స్నేహ దీప్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్నేహ దీప్తి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వూటాల స్నేహ దీప్తి
పుట్టిన తేదీ (1996-09-10) 1996 సెప్టెంబరు 10 (వయసు 27)
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ స్పిన్
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 108)2013 ఏప్రిల్ 12 - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.7
తొలి T20I (క్యాప్ 38)2013 ఏప్రిల్ 2 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2013 ఏప్రిల్ 5 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008/09–2015/16ఆంధ్రా
2021/22–ప్రస్తుతంఆంధ్రా
2023–ప్రస్తుతంఢిల్లీ క్యాపిటల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 1 2
చేసిన పరుగులు 4 1
బ్యాటింగు సగటు 4.00 1.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 4 1
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: Cricinfo, 2022 జూలై 28

వూటాల స్నేహ దీప్తి, ప్రస్తుతం ఆంధ్రా తరపున ఆడుతున్న క్రికెట్ క్రీడాకారిణి. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణిస్తోంది. 2013లో భారతదేశం తరపున ఒక వన్డే ఇంటర్నేషనల్,రెండు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లు ఆడింది. 2013 ఏప్రిల్ లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

స్నేహ దీప్తి 1996, సెప్టెంబరు 10న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది.[2] చిన్నతనంలో ఏ విధమైన క్రీడలపై ఆసక్తి లేకపోయినా తన తండ్రి, సోదరుడితో కలిసి గల్లీ క్రికెట్ ఆడటం ప్రారంభించింది.[3] విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగి అయిన తండ్రి ఒత్తిడితో, ఆటను సీరియస్‌గా ఆడటం ప్రారంభించింది. నాల్గవ తరగతికి చేరుకునే సమయానికి కోచింగ్ తరగతులకు వెళ్ళింది.[3] తండ్రి స్నేహ దీప్తిని, ఆమె చెల్లెలు రమ్య దీపికను సమ్మర్ కోచింగ్ క్యాంపులో చేర్పించారు. వారి కోచ్ కృష్ణారావు వద్ద సరైన శిక్షణ పొందేందుకు, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎసిఎ-విడిసిఏ స్టేడియం క్రికెట్‌లోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేందుకు కుటుంబం ఉక్కునగరం (విశాఖపట్నం స్టీల్ ప్లాంట్) నుండి విశాఖపట్నంలోని మరొక శివారు ప్రాంతమైన పోతినమల్లయ్య పాలెంకు మారింది.[4]

క్రికెట్ రంగం[మార్చు]

2013లో దీప్తి ఆంధ్రా మహిళల క్రికెట్ జట్టు నుండి డబుల్ సెంచరీ చేసిన మొదటి క్రికెటర్ గా నిలిచింది. సీనియర్ మహిళల అంతర్ జిల్లాల మ్యాచ్‌లో తూర్పు గోదావరిపై 203 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగిన 2012-13 హోమ్ సిరీస్‌కు జాతీయ జట్టుకు ఎంపికైంది.[1] 16 సంవత్సరాల 204 రోజుల వయస్సులో దీప్తి మహిళల ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెట్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతిపిన్న వయస్కురాలుగా రికార్డు సాధించింది.[5] 2015 ఆగస్టులో శ్రీకాకుళంపై 350 పరుగులు చేసింది, ఇది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నార్త్ జోన్ అంతర్-జిల్లా మహిళల టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో శ్రీకాకుళంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున మహిళా క్రికెటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ మ్యాచ్‌లో ఆమె నాలుగు పరుగులకే రెండు వికెట్లు పడగొట్టింది.[6]

దీప్తి వివాహం చేసుకుని తన మొదటి బిడ్డకు జన్మనిచ్చేందుకు క్రికెట్‌కు విరామం తీసుకుంది: ఆమె 2021–22 సీజన్‌లో ఆంధ్ర జట్టుకు ఆడేందుకు, కెప్టెన్‌గా వ్యవహరించడానికి తిరిగి వచ్చింది.[7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Sneha Deepthi". ESPNcricinfo. Archived from the original on 2 September 2017. Retrieved 2023-08-07.
  2. 2.0 2.1 "Player Profile: Sneha Deepthi". CricketArchive. Retrieved 2023-08-07.
  3. 3.0 3.1 Pillay, Dipika (4 April 2013). "I've Dhoni's posters on my walls!". The Times of India. Archived from the original on 3 September 2017. Retrieved 2023-08-07.
  4. G., Narasimha Rao (7 August 2015). "Confident Sneha Deepthi aims high". The Hindu. Archived from the original on 3 September 2017. Retrieved 2023-08-07.
  5. "Records / Women's Twenty20 Internationals / Individual Records (Captains, Players, Umpires) / Youngest Players". ESPNcricinfo. Archived from the original on 2 September 2017. Retrieved 2023-08-07.
  6. "Regional round-up". The Hindu. 7 August 2015. Archived from the original on 3 September 2017. Retrieved 2023-08-07.
  7. "Sneha aims to become first cricketer to make India comeback after pregnancy". The New Indian Express. 22 July 2022. Retrieved 2023-08-07.

బయటి లింకులు[మార్చు]