Jump to content

హలో ఫ్రెండ్

వికీపీడియా నుండి
‌హలో ఫ్రెండ్
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం జగన్
తారాగణం అర్జున్ ,
పూజ
నిర్మాణ సంస్థ మోటూరి క్రియేషన్ప్
భాష తెలుగు

హలో ఫ్రెండ్ 1999 లో విడుదలైన తెలుగు సినిమా. మోటూరి క్రియేషన్స్ బ్యానర్ పై మెట్టూరి శ్రీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు జగన్ దర్శకత్వం వహించాడు. అర్జున్ సర్జా, పూజ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • అర్జున్ సర్జా
  • పూజ
  • రఘువరన్
  • విజయకుమార్
  • రాధారవి
  • ప్రసాద్‌బాబు
  • సుధాకర్
  • బాబుమోహన్
  • అశోక్ కుమార్
  • చిట్టిబాబు
  • గౌతమ్ రాజ్
  • ఐరన్‌లెగ్ శాస్త్రి
  • మంజుల విజయకుమార్
  • అల్ఫోన్స్
  • రక్ష
  • కవిత శ్రీ
  • మాస్టర్ దినేష్
  • సింధు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: జగన్
  • స్టూడియో: మోటూరి క్రియేషన్స్
  • నిర్మాత: మెట్టూరి శ్రీ ప్రసాద్
  • విడుదల తేదీ: జనవరి 22, 1999
  • సంగీత దర్శకుడు: ఎస్.ఏ.రాజ్‌కుమార్
  • పాటలు: భువనచంద్ర
  • కెమేరా: కె.ప్రసాద్

విజయ్ (అర్జున్) సుందరమూర్తి (రాధా రవి) కోసం పనిచేసే వ్యక్తి. అతను మహిళలు, పిల్లలను మినహాయించి ఎవరినైనా డబ్బు కోసం చంపేస్తాడు. అతను ఒక అపార్టుమెంటులో ఒంటరిగా నివసిస్తుంటాడు. పూజా (పూజ) అనే యువతి ఒక బోర్డింగ్ పాఠశాలలో చదువుకుంటుంది. ఆమె సెలవు కోసం తన తండ్రి ఇంటికి వస్తుంది. ఆమెను ధూషించే తండ్రి, స్వార్థపూరితమైన సవతి తల్లి, అహంకార పూరితమైన సవతి అత్త లకు పూజ చాలా చెడ్డగా కనిపిస్తుంది, కానీ ఆమె సోదరుడు దినేష్ (మహానది దినేష్) ని అమితంగా ప్రేమగా చుస్తుంది. పూజ విజయ్ తో స్నేహం చేయడానికి ప్రయస్తుంది. కాని విజయ్ కి ఆమె స్నేహంపై ఆసక్తి లేదు. ఆమె తండ్రి డ్రగ్ స్మగ్లర్. ఒక రోజు, అవినీతిపరుడైన పోలీసు అధికారి జయంత్ (రఘువరన్) తన సోదరుడితో సహా పూజ కుటుంబాన్ని చంపుతాడు. పూజకు వసతి కల్పించాలని విజయ్ నిర్ణయించుకుంటాడు. హిట్‌మెన్‌గా తన నైపుణ్యాలను నేర్పించమని పూజ అతన్ని బలవంతం చేస్తుంది. తరువాత ఏమి జరుతుతుందో మిగిలిన కథలో ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "Hello Friend (1999)". Indiancine.ma. Retrieved 2020-09-27.