స్వర్ణయుగ సంగీత దర్శకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వర్ణయుగ సంగీత దర్శకులు
స్వర్ణయుగ సంగీత దర్శకులు పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: పులగం చిన్నారాయణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సినిమా
ప్రచురణ: చిమట మ్యూజిక్
విడుదల: 2011


స్వర్ణయుగ సంగీత దర్శకులు (2011) పులగం చిన్నారాయణ రచించిన పుస్తకం. 80 ఏళ్ల సుదీర్ఘ తెలుగు సినీ ప్రస్థానంలో, తెలుగు సినిమా సంగీతాన్ని అజరామరం చేసిన సుమారు 30 మంది సుప్రసిద్ధ సంగీత దర్శకుల సినీ జీవిత విశేషాలు ఇందులో పొందుపరచబడ్డాయి.

దీనిని చిమట మ్యూజిక్ వారు 2011 లో ప్రచురించారు."ఎందరో మహానుభావులు అందరికి వందనాలు" అనే మాట క్రింద పొందుపరచిన సంగీత దర్శకులకు సరిగ్గా సరిపోతుంది.

ముందుమాట[మార్చు]

ఈ స్వరకర్తల సంగీత ప్రయాణాన్ని ఒక గ్రంథంగా మలిచి, ఇంతగా ప్రజాదరణ పొందటానికి ముఖ్యకారకులైన చిమట మ్యూజిక్ అధినేత చిమట శ్రీనివాసరావు, పులగం చిన్నారాయణల అకుంటిత దీక్ష, కృషి ఫలితమే ఈ "స్వర్ణయుగ సంగీత దర్శకులు". అందునా ముఖ్యంగా చిమట శ్రీనివాసరావు గారి గురించి చెప్పుకోవాలి. ఈయన స్వతహాగా తెలుగు భాషాభిమాని. అందునా తెలుగు పాత పాటలంటే ఈయనకు ఎనలేని మక్కువ.ఆ ఇష్టంతోనే చిమటమ్యూజిక్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించి అందులో 50వ దశకం నుంచి 90వ దశకం ప్రారంభం వరకు తెలుగులో వచ్చిన మెలోడిలన్నింటిని ఇందులో పొందుపరిచారు. ఈయన ఓరోజు గొల్లపూడి రాసిన "అమ్మ కడుపు చల్లగా" అనే పుస్తకాన్ని చదవటం జరిగింది. ఆ సమయంలోనే అదే క్వాలిటితో మన తెలుగు సంగీత దర్శకుల జీవిత చరిత్ర విశేషాలతో ఓ పుస్తకాన్ని ప్రచురించాలని నిశ్చయించుకున్నారు. అలా నిర్ణయించుకున్నాక ఒక మంచి రచయిత కోసం అన్వేషణ మొదలైంది.

అలా శ్రీనివాసరావు గారి స్నేహితుడైన సంజయ్ కిషోర్ ని సంప్రదించారు. ఆయన పులగం చిన్నారాయణ అయితే ఈ పుస్తకాన్ని ఓ మహాగ్రంధంగా తీర్చిదిద్దగలడని, దీనికి అవసరమైన పాత ఫొటోలన్నింటిని కిషోర్ గారు ఇస్తానని చెప్పగా వెంటనే చిన్నారాయణను కలిసి ఈ మహాయజ్ఞం గురించి చెప్పగా ఆయన అంగీకరించి, ఒక మహాగ్రంధంగా మలిచిన తీరు అద్భుతం. ఈ విషయంలో పులగం చిన్నారాయణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

పులగం చిన్నారాయణ గారు కృషి, పట్టుదల అకుంటిత దీక్షా ఫలితమే ఈ మహాగ్రంధం. ఈ గ్రంథంలో ఆయన రచనా శైలి, కొన్ని పద ప్రయోగాలు, పాఠకులను ఆశాంతం కట్టిపడేస్తాయి. ఆ మహానుభావుల జీవిత విశేషాలను, వాళ్లు స్వరపరిచిన పాటల పద పల్లవులను, చిత్రాల సమాహారాన్నికూడా పొందుపరిచారు. ఈ మహాగ్రంధాన్ని ఏ యూనివర్సిటికి సమర్పించిన ఈయనకు డాక్టరేట్ రావడం కచ్చితం.

సంగీత దర్శకులు[మార్చు]

 1. హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
 2. గాలి పెంచల నరసింహారావు
 3. భీమవరపు నరసింహరావు
 4. ఓగిరాల రామచంద్రరావు
 5. సాలూరి రాజేశ్వరరావు
 6. చిత్తూరు వి.నాగయ్య
 7. బాలాంత్రపు రజనీకాంతరావు
 8. మాస్టర్ వేణు
 9. సుసర్ల దక్షిణామూర్తి
 10. సి.ఆర్. సుబ్బరామన్
 11. ఘంటసాల వెంకటేశ్వరరావు
 12. సాలూరి హనుమంతరావు
 13. పెండ్యాల నాగేశ్వరరావు
 14. పి. ఆదినారాయణ రావు
 15. అశ్వత్ధామ
 16. టి.వి.రాజు
 17. ఎమ్మెస్ విశ్వనాథన్
 18. తాతినేని చలపతిరావు
 19. భానుమతి రామకృష్ణ
 20. బి.గోపాలం
 21. రమేష్ నాయుడు
 22. రాజన్-నాగేంద్ర
 23. కె.వి.మహదేవన్
 24. ఎస్.పి.కోదండపాణి
 25. జి.కె. వెంకటేష్
 26. చెళ్ళపిళ్ళ సత్యం
 27. జె.వి.రాఘవులు
 28. చక్రవర్తి
 29. ఇళయరాజా
 30. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]