కోడిహళ్లి మురళీ మోహన్
కోడిహళ్లి మురళీ మోహన్ | |
---|---|
జననం | కోడిహళ్లి మురళీ మోహన్ 1966 ఫిబ్రవరి 4 మడకశిర, అనంతపురం జిల్లా ప్రస్తుత శ్రీ సత్య సాయి జిల్లా |
ఇతర పేర్లు | స్వరలాసిక |
విద్య | ఎలెక్ట్రికల్ ఇంజనీరింగులో డిప్లొమా |
ఉద్యోగం | దక్షిణమధ్యరైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు రచయిత,సంపాదకులు |
జీవిత భాగస్వామి | శాంతకుమారి |
పిల్లలు | కె.శ్రీహరిప్రమోద్, కె.శ్రీసాయిప్రణీత |
తల్లిదండ్రులు | శ్రీమతి కె.పద్మావతి, శ్రీ కె.గోపాలకృష్ణ |
కోడీహళ్లి మురళీ మోహన్ తెలుగు రచయిత.[1] ఇతను"స్వరలాసిక" కలం పేరుతో ఆంధ్రభూమి దిన పత్రిక, నేటి నిజం దినపత్రిక, ఈవారం, జాగృతి లాంటి పత్రికలలో వివిధ గ్రంథాలపై చేసిన సమీక్షల్ని "గ్రంథావలోకనమ్" పేరుతో వెలువరించారు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]ఇతను దక్షిణ మధ్య రైల్వే విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నాడు.[3] కోడీహళ్లి సమీక్షలలో సమకాలీన సాహిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు కనిపిస్తాయి.ఆధునికమైన తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల స్వరూప స్వభావాలను చూస్తాడు.[4] అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యవర్గంలో కార్యదర్శిగా ఉన్నాడు[5] .
రచనలు
[మార్చు]ముద్రిత రచనలు
[మార్చు]- గ్రంథావలోకనమ్ (సమీక్షావ్యాసాల సంపుటి)
- సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం-సహసంపాదకత్వం [7]
- జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు[8]
- ఆంధ్రసాహిత్యములో బిరుదనామములు
- రైలు కథలు - సహసంపాదకత్వం
- దేశభక్తి కథలు - సహసంపాదకత్వం
- తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు - సహసంపాదకత్వం
- కులం కథ - సహసంపాదకత్వం
- క్రీడా కథ - సహసంపాదకత్వం
- పదచదరాలు - సంపాదకత్వం
- స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి - సంపాదకత్వం
- రామకథాసుధ - సహసంపాదకత్వం
ఇంకా కొన్ని కథలు, పుస్తకసమీక్షలు, సాహిత్యవ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురణకు నోచుకున్నాయి.
సాహితీవ్యాపకం
[మార్చు]- అబ్జక్రియేషన్స్ సాహిత్యసాంస్కృతిక సంస్థ (రి), హైదరాబాద్‌కు వ్యవస్థాపక కార్యదర్శి.
- పొద్దు అంతర్జాల పత్రిక సంపాదకమండలిలో సభ్యునిగా కొన్నాళ్లు.
- కథాజగత్ వెబ్సైటు, తురుపుముక్క, శ్రీసాధనపత్రిక బ్లాగుల నిర్వహణ
- అరసం మహాసభలు, రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు, జాగృతి పాత్రికేయ శిక్షణాశిబిరం, జాగృతి కథారచయితల సమ్మేళనం మొదలైన సభలలో పాల్గొన్న అనుభవం.
తెలుగు వికీపీడియాలో కృషి
[మార్చు]ఇతను తెలుగు వికీపీడియాలో ఏప్రిల్ 10 2013 న చేరి[9] సాహితీ ప్రముఖుల జీవిత చరిత్రలు, పుస్తక సమీక్షలకు సంబంధించిన వ్యాసాలను చేర్చాడు.[10]
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు వెలుగు, అంతర్జాలంలో తెలుగు (10 October 2018). "తెవికీ అక్షర సేనానులు". www.teluguvelugu.in. Archived from the original on 22 February 2021. Retrieved 22 February 2021.
- ↑ "వినదగు నెవ్వరు జెప్పిన... 'గ్రంథావలోకనమ్' పై స్పందన!!!". Archived from the original on 2016-03-06. Retrieved 2015-09-17.
- ↑ గూగుల్ గ్రూప్స్
- ↑ [గ్రంథ సమీక్షగా సాహితీ తేజమ్ ఏప్రియల్ 2009 సంచిక]
- ↑ Kathajagat, a compilation of Telugu stories
- ↑ పుస్తక వివరాలు[permanent dead link]
- ↑ సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం
- ↑ Kodihalli Murali Mohan's Books
- ↑ General statistics of swarasalika
- ↑ new articles created by swaralasika
ఇతర లింకులు
[మార్చు]- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- తెలుగు రచయితలు
- సాహితీకారులు
- సంపాదకులు
- 1966 జననాలు
- తెలుగు వికీపీడియా సభ్యులు
- అనంతపురం జిల్లా రచయితలు
- జీవిస్తున్న ప్రజలు