హరీష్ సాల్వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరీష్ సాల్వే
సోలిటర్ జనరల్ ఇండియా
In office
1999 నవంబర్ 1 – 2002 నవంబర్ 3
అంతకు ముందు వారుసంతోష్ హెగ్డే
తరువాత వారుకిరణ్ రావల్
వ్యక్తిగత వివరాలు
జననం1955 జూన్ 22
నాసిక్ మహారాష్ట్ర భారతదేశం
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిమీనాక్షి సాల్వే
సంతానం2
నివాసంన్యూఢిల్లీ భారతదేశం
కళాశాలనాగపూర్ విశ్వవిద్యాలయం
నైపుణ్యంన్యాయవాది సీనియర్ అడ్వకేట్
పురస్కారాలుపద్మభూషణ్

హరీష్ సాల్వే ( మరాఠీ : हरीश साळवे ) భారతీయ న్యాయవాది . హరీష్ సాల్వే 1 నవంబర్ 1999 నుండి 3 నవంబర్ 2002 వరకు భారతదేశ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశాడు. అంతర్జాతీయ న్యాయస్థానం లో కులభూషణ్ జాదవ్ కేసుపై కూడా వాదించాడు. హరీష్ సాల్వే ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్నాడు.

బాల్యం

[మార్చు]

హరీష్ సాల్వే మరాఠీ కుటుంబంలో జన్మించారు. హరీష్ సాల్వే తండ్రి, NKP సాల్వే, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. హరీష్ సాల్వే తల్లి అంబ్రితి సాల్వే వైద్యురాలు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హరీష్ సాల్వే మొదట మీనాక్షి సాల్వేను వివాహం చేసుకున్నారు . వారు వివాహం 38 సంవత్సరాల పాటు కలిసి జీవించారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. హరీష్ సాల్వే ఎక్కువగా లండన్లో నివసిస్తూ ఉంటాడు.

న్యాయవాదిగా

[మార్చు]

హరీష్ సాల్వే 1980లో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. ఈ సమయంలో, అతను మినర్వా మిల్స్ కేసులో పాల్కివాలాకు సహాయం చేశాడు [1] తర్వాత ఢిల్లీ హైకోర్టు ద్వారా హరీష్సాల్వే సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు.

హరీష్ సాల్వే 1980 నుండి 1986 వరకు మాజీ అటార్నీ జనరల్, సోలి సోరాబ్జీతో కలిసి పనిచేశారు [2]

హరీష్ సాల్వే భారత సుప్రీంకోర్టులో మొదటి యాంటీ డంపింగ్ కేసును వాదించారు. హరీష్ సాల్వే ఎక్కువగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీతరపున వాదిస్తూ ఉంటాడు. ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్‌పై కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ వివాదం కేసులో హరీష్ సాల్వే వాదించాడు. ప్రస్తుతం హరీష్ సాల్వే స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. Swaminathan Iyer, Vellalapatti (29 April 2012). "Tax Titans: My Name is Harish Salve". ITAT Online. Archived from the original on 30 మార్చి 2013. Retrieved 4 February 2013.
  2. "Sorabjee reappointed A-G; Salve Solicitor-General". The Statesman. 1 November 1999.