Jump to content

ఫ్లక్సుకోర్డు ఆర్కువెల్డింగు

వికీపీడియా నుండి
FCAW wire feeder
A drawing of FCAW at the weld point

ఫ్లక్సుకోర్డు వెల్దింగు విధానము కూడా మెటల్ ఆర్కువెల్డింగుప్రక్రియ వంటిదే.ఇందులో కూడా ఆర్కుద్వారా అతుకవలసిన లోహాభాగాలను కరగించి, ద్రవీకరణచెందిన లోహాణువులను ఏకీకృతముగా స మ్మేళన మొందునట్లుచేసి, లోహాలను అతుకు ప్రక్రియ.ఈ వెల్డింగుప్రక్రియ సా.శ.1950లో అభివృద్ధిపరచబడి వాడుకలోనికి తీసుకురాబడింది.ఈ వెల్డింగువిధానంలో వెల్డింగునకు ఉపయోగించు ఎలక్ట్రోడు కడ్డి, షీల్డెడు మెటల్ ఆర్కు వెల్డింగు (SMAW) లో వాడు ఎలక్ట్రోడువలె ఘనం (solid) కాకుండగా, ఎలక్ట్రోడులోహంతోచెయ్యబడి, సన్ననిగొట్టము (tube) వలె వుండి, గొట్టములోపల స్రావకము నింపబడివుండును.ఫ్లక్సుకోర్డు అర్కు వెల్డింగులో అవసరాన్నిబట్టి షిల్డింగు వాయువునుకూడా వినియోగిస్తారు (GMAWలో వాడినట్లుగా).అందుచే ఈవెల్డింగు విధానాన్ని షిల్డెడు మెటల్ ఆర్కు వెల్డింగు, గ్యాసు మెటల్ ఆర్కు వెల్డింగు రెండింటి లక్షణాలు కలిగిన వెల్డింగు విధానము.[1]

ఫ్లక్సుకొర్డు ఆర్కువెల్డింగు

[మార్చు]

వెల్డింగులోని అనుకూలతలు[2]

[మార్చు]

షీల్డుమెటల్ ఆర్కువెల్డింగుకన్న ఎంతోమెరుగైన వెల్డింగుప్రక్రియ ఫ్లక్సుకోర్డు ఆర్కువెల్డింగు.మెటల్ ఆర్కువెల్డింగులో తరచుగా వెల్డింగుఎలక్ట్రోడును మార్చుచుండవలెను.స్రావకపూతకలిగిన ఎలక్ట్రోడులు 250 నుండి450 మి.మీ.పొడవు మాత్రమే వుండటంవలన ఒకఎలక్ట్రోడు అయ్యినతరువాత మరో వెల్డింగుఎలక్ట్రోడును వెల్డింగుహోల్డరుకు బిగించవలసి వుండును.అందువలన వెల్డింగును చేయుటలో కొంత అంతరాయము వచ్చును. అంతియేకాకుండ షిల్డెడుఎలక్ట్రొడుతో ఎలక్ట్రొడుపూర్తిగా అయ్యెవరకు వెల్డింగుచేయుటకు వీలుండదు.వెల్డింగుసమయంలో ఎలక్ట్రోడులో అధికమొత్తములో విద్యుత్తు అవేశిత ఎలక్ట్రానుల ప్రవాహంవలన తొందరగానే ఎలక్ట్రొడు వేడెక్కి, ఎర్రగామారును.అందుచే కొంతమేర వెల్డింగుచేసిన తరువాత అగి మళ్లివెల్డింగును కొనసాగించవలసివున్నది.అందువల షీల్డెడుమెటల్ ఎలక్ట్రొడు నుపయోగించి నిరంతరముగా (continuously) వెల్దింగుచేయుటకు కుదరదు.

షిల్డెడుమెటల్ ఆర్కువెల్డింగులో ఎలక్ట్రోడు కొంతమేర వృధాఅవుతుంది.ఎలక్ట్రొడుహోల్డరులో 25 మి.మీ, వరకు ఎలక్ట్రొడుమిగిలిపోతుంది.అంతియేకాకుండగా ఎలక్ట్రోడుపూర్తిగా అయ్యెవరకు వెల్డింగుచెయ్యటానికి కుదరదు. ఎలక్ట్రోడు కరుగుతూ పొడవు తగ్గటంవలన, ఆర్కుకు సమీపముకు హోల్డరు వెళ్లడంవలన హోల్డరు, చేతితొడుగు వెడెక్కును.అందుచే వెల్డింగుచెయ్యడం కష్టమవుతుంది.అందువలన ప్రతిఎలక్ట్రొడులో దాదాపు40-50 మి.మీ.వెల్డింగు ఎలక్ట్రొడుమెటల్ ఆర్కువెల్డింగులో వృధాఅవుతుంది.ఫ్లక్సుకోర్డు ఆర్కువెల్డింగులో ఎలక్ట్రోడు వృధాకాదు.ఫ్లక్సుకోర్డు వెల్డింగులో ఫ్లక్సుకోర్డుఎలక్ట్రోడు ఒకచక్రంవంటిదానికి చుట్టబడి, వెల్డింగుసమయములో వెల్డింగుకు అనుగుణంగా ఫిడరు రోలరులద్వారా ఎలక్ట్రొడుముందుకు విరంతరం వెల్డింగును ఆపువరకు కదులుచుండును.

వెల్డింగు విధానములోని లోపాలు[2]

[మార్చు]
  1. ఈ వెల్డింగు విధానములో 20-75 మి.మీ.మందమున్న లోహాభాగాలను మాత్రమే అతుకవచ్చును.అంతకుమించిన మందమున్న లోహాలను ఎలక్ట్రోస్లాగు వెల్డింగుపద్ధతో అతుకవలసివున్నది.
  2. ఈవిధనములో కేవలం నిటారుగా (vertical) మాత్రమే వెల్డింగు చెయ్యగలము.ఇతర వెల్డింగు రీతులైన ఫ్లాటు, హరిజంటల్, ఒవరుహెడ్ వెల్డింగు చెయ్యుటకు కుదరదు.
  3. వెల్డింగు చేయునప్పుడు మిగతా వెల్డింగు ప్రక్రియలకన్న ఎక్కువ పరిమాణంలో ధూమం (పొగ) వెలువడును.
  4. వెల్డింగుకేవలం D.C.కరెంటునుపయోగించి మాత్రమే చెయ్యవచ్చును., వెల్డింగు సమయంలో విద్యుత్తు యొక్క వోల్టెజి స్థిరముగా వుండాలి.విద్యుత్తు లీడులనుDCRP (Direct current reversepole) పద్ధతిలోకలుపవలెను.
  5. వెల్డింగు సమయంలో ఎక్కువ పొగ వెలువడుట వలన వెల్డింగుఎలా అవుతున్నది తెలుసుకొనుటకు తప్పనిసరిగా షిల్డింగు వాయువును ఉపయోగించవలెను.
  6. వెల్డింగు సమయములో ఎలక్ట్రొడు అరుగుదలకు అనుగుణంగా ఫీడరుచక్రంనుండి ఎలక్ట్రొడుకాయిలు కదులుతుండవలెను.లేనిచో వెల్డింగు ప్రక్రియకు ఆటంకము ఏర్పడును.

వెల్డింగుచేయుటకు అనువైనలోహాలు

[మార్చు]
  1. మైల్డ్ స్టీలు, తక్కువరకపు స్టీలుమిశ్రమలోహాలు.
  2. స్టెయిన్‍లెస్ స్టీలు
  3. నికెలును ఎక్కువశాతంలోకలిగివున్న మిశ్రమథాతువులు
  4. లోహాలఉపరితలాన్ని గట్టిపరచవలసిన, కఠినత్వమునుపెంచవలసిన కొన్నిరకాల స్టీలు మిశ్రమథాతువులు.

ఇవికూడా చూడండి

[మార్చు]
  1. వెల్డింగ్

బయటి వనరులు

[మార్చు]
  • [1] ఫ్లక్సుకోర్డు ఆర్కువెల్డింగు

సూచికలు

[మార్చు]
  1. "Flux Cored Arc Welding". esab.co.in. Retrieved 2014-03-04.[permanent dead link]
  2. 2.0 2.1 "Flux-Cored Wire versus Solid Wire". keenovens.com. Retrieved 2014-03-04.