Jump to content

నీళ్ళలో వెల్డింగు

వికీపీడియా నుండి
Diver wearing a diving helmet is welding a repair patch on a submarine
అమెరికా నౌకదళ సైనిక నిపుణుడు వెల్డింగు చేయుచూ.
నీళ్ళలో వెల్డింగు

నీళ్ళలో వెల్డింగు అనునది నీటిలో మునిగి వున్న లోహవస్తువులను అతుకు విధానం. నీళ్ళలో వున్న లోహ వస్తువులను ఆర్కు వెల్డింగు పద్ధతిలో అతికెదరు. అనగా ఇది లోహాలను విద్యుత్తు ఆర్కు (మెరుపు) ద్వారా వేడిచేసి, కరగించి అతుకు విధానం. నీళ్ళలో వున్న పడవల, నౌకల అడుగుభాగం పాడైనప్పుడు, పెద్ద ఆనకట్టల యొక్క గేట్లు మరమ్మత్తు/రిపేరు చెయ్యవసినప్పుడు వాటిని బయటికి తీసి వెల్డింగు చెయ్యడం సాధ్యం కాదు అలాంటి వాటిని తప్పనిసరిగా నీళ్ళలో వుండగానే అతుకవలయును. అలాగే సముద్రతీర ప్రాంతాలలో సముద్రంలో నూనె, వాయువులను తీయు బావుల/నూనె క్షేత్రాలనిర్మాణం ప్రపంచమంతటా పెరుగుచున్నది. కనుక అలాంటి తీరప్రాంతంలో సముద్రంలో నూనె బావులను నిర్మించు సమయంలో, మరమ్మత్తులు నీళ్ళలోనే చెయ్యవలసి ఉంది. అలాగే వాటినుండి భూతీరం వరకు నీళ్ళలో వచ్చు గొట్టాల నిర్మాణం, మరమత్తులు నీళ్ళలోనే చెయ్యాలి. అలాగే యుద్ధరంగానికి చెందిన జలాంతర్గామి తనజీవితమంత నీటిలోనే గడపాలి, అటువంటి వాటి మరమత్తులు చెయ్యాలంటే నీళ్ళలో వెల్డింగు విధానమే తప్ప మరో గత్యంతరం లేదు.

నీటిలో వెల్డింగు చెయ్యు విధానం 100 సంవత్సరాల నుండి వాడుకలో వున్నప్పటికి, రెండవ ప్రపంచ యుద్ధానంతరం యుద్ధ సమయంలో మునిగి పోయిన నౌకలను వెలికి తీయుటకు, పాడైపోయిన వాటిని బాగు చెయ్యుటకు నీళ్లలో వెల్డింగు విధానం బాగా ప్రాముఖ్యత పొందినది. బ్రిటీషు అడ్మిరటి డాక్‌యార్డ్ (British Admiralty Dockyard) వారు 1900 మొదట్లో నౌకల అడుగుభాగంలో పాడైన రివిట్లను అతుకుటకై మొదటగా వెల్డింగు చేసినట్లు తెలుస్తున్నది. సా.శ.1946 నాటికి నీటి అభేద్యమైన (water proof) వెల్డింగు ఎలక్ట్రోడులు వాడుకలోకి వచ్చాయి[1]'

నీళ్ళ లోతు పెరిగే కొలదివాతావరణ వత్తిడికి మించి వత్తిడి ప్రభావం పెరుగుతుంది. హైపర్ అనగా అధికమైన అని అర్థం, bar అనేది వాతావరణ వత్తిడి కొలమానం. నీళ్ళలో మునిగివున్న వస్తువుల పై నీటి వత్తిడి dh కు సమానం. ఇక్కడ d అనగా నీటి సాంద్రత లేదా విశిష్ట గురుత్వం.h అనగా నీటి లోతు. అందువలన నీటి లోతు పెరిగే కొలది దానిమీద నీరు కలుగచేసె వత్తిడి పెరుగుతుంది. అందువలన నీటిలో వెల్డింగు చేయు నిపుణుడు వత్తిడిని తట్టుకొనేలా చేసిన దుస్తులను ధరించాలి. ఈత తెలిసివుండాలి.

నీళ్ళలో వెల్దింగు రకాలు

[మార్చు]

ప్రాథమికంగా నీటిలోవెల్డింగు రెండు రకాలు.అవి

తడి వెల్డింగు

[మార్చు]

తడి వెల్డింగు లేదా Wet welding అనగా నీటి అభేధ్య (water proof) పూరకలోహ కడ్డిలను (Stick filler rods) ఎలక్ట్రోడులుగా ఉపయోగించి లోహాలను అతికెదరు. ఈ విధానంలో వెల్డింగు సమయంలో ఏర్పడు ఆర్కు (మెరుపు మంట) చుట్టు నీటినుండి వేరుపరచుచూ ఎటువంటి రక్షణ వ్యవస్థ కాని, ముందు జాగ్రత్తలు తీసుకోవడం కాని వుండదు. అందువలన వెల్డింగు అరుకు వెంటనే చల్లబడటం వలన అతుకువద్ద లోహం పెలుసుగా ఏర్పడటం, లోహకఠినత్వం పెరుగు అవకాశం మెండు. అంతే కాకుండ వెల్డింగు సమయంలో ఆర్కు యొక్క కారణం వలన ఆర్కు చుట్టువున్ననీరు విద్యుత్విభ్జన వలన హైడ్రోజన్, ఆక్సిజనుగా విడిపోయి, విడుదల అయ్యిన హైడ్రోజను వెల్డింగు లోహంతో కలిసే అవకాశం కూడా ఉంది. ఈ వెల్డింగు విధానంలో ఏకాంతర విద్యుత్తును/ A.C. (Alternative current) ఉపయోగించూతకు వీలు లేదు. అందువలన ఏకముఖ (D.C.) /నేరు విద్యుత్తును వాడెదరు. వాడు కరెంటు మితి 300 నుండి 400 ఆంఫియర్లు వుండును[2].విడ్యుత్తు ట్రాన్సుఫార్మరు సాధారణంగా నీటి బయటే వుంచి, వాటీనుండి నీటి రక్షిత అభేధ్యరబ్బరు తొడుగులున్నఆనోడు, కేథోడులు నీటిలో వుండును.

  • తప్పనిసరిగా నీటి ఆభేద్యిత (water Proof) వెల్డింగు ఎలక్టోడులను ఉపయోగించ వలెను.
  • ఏకముఖ విద్యుత్తు ట్రాన్సుఫార్మరు మాత్రమే ఉపయోగించాలి.
  • వెల్డింగు చేయువ్యక్తీ తడివెల్డింగు చేయుటలో తర్ఫీదు పొందివుండాలి, ఈత వచ్చివుండాలి.
  • వత్తిడిని తట్టుకునే, నీటిని పీల్చుకోని, విద్యుత్తు నిరోధక గుణమున్న దుస్త్తులు వెల్ల్డింగు నిపుణుడు ధరించాలి.
  • వెల్డింగు చేయుటకు ఉపయోగించు కేబుల్లు (cable) అన్నియు నీటి అభేధ్యిత తొడుగులను కలిగి వుండాలి.

పొడి వెల్డింగు

[మార్చు]

పొడి వెల్డింగు లేదా (Dry Welding) పద్ధతి రెండు రకాలు. అవి

  • హైపరు బారిక్ (hyper Baric) వెల్డింగు
  • కోశ లేదా కుహర వెల్డింగు (cavity welding)

హైపరుబారిక్ వెల్డింగు: హైపరు బారిక్ (hyperbaric) పద్ధతిలో వెల్డింగు చేయు ప్రాంతంలో తాత్కాలికంగా ఒక అర/గది వంటిది ఏర్పాటు చేసి, అందులోని నీటిని తొలగించి అతుకు ప్రక్రియ. ఈ వెల్డింగు పద్ధతిలో అతుకులు పొడి వాతావ రణంలో చెయ్యడం వలన తడి వెల్డింగు కన్న నాణ్యతగా వుండును. వెల్డింగు కూడా నిలకడగా చెయ్యవచ్చును.అతుకు నెమ్మదిగా చల్లబడుట వలన అతుకువద్ద లోహాం పెళుసుగా మారదు. ముందు వెల్డింగు చెయ్యవలసిన ప్రాంతం/ప్రదేశం చుట్టూ తాత్కాలికంగా ఒక గదివంటిది నిర్మిస్తారు.ఇప్పుడు గదిలో వెల్డింగు చెయ్యు నిపుణుడు తగిన రక్షిత ఏర్పట్లతో, పరికరాలతో గదిలో ప్రవేశించి, గదిని మూసివేసి.గదిలో వత్తిడితో గాలి లేదా ఆక్సిజను, హీలియం వంటి వాయువులను గదిలో ప్రవేశపెట్టి గదిలోని/అరలోని నీటిని బయటకు వెళ్ళేలా చేయుదురు. గది/అర లోని వత్తిడి గదిబయటవున్న నీటి వత్తిడి ఎక్కువ వున్నంతవరకు నీరు గదిలో ప్రవేశించలేదు. ఈ వెల్డింగు విధానం తడి వెల్డింగు కన్న ఎంతో మెరుగైన వెల్డింగు విధానం అయ్యినప్పటికి, అన్నిచోట్ల ఈ విధానంలో వెల్డింగు చెయ్యుటకు వీలుకాదు. అరను నిర్మించుటకు వీలులేని ఇరుకైన ప్రదేశాలలో వెల్డింగు చెయ్యలేరు. అటువంటి చోట్లలలో తడి వెల్డింగు చెయ్యుదురు[2].15 మీటర్ల లోటుకు మించి వెల్డింగు చెయ్యవలసినచో, గదిలో మూడు కేజిలకు మించి వత్తిడిని గదిలో ఏర్పరచ వలసిన సందర్భంలో గదిలో గాలిని నింపడం శ్రేయస్కరంకాదు, అంత వత్తిడి వద్ద గాలి లోని ఆక్సిజను, నైట్రోజనులు దుష్ఫలితాలు కల్గిస్తాయి. అటువంటి సందర్భాలలో హీలియం+ఆక్సిజను లాదా ఆర్గాన్+ఆక్సిజను వాయు మిశ్రాలను ఉపయోగించాలి.

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • [1] నీళ్ళలో వెల్డింగు విధానానికి చెందిన చిత్రాలు.
  • [2] వెట్‌ వెల్డింగు యొక్క విడియో చిత్రం

సూచికలు

[మార్చు]
  1. "Application of underwater welding processes for subsea pipelines". pipeliner.com.au. Archived from the original on 2014-03-10. Retrieved 13 March 2014.
  2. 2.0 2.1 "Types of Underwater Welding". voices.yahoo.com. Retrieved 13 March 2014.[permanent dead link]