లేజరు బీమ్ వెల్డింగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A robot performs remote fibre laser welding.

లేసరు బీమ్‌ వెల్డింగు (ఆంగ్లం:Laser Beam Welding) అనేది నూతనమైనలోహాలను అతుకు విధానం.అతకవలసిన లోహాల అంచులను కరగించి (fusion, రెండు అంచులలోని లోహ అణువు లను మేళనపరచి, ఏకీకృతం కావించి రెండు అంచులలోను ఏకరూపత వచ్చేలా చేయు అతుకు పద్ధతి.లేసరు అను పదం ఆంగ్ల పదమైనప్పటికి అది ఏక పదం కాదు.కొన్ని ఆంగ్ల పదాల సంక్షిప్త రూపం."Light Amplification by Stimulated Emission of Radiation" (Laser) అనగా "ఉత్తేజిత కాంతి ఉద్గారం వలన కాంతి వర్థకము" అని అర్థం. లేసరు ప్రత్యేక లక్షణాలున్న ఒక కాంతి జనకం. ఈ ప్రత్యేక లక్షణాలు సాధారణంగా మనం చూసే సూర్యుడు, ఉష్ణోద్గార దీపం, ఏకవర్ణ కాంతి జనకం, సోడియం దీపం వంటి కాంతి జనకలలో ఉండవు. లేసరు వెల్డింగు విధానంలో కేవలం లోహాలనే కాకుంద ప్లాస్టిక్ వంటి ఇతర వస్తువులను కూడా అతుకవచ్చును.

లేసరు కిరణం

[మార్చు]

లేసరు కిరణం సహజ సిద్ధమైన కాంతి కిరణం కాదు.మానవుడు భౌతిక శాస్త్ర వైజ్ఞానిక విజ్ఞానాన్ని ఉపయోగించి కృత్రిమంగా తరారు చేసిన ఒక విశిష్టమైన కాంతి పుంజము.సహజసిద్దమైన సూర్యకాంతికిరణాలకన్న, ఇతర కిరణాలకన్న భిన్నమైన లక్షణాలున్నది.సుర్యకాంతి లాంటి సహజ కిరణాలు భిన్నమైన తరంగదైర్ఘ్యం కలిగిన రంగులను కలిగివుండును.సూర్య కాంతిలో వివిధ తరంగదైర్ఘ్యాలున్న ఏడు రంగులున్న విషయం అందరికి విధితమే.కాని లేసరు కిరణం ఒకే తరంగదైర్ఘ్యం కలిగివుంటుంది.అనగా లేసరు కిరణం ఒకే రంగు కలిగివుండును.మాములు కాంతి కిరణం కాంతిజనకం నుండి అన్నిదిక్కులకు వ్యాప్తి చెందును.లేసరు కిరణాలు ఒకదానితో ఒకటి పొందికకలిగి (coherent) ఒకే దిశవైపు (collimated) ప్రసరించును.లేసరు కిరణాలను చాలారంగాలలో ఉపయోగిస్తారు [1].లేసరు కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకదానితో మరొకటి పొంతన చెంది ఉంటాయి, లేదా coherent గా ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే తరంగదైర్ఘ్యం (wavelength) కలిగి ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే ఆవృత్తి (frequency) కలిగి ఉంటాయి. అంటే కాంతిపుంజంలో ఉన్న కాంతి కెరటాలన్నీ ఒకే రంగుతో (color) ఉంటాయి. ఇంకా నిర్దుష్టంగా చెప్పాలంటే లేసర్‌ కాంతిలో ఉన్నఫోటానులన్నీ ఒకే దిశ (direction) లో, ఒకే దశ (phase) లో, ఒకే తరంగదైర్ఘ్యంతో, ఒకే తలీకరణతో (polarization) కంపిస్తూ ఉంటాయి.

1900 కాలంలో కిరణాలు ఒకరకమైన విద్యుదయస్కాంత వ్యాపకాలని మాక్సుప్లాంక్ (Max plank) తన పరిశోధన వ్యాసాలలో మొదట పేర్కొన్నాడు.అ తరువాత 1917 లో అల్బెర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein) కాంతికిరణాల ఉద్దీపన ఉద్గారణ (stimulated emission) సిద్ధాంత ప్రతిపాదన, లేసరు కిరణాల పట్ల ఒక అవగహాన శాస్త్రవేత్తలలో కలిగించి.అతితే 1940 వరకు దీని గురించి పెద్దగా చర్చలేమి జరుగలేదు.1950 నుండి పలువురు శాస్త్రవేత్తలు లేసరు కిరణం అవిష్కరణ పై పరిశోధనలు ప్రారంభించారు.ఈవిషయంలో టౌన్సు (towns), ప్రొఖోరోవ్ (prokhorov) విశేష కృషి సరిపినప్పటికి, 1960 లో లేసరు కిరణాన్ని మొదటిగా సృష్టించిన ఖ్యాతి థొయోడోర్ మైమాన్ (theodore maiman) కు దక్కింది. టౌన్సు (towns), ప్రొఖోరోవ్ (prokhorov) విశేష కృషికి గుర్తింపుగా నోబల్ బహుమతి 1964 లో ప్రకటించారు[2]

లేసరు బీమ్‌ వెల్డింగు

[మార్చు]

నిజానికి లేసరు బీమ్‌ వెల్డింగు ఎలక్ట్రాను బీమ్‌ వెల్డింగువంటి వెల్డింగు విధానమే.ఎలక్ట్రాను బీమ్‌ వెల్డింగులో విద్యుత్కణాలను అతుకుటకు ఉపయోగించగా, ఇక్కడ లేసరు కిరణాలను ఉపయోగ్ంచి లోహాలను అతికెదరు.రెండు వెల్డింగు పద్ధతులలో అతుకవలసిన లోహ వస్తువుల అంచులను/చివరలను ద్రవీకరించి అతికెదరు.తెలుగులో ద్రవీకరించి అతుకుట అనియు ఆంగ్లంలోFusion Weldingఅందురు.రెండింటిలోను కిరణాలను కటకం ద్వారా కేంద్రాంతరం వద్ద కేంద్రికరించి లోహాలను వేడిచేసి, ద్రవీకరించి అతికెదరు.లేసరు బీమ్‌ వెల్డింగులో రెండు పద్ధతులున్నాయి .ఒకటి సాలిడ్ స్టేట్ వెల్డింగు రెందవది గ్యాసు లేసరు[3]

కెంపు స్పటికంతో చేసిన మొదటి లేసరు పరికరాన్ని 1060 లో Hughes laboratory వారు తయారుచేసారు[4]

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

సూచికలు

[మార్చు]
  1. "What is a laser?". spaceplace.nasa.gov/. Retrieved 12 మార్చి 2014.
  2. "A Brief History of Lasers" (PDF). kigre.com. Archived from the original (PDF) on 2014-06-11. Retrieved 12 మార్చి 2014.
  3. "What Is Laser Beam Welding?". wisegeek.com/. Retrieved 12 మార్చి 2014.
  4. "Laser Beam Welding" (PDF). mercury.kau.ac.kr. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 12 మార్చి 2014.