున్నవి)
 7. మెగ్నిసియంయొక్క మిశ్రమథాతువులు
 8. మోల్బిడినం మిశ్రమథాతువులు
 9. టిటానియం మిశ్రమథాతువులు
 10. నికెల్ యొక్క మిశ్రమ థాతువులు.

అతుకు లోహ వస్తువులు[మార్చు]

 1. తీగెలను, లోహ ఊచలు/కడ్డిలను అతుకుటకు
 2. ఉక్కుపట్టాలను (rails) అతుకుటకు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు[3]

ఇవికూడా చూడండి[మార్చు]

 1. వెల్డింగ్

బయటిలింకులు[మార్చు]

 1. [https://web.archive.org/web/20140409203831/http://www.fahringer.com/pwt-article.html%5D%5D%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D బట్ వెల్డింగు

సూచికలు[మార్చు]

 1. "What is flash (butt) welding?". twi-global.com. Retrieved 2014-02-28.
 2. Welding Techehnoly-Flash butt welding,page No :173
 3. "Experimental and numerical investigations". sciencedirect.com. Retrieved 2014-03-01.