Jump to content

హంతకులొస్తున్నారు జాగర్త

వికీపీడియా నుండి
(హంతకులొస్తున్నారు జాగ్రత్త నుండి దారిమార్పు చెందింది)
హంతకులొస్తున్నారు జాగర్త
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.డి.లాల్
నిర్మాణం పింజల సుబ్బారావు
తారాగణం గుమ్మడి,
అంజలీదేవి,
రామకృష్ణ,
చలం,
గీతాంజలి,
రావి కొండలరావు
సంగీతం విజయా కృష్ణమూర్తి
నేపథ్య గానం పి.సుశీల,
ఘంటసాల
గీతరచన సి.నారాయణరెడ్డి
సంభాషణలు మహారథి
ఛాయాగ్రహణం ఎస్.ఎస్.లాల్
కళ సోమనాథ్
నిర్మాణ సంస్థ పి.ఎస్.ఆర్. పిక్చర్స్
పంపిణీ అపరాజిత ఫిలిమ్స్ (ఆంధ్ర, రాయలసీమ),
ఉషా ఫిలిమ్స్ (నైజాం)
భాష తెలుగు

హంతకులొస్తున్నారు జాగర్త 1966, ఆగస్టు 6న విడుదలైయింది.[1]. పి. ఎస్. ఆర్ . పిక్చర్స్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రంలో గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీదేవి , రామకృష్ణ , గీతాంజలి, చలం నటించారు. ఎస్. డి లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం విజయా కృష్ణమూర్తి అందించారు.

నటీనటులు

[మార్చు]

ఒక హత్య చేసినందుకుగాను పోలీసులు నలుగురు హంతకులను పట్టుకొని జైలులో ఉంచారు. రఘురామయ్య అనే పెద్దమనిషి ఆచూకీ ఇవ్వడం మూలంగానే పోలీసులు తమను పట్టుకోవటం జరిగిందని ఆ హంతకులు అభిప్రాయపడ్డారు. అదీగాక హతుడైన వ్యక్తి కుమారుడు కళ్లు పోయి ఆస్పత్రిలో ఉన్నాడు. ఆ పిల్లవాణ్ణీ, రఘురామయ్యను హతమారిస్తే తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారు ఉండరని భావించి ఆ నలుగురు హంతకులు జైలు నుంచి తప్పించుకొని బయటికి వచ్చారు. రఘురామయ్య ఇంటిలోకి ప్రవేశించారు. ఆ సమయంలో రఘురామయ్య ఇంటిలో లేడు. చావు బతుకులలో ఉన్న మామగారిని చూడటానికి హైదరాబదు వెళ్లాడు. రఘురామయ్య తిరిగి వచ్చేవరకూ తామక్కడే ఉంటామనీ, తమ ఉనికి ఎవ్వరికీ తెలియనివ్వకూడదనీ రఘురామయ్య భార్య సావిత్రిని, తమ్ముడు మురళిని, చెల్లెలు జయను హంతకులు నిర్భందంలో ఉంచారు. హైదరాబాదు నుండి తిరిగి వచ్చిన రఘురామయ్యను హంతకులు ఎదుర్కొన్నారు. నాలుగు రోజులు ఆ ఇంటిలో ప్రత్యక్షనరకమే తాండవించింది. చివరకు దుండగులు తమ పగకు తామే బలి అయ్యారు. రఘురామయ్య కుటుంబం బ్రతికి బయట పడింది[2].

పాటలు

[మార్చు]
  • అమ్మాయీ ఓ అమ్మాయీ నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి - ఘంటసాల, రచన: సి నారాయణ రెడ్డి
  • తీయగ పాడే గీతంలో తెలియని వేదన ఏముందొ - పి. సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  • దిగిరావయ్యా ఓ దేవ నింగిని దాటే కొండకొనలో నిండుగా - పి సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  • పల్లవించిన భావాలు పరిమళించెను ఈనాడు - పి. సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  • పాలవంటి బ్రతుకులందు ..దిగి రావయ్యా ఓ దేవా - ఘంటసాల,పి. సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  • మా చల్లని ఇల్లు మమతల పుట్టిల్లు మాయింటను - పి. సుశీల, రచన: సి నారాయణ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19.
  2. సమీక్ష - వెంకట్ - ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక - తేదీ:30-8-66, పేజీ:50[permanent dead link]