సీ.పీ. జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీ.పీ. జోషి
సీ.పీ. జోషి


పదవీ కాలం
16 జనవరి 2019 – 20 డిసెంబర్ 2023
గవర్నరు కళ్యాణ్ సింగ్
కల్రాజ్ మిశ్రా
ముందు కైలాష్ చంద్ర మేఘవాల్
తరువాత వాసుదేవ్ దేవనాని

పదవీ కాలం
19 జనవరి 2011 – 16 జూన్ 2013
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు కమల్ నాథ్
తరువాత ఆస్కార్ ఫెర్నాండేజ్

కేంద్ర రైల్వే శాఖ మంత్రి
పదవీ కాలం
11 మే 2013 – 16 జూన్ 2013
ముందు పవన్ కుమార్ బన్సాల్
తరువాత మల్లికార్జున్ ఖర్గే
పదవీ కాలం
22 సెప్టెంబర్ 2012 – 28 అక్టోబర్ 2012
ముందు ముకుల్ రాయ్
తరువాత పవన్ కుమార్ బన్సాల్

పదవీ కాలం
22 మే 2009 – 18 జనవరి 2011
ముందు మణిశంకర్ అయ్యర్
తరువాత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్

పదవీ కాలం
2009 – 2014
ముందు విజయేంద్రపాల్ సింగ్
తరువాత సుభాష్ చంద్ర బహేరియా
నియోజకవర్గం భిల్వారా

విద్య, గ్రామీణాభివృద్ధి & పంచాయతీరాజ్, భూగర్భ జలాలు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి
పదవీ కాలం
7 డిసెంబర్ 1998 – 4 డిసెంబర్ 2003

ఎమ్మెల్యే
పదవీ కాలం
2018 – 3 డిసెంబర్ 2023
ముందు కళ్యాణ్ సింగ్ చౌహాన్
తరువాత విశ్వరాజ్ సింగ్ మేవార్
నియోజకవర్గం నాథద్వారా
పదవీ కాలం
1998 – 2008
ముందు శివ్ దాన్ సింగ్ చౌహాన్
తరువాత కళ్యాణ్ సింగ్ చౌహాన్
Constituency నాథద్వారా

వ్యక్తిగత వివరాలు

జననం (1950-07-29) 1950 జూలై 29 (వయసు 73)
నాథద్వారా, రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి సైకాలజీ ప్రొఫెసర్

సీ.పీ. జోషి (జననం 29 జూలై 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాథ్‌ద్వారా నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2009 నుండి 2013 వరకు కేంద్ర రైల్వే,[1] రోడ్డు రవాణా, రహదారులు & పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆ తరువాత 16 జనవరి 2019 నుండి 20 డిసెంబర్ 2023 వరకు రాజస్థాన్ శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సీ.పీ. జోషి 29 జూలై 1950న రాజస్థాన్ రాష్ట్రం, నాథద్వారాలో జన్మించాడు. ఆయన తన ప్రాథమిక, ఉన్నత మాధ్యమిక విద్యను నాథ్‌ద్వారాలో పూర్తి చేసి యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ & హ్యుమానిటీస్, ఉదయపూర్ నుండి లాలో బిఎతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తరువాత మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. జోషి ఉదయపూర్‌లోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ & హ్యుమానిటీస్ లెక్చరర్‌గా తన విద్యా వృత్తిని ప్రారంభించి ఆ తరువాత ఉదయపూర్‌లోని మోహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పని చేసి రాజకీయాలలోకి వచ్చాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సీ.పీ. జోషి మోహన్ లాల్ సుఖాడియా ప్రోద్బలంతో రాజకీయాల్లో వచ్చి 1980లో తొలిసారిగా నాథ్‌ద్వారా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1985, 1998, 2003 ఎన్నికలలో గెలిచి 7 డిసెంబర్ 1998 నుండి 4 డిసెంబర్ 2003 వరకు అశోక్ గెహ్లోట్ మంత్రివర్గంలో విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, పాలసీ ప్లానింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పని చేశాడు.

సీ.పీ. జోషి  2003లో రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. ఆయన 2008 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్‌ చేతిలో కేవలం ఒక ఓటు తేడాతో ఓడిపోయి, భారత ఎన్నికల చరిత్రలో ఒక్క ఓటు తేడాతో శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన రెండో వ్యక్తిగా నిలిచాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని సంతేమరహళ్లి నియోజకవర్గంలో ఆర్. ధృవనారాయణపై ఏఆర్ కృష్ణమూర్తి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన మొదటి అభ్యర్థి.  

సీ.పీ. జోషి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భిల్వారా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2009 నుండి 2013 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర రైల్వే, రోడ్డు రవాణా, రహదారులు & పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2013 నుండి 2018 వరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. సీ.పీ. జోషి 2014 లోక్‌సభ ఎన్నికలలో జైపూర్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

సీ.పీ. జోషి 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాథద్వారా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజస్థాన్ శాసనసభ స్పీకర్‌గా పని చేశాడు. ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి విశ్వరాజ్ సింగ్ మేవార్‌పై  నాథ్‌ద్వారా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. India Today (24 September 2012). "CP Joshi takes over as Railway Minister" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  2. The Wire (16 January 2019). "Former Union Minister C.P. Joshi Elected Speaker of Rajasthan Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  3. India Today (3 December 2023). "Nathdwara Assembly Election Results 2023 Highlights: BJP's Vishvaraj Singh Mewar defeats INC's C. P. Joshi with 7636 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.