Jump to content

హాక్ఐ యాప్

వికీపీడియా నుండి
హాక్ఐ యాప్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుతెలంగాణ ప్రభుత్వం
ప్రారంభ విడుదలఫిబ్రవరి 2014; 10 సంవత్సరాల క్రితం (2014-02)
ఆపరేటింగ్ సిస్టంఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, యుఎస్ఎస్‌డి
అందుబాటులో ఉంది2 భారతీయ భాషలు
రకంఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భద్రత
లైసెన్సుఫ్రీవేర్, యాజమాన్యం
జాలస్థలిఅధికారిక వెబ్సైటు

హాక్‌ఐ యాప్‌ (ఆగ్లం: HawkEye App) అనేది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకోసం రూపొందించిన పోలీస్‌ అధికారిక మొబైల్ యాప్‌.[1] ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా తెలంగాణ పోలీసులు 2014లో ‘హాక్‌ఐ’ మొబైల్‌ అప్లికేషన్‌ అందుబాటులోకి తెచ్చారు. ప్రజల సౌకర్యార్థం వివిధ రాష్ర్టాల పోలీసులు వినియోగిస్తున్న మొబైల్‌ యాప్‌లకు ప్రజల్లో ఉన్న ఆదరణపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ విభాగం 2021లో నిర్వహించిన సర్వేలో 31 లక్షల యూజర్లతో హాక్‌ఐ యాప్‌ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.[2]

పోలీసు స్టేషన్‌ను సందర్శించకుండానే ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. పోలీసులతో రాష్ట్ర ప్రజలు అనుసంధానంలో ఉండటానికి, ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరస్థులపై సమాచారం, మహిళలపై నేరాలు, పోలీసుల ఉల్లంఘనలు, మెరుగైన పోలీసింగ్ కోసం సూచనలు, పోలీసులు చేసిన మంచి పని గురించి ప్రజలకు తెలియజేడానికి ఈ యాప్ ఉపయోగపడుతోంది. ప్రజల భద్రతను మెరుగుపరచడానికి, ఆపదలో ఉన్నప్పుడు పోలీసులను సంప్రదించడానికి సహాయపడుతోంది.[3]

ప్రారంభం

[మార్చు]

2014లో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హాక్‌ఐ యాప్‌ సేవలు ప్రారంభించి, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు.

సేవలు

[మార్చు]

అద్దె వాహనాలు ఎక్కే ముందు ఈ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. (బోర్డింగ్ స్థలం, వాహనం రకం, వాహనం నంబర్, గమ్యస్థాన స్థానాన్ని ఎంచుకోవచ్చు). పనివాళ్ళు లేదా అద్దెదారుల వివరాలను పోలీసులతో నమోదు చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం పోలీసులు, వారివారి సంబంధిత వ్యక్తి ఫిర్యాదుదారులను సంప్రదించగలరు. (ఇందులో మీరు ఐదు కాంటాక్ట్ నంబర్‌లను నమోదు చేయవచ్చు, ఆ తర్వాత సమాచారం పోలీస్ స్టేషన్ లేదా కంట్రోల్ రూమ్‌కు వెళ్తుంది.)[4]

పోలీసులు సైతం చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై ఫిర్యాదు చేసే సౌలభ్యం కూడా ఇందులో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఎస్వోఎస్‌ బటన్‌, అత్యవసర కాంటాక్టులు, కమ్యూనిటీ పోలీసింగ్‌, ఫిర్యాదుల స్టేటస్‌, ఇంటి కిరాయిదారులు, సెక్యూరిటీ, పని మనుషులకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ తదితర సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఏవైనా వస్తువులు, డాక్యుమెంట్లు పోగొట్టుకొంటే పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండానే ఈ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ 72 గంటల్లో మెయిల్‌ బాక్స్‌కు వస్తుంది.

ఇళ్ళో పనిచేసేవాళ్ళు, అద్దెకు ఉండేవాళ్ళ నుండి కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఇలాంటివాటిని వీలున్నంత వరకు నిరోధించడం కోసం పనివాళ్ళు, అద్దెకు దిగేవాళ్ళ గత చరిత్రను పూర్తిస్థాయిలో వెరిఫికేషన్‌ చేయడంకోసం ‘హాక్‌ఐ’ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఆయా వ్యక్తుల గత చరిత్ర, పూర్వాపరాలు పూర్తిస్థాయిలో వెరిఫై చేసి నివేదిక అందిస్తున్నారు.[5]

యూజర్ల సంఖ్య

[మార్చు]

కేంద్ర హోంశాఖ నివేదిక-2021 ప్రకారం 31,00,663 యూజర్లు ఉండగా, హోంశాఖ నివేదిక రూపొందించిన తరువాత యూజర్ల సంఖ్య 11 లక్షలకుపైగా పెరిగి, 2020 మే 2 నాటికి 42,47,309 యూజర్లు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "With over 3.1 million users, Telangana police's Hawk Eye app earns praise". The New Indian Express. 2022-05-02. Archived from the original on 2022-05-02. Retrieved 2022-05-08.
  2. telugu, NT News (2022-05-04). "మన హాక్‌ఐ యాప్‌ దేశంలోనే నంబర్‌ 2". Namasthe Telangana. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-08.
  3. Borah, Prabalika M. (2019-12-02). "Hawkeye app is by Hyderabad City Police". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2020-11-12. Retrieved 2022-05-08.
  4. Mustafa, Gulam (2022-04-24). "TS police public against fake loan apps". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-08. Retrieved 2022-05-08.
  5. "వెరిఫికేషన్‌ ఫ్రీ". Sakshi. 2019-05-20. Archived from the original on 2019-05-20. Retrieved 2022-05-08.

బయటి లంకెలు

[మార్చు]