స‌చిన్ పైలట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స‌చిన్ పైల‌ట్
స‌చిన్ పైలట్


శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
17 డిసెంబర్ 2018
ముందు అజిత్ సింగ్ మెహతా
నియోజకవర్గం టోంక్

పదవీ కాలం
17 డిసెంబర్ 2018 – 14 జులై 2020
గవర్నరు కళ్యాణ్ సింగ్
కల్రాజ్ మిశ్రా
ముందు కమల బేణీవాల్ (2003)

రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష్యుడు
పదవీ కాలం
13 జనవరి 2014 – 14 జులై 2020
ముందు సీ.పీ. జోషి
తరువాత గోవింద్ సింగ్ దోతాస్ర

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
29 అక్టోబర్ 2012 – 24 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు వీరప్ప మొయిలీ
తరువాత అరుణ్ జైట్లీ

కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి
పదవీ కాలం
28 మే 2009 – 28 ఆక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2009 – 16 మే 2014
ముందు రాసా సింగ్ రావత్
తరువాత సన్వార్ లాల్ జట్
నియోజకవర్గం అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం
పదవీ కాలం
17 మే 2004 – 16 మే 2009
ముందు రామ పైలట్
తరువాత కిరోడి లాల్ మీనా
నియోజకవర్గం దౌసా లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1977-09-07) 1977 సెప్టెంబరు 7 (వయసు 46)
సహరాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రాజేష్ పైలట్ (నాన్న)
రామ పైలట్ (తల్లి)
జీవిత భాగస్వామి సారా పైలట్ (వివాహం 2004)
బంధువులు ఫారూఖ్ అబ్దుల్లా (మామయ్య, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి)
ఒమర్ అబ్దుల్లా (బావమరిది, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి)
సంతానం ఆరన్, వేహాన్
పూర్వ విద్యార్థి బీఏ (సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ఢిల్లీ)
ఎంబీఏ, యూనివర్సిటీ అఫ్ పెన్సిల్వేనియా

స‌చిన్ పైల‌ట్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, రాజస్తాన్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి.[1] ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సచిన్ పైలట్ 7 సెప్టెంబరు 1977లో సహరాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజేష్ పైలట్ (మాజీ కేంద్ర మంత్రి), రమ పైలట్ దంపతులకు జన్మించాడు. ఆయన పూర్వీకులది ఉత్తరప్రదేశ్ లోని వైద్ పుర. సచిన్ న్యూ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి పాఠశాలలో పదవ తరగతి వరకు, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ లో బీఏ వరకు చదివాడు. ఆయన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాజేష్ పైలట్ 2004లో దౌసా లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ నుండి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచాడు. ఆయన వయస్సు అప్పుడు 26 ఏళ్ళు, ఆయన అతిపిన్న వయస్సులో ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించాడు. ఆయన 2009లో అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిరణ్ మహేశ్వరి పై ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాజేష్ పైలట్ యూపీఏ ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సహాయమంత్రిగా పని చేశాడు. ఆయన 2009లో అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. రాజేష్ పైలట్ 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో టోంక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.

పోటీ చేసిన స్థానాలు, ఫలితం

[మార్చు]
ఎన్నికలు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం
2004 పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ దౌసా లోక్‌సభ నియోజకవర్గం గెలుపు
2009 పార్లమెంట్ ఎన్నికలు అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం గెలుపు
2014 పార్లమెంట్ ఎన్నికలు ఓటమి
2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ అసెంబ్లీ టోంక్ అసెంబ్లీ నియోజకవర్గం గెలుపు

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం

[మార్చు]

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం ముంగిట నిలిచింది.రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌పై ఆగ్రహంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకుని వెళ్లారు. సచిన్‌ పైలట్‌ తన వద్ద 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని ప్రకటించాడు.[3] ఈ సంక్షోభ సమయంలో సచిన్‌ పైలట్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు. సచిన్‌ పైలట్‌ బీజేపీలో చేరుతున్నాడని ప్రచారం జరిగింది.[4]

ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ నివాసంలో శాసనసభా పక్షం సమావేశం ఉందని, ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఉండడం తప్పనిసరి అని ఆదేశించింది. అనంతరం అసంతృప్త నేత సచిన్ పైలట్‌ను రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తాను బీజేపీలో చేరబోవడం లేదని ప్రకటించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. NDTV. "The End Nears. Sachin Pilot Is Now Ex Deputy Chief Minister: 10 Points". NDTV.com. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
  2. Namasthe Telangana (20 August 2023). "కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని పునరుద్ధరించిన ఖర్గే.. సచిన్‌ పైలట్‌, శశిథరూర్‌, రఘువీరాలకు చోటు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  3. The Times of India, Bhanupratap Singh / TNN / Updated: (13 July 2020). "Rajasthan government news: Sachin Pilot revolts, says Gehlot govt in minority; dy CM claims support of 30 MLAs | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2021. Retrieved 31 May 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 7 మే 2021 suggested (help)CS1 maint: extra punctuation (link)
  4. Eenadu (12 July 2020). "వేడెక్కిన రాజ‌స్థాన్ రాజ‌కీయం..!". EENADU. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
  5. BBC News తెలుగు (13 July 2020). "రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు ఊరట". BBC News తెలుగు. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.