కైలాష్ చంద్ర మేఘవాల్
Appearance
కైలాష్ చంద్ర మేఘవాల్ | |||
| |||
పదవీ కాలం 22 జనవరి 2014 – 15 జనవరి 2019 | |||
ముందు | దీపేంద్ర సింగ్ షెకావత్ | ||
---|---|---|---|
తరువాత | సీ.పీ. జోషి | ||
నియోజకవర్గం | షాపురా | ||
పదవీ కాలం 2003-2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
హోం మంత్రి
| |||
పదవీ కాలం 1993 - 1998 | |||
Member of Parliament
for టోంక్ | |||
పదవీ కాలం 2001-2009 | |||
పదవీ కాలం 1989 to 1991 | |||
నియోజకవర్గం | జలోర్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2008-2023 | |||
నియోజకవర్గం | షాపురా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉదయపూర్, ఉదయపూర్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా | 1934 మార్చి 22||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | ఉదయపూర్, రాజస్థాన్ , భారతదేశం | ||
వెబ్‌సైటు | [1] |
కైలాష్ చంద్ర మేఘవాల్ (జననం 22 మార్చి 1934) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, రెండుసార్లు టోంక్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2003 నుండి 2004 వరకు కేంద్ర సామాజిక న్యాయ & సాధికారత సహాయ మంత్రిగా పని చేశాడు.
ప్రజా ప్రతినిధిగా ఎన్నిక
[మార్చు]- 1977-1985, రాజస్థాన్ శాసన సభ్యుడు (రెండు పర్యాయాలు)
- 1989 జలోర్ నుండి 9వ లోక్ సభకు ఎన్నికయ్యారు
- 1990 రాజస్థాన్ శాసన సభ్యుడు (3వ పర్యాయం)
- 1993-1998 రాజస్థాన్ శాసన సభ్యుడు (4వ పర్యాయం)
- 22 సెప్టెంబర్ 2001 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (ఉప ఎన్నికలో, 2వ పర్యాయం)
- 2004 14వ లోక్‌సభకు టోంక్ నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నికయ్యారు, (3వసారి)
- 2013 రాజస్థాన్ శాసన సభ్యుడు (5వ పర్యాయం)
- 2018 రాజస్థాన్ శాసన సభ్యుడు (6వ పర్యాయం)
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1962 ప్రజా సోషలిస్ట్ పార్టీ జాయింట్ సెక్రటరీ, రాజస్థాన్
- 1969-1975 భారతీయ జనసంఘ్ జాయింట్ సెక్రటరీ, రాజస్థాన్
- 1977 గనులు & భూగర్భ శాస్త్రం, పంచాయతీ రాజ్ & గొర్రెలు, ఉన్ని మంత్రిత్వ శాఖ స్వతంత్ర బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం
- 1978 కేబినెట్ మంత్రి, సహకరిత, గనులు, భూగర్భ శాస్త్రం, రాజస్థాన్ ప్రభుత్వం
- 1980-1982, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి,
- 1981-1984 సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రాజస్థాన్ శాసనసభ
- 1982-1985 బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
- 1987 నుండి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
- 1991-1992 రాజస్థాన్ నీటిపారుదల శాఖ మంత్రి
- 1994-1998 రాజస్థాన్ హోం , గనులు& ముద్రణ శాఖ మంత్రి
- 2003-2004 కేంద్ర సామాజిక న్యాయ & సాధికారత శాఖ మంత్రి
- రాజస్థాన్ గనులు, భూగర్భ శాస్త్ర కేబినెట్ మంత్రి (20.12.2013-21.01.2014)
- రాజస్థాన్ శాసనసభ స్పీకర్ (22.01.2014 నుండి 15.01.2019)[1]
మూలాలు
[మార్చు]- ↑ "Rajasthan Legislative Assembly". Rajassembly. Govt of Rajasthan. Retrieved 15 February 2018.