Jump to content

ఉక్కు గొట్టాల ఎలక్ట్రిక్ రెసిస్టన్సు వెల్డింగు

వికీపీడియా నుండి
స్పాట్ వెల్డర్ మిల్లెర్ చిత్రం

ఎలక్ట్రిక్ రెసిస్టన్సు వెల్డింగు పద్ధతి ఉపయోగించి లోహ గొట్టాలను తయారుచేయుటను ERW (electric resistance welding) విధానం అంటారు.సాధారణంగా లోహగొట్టం పలక పలుచని మందం అయినచో ట్యూబులని (tube, గోడ మందం అధికంగా వున్నచో పైపు (pipe) అని సాధారణ వ్యవహార నామం. రెసిస్టన్సు వెల్డింగు ప్రక్రియలైన బట్ వెల్డింగు, ఫ్లాష్ బట్ వెల్డింగు, సిమ్‍ వెల్డింగు, పెకాసిన్ వెల్డింగు పద్ధతులన్నియు లోహాల విద్యుత్తు వాహక నిరోధ్క తత్వాన్ని/లక్షణాన్ని ఆసరాగా చేసుకొని లోహాలను అతుకు ప్రతి క్రియలే.అందుచే పైన పేర్కొన్న అన్ని రెసిస్టెన్సు వెల్డింగు విధానాలన్నియు ఎలక్ట్రిక్ రెసిస్టెన్సు వెల్డింగు లేదా ERW లే. అందుచే సాధారణంగా ఉక్కు పలకలు/రేకులను వర్తులాకారంగా/స్తూపాకారంగా నొక్కి వాటి రెండు అంచులను రెసిస్టన్సు వెల్డింగు పద్ధతిలో అతికి గొట్టాలను (tubes and pipes) తయారుచేయుదురు.

వెల్డింగు విధానం

[మార్చు]

ముందుగా కావలసిన గొట్టం, నాళిక వ్యాసానికి అవసరపడిన చుట్టుకొలత పరిమాణంలో లోహ పట్టిలను కత్తరించి సిద్ధం చెయ్యుదురు.తయారు చేయు గొట్టం ఎత్తుకు తగిన విధంగా వెల్డింగు యంత్రం యొక్క రాగి ఎలక్ట్రొడు డిస్కుల ఎత్తును సరిచేయుదురు.ఇప్పుడు కత్తరించిన లోహపట్తిలననెమ్మదిగా ముందుకు వెళ్ళునట్లు చెయ్యుదురు వెల్డింగు యంత్రంనకు ముందుభాగంలో బిగించిన లంబాకృతి ప్రెసరు రోలరులమద్యగా పట్టివెళ్లినప్పుడు అది గొట్టం ఆకారంనకు వంచబడి రెండు అంచులు దగ్గరగా వచ్చివుండును.ఇప్పుడు వెల్డింగు యంత్రం యొక్క రెండు ఎలక్ట్రోడు డిస్కులు రెండు అంచులమీదుగా భ్రమించటం మొదలవ్వగానే ఎలక్టోడులలో విద్యుత్తు ప్రవాహం మొదలై, రెండు అంచులమధ్య విద్యుత్తు ప్రవాహ నిరోధం వలన వేడిపుట్టి, అంచులవద్ద లోహంకరగి రెండు అంచులు మేళనంచెంది అతుకు ఏర్పడును. [1]

ఇవికూడా చూడండి

[మార్చు]
  1. వెల్డింగ్
  2. స్పాట్ వెల్డింగు
  3. సిమ్‍ వెల్డింగు

బయటి లింకులు

[మార్చు]
  • [1] ఇ.ఆర్, వెల్డింగ్
  • [2] ఉక్కు గొట్టాల ఎలక్ట్రిక్ రెసిస్టన్సు వెల్డింగు బొమ్మలు

సూచికలు

[మార్చు]
  1. "ERW PRECISION STEEL TUBES". www.magnumtubes.com. Archived from the original on 2006-05-15. Retrieved 2014-03-03.

.