స్మితా వాఘ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్మితా వాఘ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు ఉన్మేష్ భయ్యాసాహెబ్ పాటిల్
నియోజకవర్గం జలగావ్

మహారాష్ట్ర శాసనమండలి సభ్యురాలు
పదవీ కాలం
జనవరి 2015 – ఏప్రిల్ 2020
ముందు వినోద్ తావ్డే

వ్యక్తిగత వివరాలు

జననం (1968-03-26) 1968 మార్చి 26 (వయసు 56)
జలగావ్ , మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఉదయ్ వాఘ్
సంతానం 2
నివాసం జలగావ్
వృత్తి రాజకీయ నాయకురాలు
మూలం [1]

స్మితా ఉదయ్ వాఘ్ (జననం 26 మార్చి 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలగావ్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

స్మితా వాఘ్ తన భర్త ఉదయ్ బాపు వాగ్‌తో కలిసి విద్యార్థి దశ నుండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ తో రాజకీయాల్లో చురుకుగా పాల్గొని బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా, జల్గావ్ జిల్లా పరిషత్ సభ్యురాలిగా మూడుసార్లు ఎన్నికై, 1 నవంబర్ 2009 నుండి 2012 వరకు చైర్‌పర్సన్‌గా పని చేసింది. ఆమె పార్టీలో జల్గావ్ జిల్లా మహిళా అఘడి జిల్లా అధ్యక్షురాలిగా, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో పని చేసి 23 జనవరి 2015 నుండి 23 ఏప్రిల్ 2020 వరకు మహారాష్ట్ర శాసనమండలి సభ్యురాలిగా పని చేసింది.

స్మితా వాఘ్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలగావ్ నియోజకవర్గం టికెట్ దక్కగా చివరి నిమిషంలో పార్టీ ఉన్మేష్ పాటిల్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయనకు మద్దతుగా పని చేసింది. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జలగావ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అభ్యర్థి కరణ్ బాలాసాహెబ్ పాటిల్ - పవార్‌పై 251594 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై,[3][4] 26 సెప్టెంబర్ 2024 నుండి పరిశ్రమపై కమిటీ సభ్యురాలిగా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. India Today (13 July 2024). "Women activists | Beating all odds" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jalgaon". Retrieved 21 October 2024.
  4. TV9 Bharatvarsh (6 June 2024). "जलगांव लोकसभा सीट से जीतने वाली बीजेपी की स्मिता वाघ कौन हैं, जानिये अपने सांसद को". Retrieved 21 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)