ఫోర్జ్‌ వెల్డింగు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అచ్చు ఉపయోగించి చేసిన ఏకదిశ కవాటం

ఫోర్జ్‌ వెల్డింగు (Forge welding)అనే వెల్డింగు ప్రక్రియ ఒకవిధంగా ఘనస్థితి వెల్డింగు విధానమే.అతుకవలసిన వస్తువులను అధిక ఉష్ణోగ్రత వచ్చు వరకు వేడిచేసినప్పటికి, లోహాలను వాటి ద్రవీభవన ఉష్ణోగ్రతకన్న తక్కువ ఉష్ణోగ్రతవరకు వేడిచేయుదురు. ఫోర్జ్ వెల్డింగు విధానం అతి పురాతనమైన వెల్డింగు విధానం. ఇప్పటికి గ్రామాలలో ఈ విధానం లోనే చాలా లోహపనిముట్లను అతికెదరు.Forge అనగా తెలుగులో కొలిమి అని అర్థం. అంటే కమ్మరికొలిమిలో రెండు లేదా మూడు లోహ వస్తువులను ఎర్రగా కాలేవరకు(అనగా లోహాలద్రవీభవన ఉష్ణోగ్రతలో 75-85% వరకు) వేడిచేసి,వాటిని కలిపి దాగలి(anvil) మీద వుంచి వాటిని సుత్తితో బలంగా మోది, కొట్టి కావలసిన ఆకారం వచ్చేలా చెయ్యడం ఫోర్జ్ వెల్డింగు[1]

అనాదిగా భారతదేశంలో కొన్నివందల సంవత్సరాలుగా గ్రామస్థాయిలో ఈ ఫోర్జ్ వెల్డింగు తోనే ఇంటికి కావలసిన కత్తులు, చాకులు, కత్తిపీటలు, డాలు, గోళాలు, కొలత పాత్రలు వంటివి, వ్యవసాయ పనిముట్లు అయిన నాగలి కర్రు, బండిచక్రాల ఇనుప కమ్మీలు, గొడ్డళ్ళు, కొడవళ్లు, గునపాలు, పారలు, బాల్చీలు, ఇనుప గడియలు, ఉక్కుతో చేసిన పెట్టెలు, సుత్తులు, ఉలులు, ఇలా చాలా వస్తువులను కమ్మరి ఈ పోర్జింగు పద్ధతిలోనే తయారుచేసేవాడు. ఇనుప కవచాలు, పొడవాటి ఈటెలు, బల్లెలు, బాణంపు అంచులు తాళాలు ఇలా మనిషికి అవసరమైన చాలా లోహ వస్తువులను కమ్మరి ఓ కొలిమి పద్ధతిలోనే తయారుచేసేవాడు.

ఫోర్జ్ విధానంలో రెండురకాలుగా వస్తువులను అతుకుట లేదా తయారుచేయుట జరుగుతుంది. ఒక విధానంలో పైన పేర్కొన్నట్లుగా కొలిమిలో లోహవస్తువులను బాగా వేడి చేసి ఆ తరువాత లోహావస్యువును సుత్తులు లేదా సమ్మెటలలో బాది కావలసిన ఆకారంలోకి మార్చుట. రెండవ విధానంలో లోహాన్ని బాగా వేడిచేసిన తరువాత వాటిని అచ్చులలో(die)వుంచి కావలసిన అకారంవచ్చేలా హైడాలిక్ లేదా మరోరకం వత్తిడి ప్రయోగించి కావలసిన ఆకారాన్ని తయారుచేయుట, ఫోర్జ్ వెల్డింగు విధానంలో తయారుచేయు వ్యక్తికి విశేష అనుభవం అవసరం. ఫోర్జ్ వెల్డింగులో పోత యినుము(wrought iron)మరియు తక్కువ కార్బను వున్న ఉక్కు(0.2% కన్న తక్కువ కార్బన్)ను వినియోగించిన వస్తువులు మన్నిక కలిగివుంటాయి.

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి ల్ంకులు[మార్చు]

సూచికలు[మార్చు]