హసన్ అలీ (దుబాసి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హసన్ అలీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దుబాసి (భాషాంతరం చేయువాడు). అతను శాసనసభ సభాపతి, ఉపసభాపతి లకు దుబాసిగా ఉండేవాడు. అసెంబ్లీలో సభాపతి వెనుక నిలబడి ఉండేవాడు. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

హసన్ అలీ 1959లో కడపలో జన్మించాడు. 3 దశాబ్దాలకు పైగా శాసనసభతో సంబంధం ఉన్న హసన్ అలీ 1976లో సహాయ దుబాసీగా రాష్ట్ర శాసనసభలో చేరినాడు. ఆ తరువాత సీనియర్ దుబాసీగా పదోన్నతి పొందినాడు. శాసనసభ తరఫున ఫ్రొటోకాల్‌ ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరించేవాడు. ఆంధ్రప్రదేశ్ రష్ట్రానికి సభాపతిగా వ్యవహరించిన ‌ జి.నారాయణరావు నుంచి ఏడుగురు స్పీకర్‌ల వద్ద అతను దుబాషీగా వ్యవహరించాడు. అతనికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శాసనసభలో గుబురుమీసాల హసన్ అలీగా ప్రసిద్ధిచెందినాడు. అతను 25 సంవత్సరాల పాటు దుబాసిగ వ్యవహరించాడు.

"ఈ మీసం నా గుర్తింపు. ఇవి లేకుండా నా భార్య కూడా నన్ను గుర్తించగలదని నేను అనుకోను." అని హసన్ అలీ చెప్పేవాడు. ఆ మీసం దుబాసీలకు గుర్తింపు కానప్పటికీ అతను తన వ్యక్తిగత గుర్తింపు కోసం 1979 నుండి పెంచుతున్నానని తెలిపాడు. అతని తండ్రి ఎం.భాషా మద్రాసు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పనిచేసేవాడు. [1]

అతను 2010, ఫిబ్రవరి 19న మరణించాడు.[2] అతని కుంటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇప్పించవలసినదిగా అప్పడి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి రోశయ్యను కోరాడు. [3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Jul 8, K. Srimali | TNN |; 2004; Ist, 01:15. "Dubash handles mush with panache | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-25. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  2. ఈనాడు దినపత్రిక, తేది 21.02.2010.
  3. "Senior Dubash of Assembly Hasan Ali dead". The New Indian Express. Archived from the original on 2020-07-25. Retrieved 2020-07-25.