స్వర్ణలతా నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వర్ణలతా నాయుడు
స్వర్ణలతా నాయుడు
జననంస్వర్ణలతా నాయుడు
(1975-09-08)1975 సెప్టెంబరు 8
నాగార్జునసాగర్, నల్గొండ జిల్లా, తెలంగాణ భారతదేశం
మరణంజూలై 3, 2016
మరణ కారణంగుండె సంబంధిత వ్యాధి
వృత్తికవయిత్రి
మతంహిందూ
భార్య / భర్తనరసింహారావు
పిల్లలుశ్రీశివాని
తండ్రిరాధాకృష్ణ
తల్లిఅనురాధ

స్వర్ణలతా నాయుడు (సెప్టెంబర్ 8, 1975 - జూలై 3, 2016) యువ కవయిత్రులలో ఒకరు. 2012 సెప్టెంబర్ 5 నుండి కవితలు రాయడం ప్రారంభించి, ఇప్పటివరకు 100 కవితలకు పైనా రచించారు. ఏకవాక్య కవితలు (400 వరకు) కూడా రాశారు. కవి సంగమం రచయితలలో ఒకరు

జననం - విద్యాభ్యాసం[మార్చు]

వీరు అనురాధ, రాధాకృష్ణ దంపతులకు 1975, సెప్టెంబర్ 8నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో జన్మించారు. ఖమ్మంలో ఉండండ వల్ల డిగ్రీ వరకి అక్కడే చదివారు. అనంతరం హైద్రాబాద్ లోని వనితా కళాశాలలో జంతుశాస్త్రంలో ఎం.ఎస్సీ చేశారు.

దస్త్రం:Jwalinchina Ragalu Cover Photo.jpg
జ్వలించిన రాగాలు పుస్తక ముఖచిత్రం
దస్త్రం:Poolapitta Cover Photo.jpg
పూలపిట్ట పుస్తక ముఖచిత్రం

భర్త - పిల్లలు[మార్చు]

1999 ఆగస్టు 27న సోమిశెట్టి నరసింహారావుగారితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప (శ్రీశివాని).

ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]

హిమవర్షం అనే కవిత ఆంధ్రభూమిలో ప్రచురితం అయింది.

కవితల జాబితా[మార్చు]

మబ్బుల పల్లకి, తీపి తెలుగు, వలపుల సంద్రం, నా రాజు, అమ్మ, స్వాతంత్ర్యం, కాలానికి రంగులద్దుకోవాలి,[1] ఉదయకాంతుల ఉగాది,[2] వంటి కవితలు వివిధ పత్రికలలో 90 కవితలపైనే అచ్చయ్యాయి. వీరి కవిత NATA లో కూడా ప్రచురితం అయింది.

ప్రచురితమయిన పుస్తకాల జాబితా[మార్చు]

  • శ్రీస్వర్ణ కిరణాలు 2014 మే 24న విడుదలైంది.

మరణం[మార్చు]

గత కొన్ని రోజులుగా హార్ట్ ప్రాబ్లంతో హాస్పటల్ లో చికిత్సపొందుతూ 2016, జూలై 3 న తుదిశ్వాస విడిచారు.

శ్రీ స్వర్ణ కిరణాలు ...ఆవిష్కరణ చిత్రమాలిక[మార్చు]

జ్వలించిన రాగాలు, పూలపిట్ట... ఆవిష్కరణ చిత్రమాలిక[మార్చు]

ఇతర చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "కాలానికి రంగులద్దుకోవాలి". Retrieved 3 July 2017.
  2. నమస్తే తెలంగాణ. "ఉదయకాంతుల ఉగాది". Retrieved 3 July 2017.

లింకులు[మార్చు]