Jump to content

హారూన్ రషీద్

వికీపీడియా నుండి
(హారూన్ అల్-రషీద్ నుండి దారిమార్పు చెందింది)
పర్షియా చిత్రము, హారూన్ అల్-రషీద్

హారూన్ అల్-రషీద్ (ఆంగ్లము : Hārūn al-Rashīd) (అరబ్బీ, పర్షియన్ : هارون الرشيد ); ఇంకనూ హారూన్ అర్-రషీద్, హారూన్ అల్-రాషిద్, హారూన్ రషీద్ అని కూడా పలుకుతారు; మార్చి 17, 763మార్చి 24, 809) ఇరాన్, టెహ్రాన్ లోని రాయ్య్లో జన్మించాడు. ఇతను ప్రఖ్యాతిగాంచిన అబ్బాసీయ ఖలీఫా,

ఇతను 786 నుండి 809 వరకు పాలించాడు, ఇతని కాలంలో శాస్త్రీయ, సాంస్కృతిక, ధార్మిక విషయాలు ఉత్థాన దశలో వుండేవి. ఇతడి దూరదృష్టివలన కళలు, సంగీతం మున్నగునవి అభివృద్ధి చెందాయి. ఇతను ఓ పెద్ద గ్రంథాలయం బైతుల్ హిక్మాను స్థాపించాడు.

ఇతని జీవితం హుందాతనం, గౌరవం కలిగిన సభ (రాజ దర్బారు) మున్నగు విషయాలతో అనేక కథలు, కథనాలు వెలువడ్డాయి. కొన్ని నిజాలైతే కొన్ని కాల్పనికాలు. ప్రఖ్యాతమైన వెయ్యిన్నొక్క రాత్రులు లో ఇతడి ప్రాశస్తాన్ని కొనియాడుతూ వ్రాయబడింది. ఇతడి రాజదర్బారుతో ప్రేరణ పొంది ఈ కథలు ప్రాచుర్యం పొందాయని కూడా ప్రతీతి.

జీవితం

[మార్చు]

హారూన్ రషీద్ ఇరాన్ లోని టెహ్రాన్ లో జన్మించాడు. ఇతని తండ్రి అబ్బీసీయ మూడవ ఖలీఫా ఐన అల్-మహది, 775 నుండి 786 వరకు పాలించాడు. తల్లి యెమన్కు చెందిన బానిస యువతి 'అల్-ఖైజురన్', భర్తకు తగ్గ భార్య, తనయుడికి తగ్గ తల్లి, ఈమె ప్రేరణలతో భర్త, తనయుడు లబ్ధిపొందారు.

హారూన్, తన తల్లి ప్రేరణ, ప్రోత్బలంతో తన సామ్రాజ్యాన్ని విశాలీకరించాడు. తల్లి 789లో మరణించింది. తన వజీరు (ముఖ్యమంత్రి) యహ్యా బర్కమీద్, అతని కుమారుల సహకారంతో తన రాజ్యాన్ని నియంత్రించాడు. యహ్యా కుమారుడు జాఫర్, హారూన్ అనుంగుమిత్రుడు.[1].

తన 20 ప్రాయంలో ఖలీఫా అయ్యాడు. తన సింహాసన అధిష్టాన రోజునే కొడుకు అల్ మామూన్ జన్మించాడు. తరువాత కొద్ది కాలానికి రెండవకుమారుడు అల్ అమీన్ జన్మించాడు. రెండవకుమారుడైన అల్-అమీన్, జుబైదా సంతానం. జుబైదా తండ్రి అల్ మన్సూర్ (బాగ్దాదు నగర స్థాపకుడు) మనుమరాలు.

హారూన్ రషీద్ కాలంలో బాగ్దాదు బాగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాలూ అభివృద్ధికి నోచుకున్నాయి. ఖలీఫాల రాజధానిగా మారడంతో నిర్మాణాలు, కళలూ, జీవనశైలీ, అత్యాధునిక శాస్త్రాలు జీవం పోసుకున్నాయి.

జూలియస్ కోక్కెర్ట్ చిత్రించిన, హారూన్ రషీద్ సభ.

796 లో ఖలీఫా హారూన్ రషీద్ తన ప్రభుత్వాన్నీ, సభనూ, మధ్య-యూఫ్రేట్స్ లోనుండు 'అర్-రక్ఖహ్' కు మార్చాడు. ఇచ్చట 12 యేండ్లు గడిపాడు.

హారూన్ సాహిత్యానికి పెద్ద పీట వేశాడు, కవిత్వం, సంగీతం బాగా వర్థిల్లాయి. తాను స్వయంగా పండితుడు, కవి. తన దర్బారులో సాహితీవేత్తలూ, పండితులూ ఎల్లప్పుడూ గౌరవాలు పొందేవారు. ఇతర దేశాల రాయబారులు, వర్తకులు, యాత్రికులూ, తరచూ ఇతని దర్బారును సందర్శించేవారు. ఇలా ప్రపంచం మొత్తం ఇతడి పేరు ప్రాకింది. చరిత్రకారుడు అత్-తరాబీ (వీ. 30 పుట. 313) ప్రకారం, హారూన్ రషీద్ కు, వైద్యం చేయడానికి వైద్యులు భారతదేశం నుండి వచ్చేవారు. హారూన్ చైనాతో సత్సంబంధాలు కలిగివుండే వాడు.

దస్త్రం:Coins During Harun Rashid.JPG
హారూన్ కాలం నాటి అబ్బాసీ నాణెములు.

806 లో బైజాంటియన్ సామ్రాజ్యం పై సైనిక బలగాలను పంపాడు, ఇందులో 1,35,000 సైన్యం పాల్గొంది. ఈ సైనిక చర్యతో లొంగిపోయిన బైజాంటియన్ అధినేతలు, 50,000 బంగారు నాణేలను చెల్లించి, 30,000 బంగారు నాణేలను కప్పంగా చెల్లించడానికి ఒప్పుకున్నారు. హి.శ. 181 (సా.శ. 797-798) లో, సిలీసియన్ గేట్స్ కు ఆవలగల 'ద విల్లోస్', హి.శ. 190 (సా.శ. 806-807) లో 'హిరాక్లియా' లను కైవసం చేసుకున్నాడు.

అత్-తరాబీ ప్రకారం, హారూన్, ధార్మికుడూ, దానవంతుడూ, ఉదాత్తుడూ, కవులను పోషించినవాడూ, ధార్మికంగా జరుగు విమర్శలనూ జగడాలనూ పరిసమాప్తి చేసినవాడు. ఇతడు న్యాయపరిపాలకుడు,. హారూన్ ఎన్నోసార్లు హజ్ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. అత్-తబరీ ప్రకారం "హారూన్ మరణించినపుడు, ఖలీఫా ఖజానా లో 90 కోట్ల దిర్హమ్లు వున్నాయి." v. 30 p. 335.

808లో హారూన్ ట్ర్రాన్స్ ఓక్సానియాలో ప్రయాణం చేస్తున్నపుడు, అనారోగ్యం పాలై మరణించాడు. ఇతనిని ఖోరాసాన్ (ఇరాన్) గవర్నరైన "హమీద్ ఇబ్న్ ఖహ్‌తబీ" భవనంలో ఖననం చేశారు. ఈ భవనం 'మష్‌హద్' (షహీదుల భవనం) గా పేరుచెందింది .[1]

కాల పట్టిక

[మార్చు]
  • 763: హారూన్ రషీద్ మార్చి 17 న జన్మించాడు, ఖలీఫా అల్-మహది, అల్-ఖైజురన్ ల కుమారుడు.
  • 780: హారూన్, ఓ నామమాత్రపు నాయకుడిగా బైజాంటియన్ సామ్రాజ్యం పై సైనిక యాత్రలకు పంపబడ్డాడు.
  • 782: బైజాంటియన్ పై యుద్ధం చేయుటకు నామమాత్రపు నాయకుడిగా పంపబడ్డాడు. శాంతి-ఒడంబడికలు చేసుకున్న కారణాన ఇతనికి 'అర్-రషీద్' అనే బిరుదొచ్చింది. అర్-రషీద్ అనగా సరైన 'మార్గదర్శకత్వం గావింపబడ్డవాడు' అని. తరువాత ఇతడు ట్యునీషియా, ఈజిప్టు, సిరియా, ఆర్మీనియా, అజర్‌బైజాన్ ల గవర్నర్ గా నియమింపబడ్డాడు.
  • 786 సెప్టెంబరు 14: హారూన్ కొత్త ఖలీఫాగా నియమింపబడ్డాడు. యహ్యా బర్మకీద్, వజీరుగా నియుక్తుడయ్యాడు. కాని తల్లి ఖైజురాన్ రాజకీయాలలో జోక్యం చేసుకొని, కీలకపాత్ర వహించింది.
  • 789: 'అల్-ఖైజురాన్' మరణం, తనకొడుకైన హారూన్ చేతికి 'పటిష్ఠమైన రాజ్యం' అప్పగించి వెళ్ళింది.
  • 791: హారూన్ 'బైజాంటియన్ సామ్రాజ్యాని'కి వ్యతిరేకంగా యుద్ధాలు.
  • 795: షియా తిరుగుబాటుదారులను నియంత్రించుటకు, హారూన్, షియా ఇమామ్ అయిన మూసా అల్-కాజిమ్ను కారాగారంలో వుంచాడు.
  • 796: హారూన్ తన రాజభవనాన్ని, ప్రభుత్వాన్ని బాగ్దాదు నుండి 'అర్-రక్ఖాహ్' కు మార్చాడు.
  • 800: హారూన్ 'ఇబ్రాహీం ఇబ్న్ అల్-అగ్లబ్' ను ట్యునీషియా గవర్నరుగా నియమించాడు.
  • 802: హారూన్, చార్లెమానీ ను, రెండు 'అల్బినో' ఏనుగులను బహూకరించాడు.
  • 803: యహ్యా మరణించాడు, అయిననూ హారూన్ లో పరిపాలనా పటుత్వం ఇంకనూ పెరిగింది.
  • 807: హారూన్ బలగాలు సైప్రస్ను కైవసం చేసుకున్నాయి.
  • 809: తన రాజ్య తూర్పుభాగాలకు యాత్రకు వెళ్ళినపుడు మరణించాడు. తదనంతరం అల్-అమీన్ వారసుడుగా రాజ్యాధికారాలను పొందాడు, ఖలీఫాగా నియమింపబడ్డాడు.

అరబ్ సామ్రాజ్యంలో అబ్బాసీయ ఖలీఫాల లో హారూన్ రషీద్ సుప్రసిద్ధుడిగా పేరుగడించాడు. ఇతని కాలం రాజకీయంగానూ సాంస్కృతికంగానూ ఉచ్ఛదశకు చేరుకుంది. ఇతని కాలంలో ఇబ్నె కసీర్ వ్రాయబడింది, దీనితో ఇతను అందరికీ ఆదర్శవంతుడిగా మారాడు. సైనిక పరంగా, మేథోపరంగానూ పేరుప్రఖ్యాతులు గడించాడు. వెయ్యిన్నొక్క రాత్రులు, చారిత్రకంగా ఇతనినే మూలంగా చేసుకుని వ్రాయబడిందనేది సత్యమని భావించబడుతుంది.

ప్రాశస్త సంస్కృతీ మూలాలు

[మార్చు]

సాహిత్యము

[మార్చు]
  • 'హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్‌ఫెలో' ఒక పద్యం వ్రాశాడు, దాని ఆరంభం ఇలా వున్నది;
ఓనాడు హారూన్ రషీద్ చదివాడు
ఓ పుస్తకం, దాన్లో కవి ఇలా వ్రాశాడు
రాజులెక్కడ్, ప్రపంచాలను
పొందియుండే వారెక్కడ?
  • వెయ్యిన్నొక్క రాత్రుల కథలలోని అనేక కథలలో, హారూన్ రషీద్ కేంద్రబిందువు.
  • 'జేమ్స్ జోయెసీ' రచించిన 'యులిసిస్' నవలలో, స్టీఫెన్ డెడాలస్ కలగన్నాడు. ఇందులో కొన్ని పాత్రలు హారూన్ పోలివున్నవి.
  • 1923 లో విలియం బట్లర్ యీట్స్, 'ద గిఫ్ట్ ఆఫ్ హారూన్ అల్-రషీద్' అనే పద్యాన్ని రచించాడు.
  • మైకేల్ బుల్గకోవ్ రచించిన 'ద మాస్టర్ అండ్ మార్గెరీటా' లో హారూన్ రషీద్ 'కొరోవ్యోవ్' పాత్రలో దర్శనమిస్తాడు.

హాస్య కథలు

[మార్చు]

ఆటలు

[మార్చు]
  • In Quest for Glory II, the sultan who adopts the Hero as his son is named Hārūn ar-Rashīd. He is often seen prophesizing on the streets of Shapeir as The Poet Omar.

ఇతరములు

[మార్చు]
  • Future U.S. President Theodore Roosevelt, when he was a New York Police Department Commissioner, was called in the local newspapers "Haroun-al-Roosevelt" for his habit of lonely all-night rambles on the streets of Manhattan, surreptitiously catching police officers off their posts. (Harun al-Rashid is said in the 1001 Nights to have wandered Baghdad at night dressed as merchant in order to observe the lives of his subjects).

ఇవీ చూడండి

[మార్చు]

ఫుట్ నోట్స్

[మార్చు]
  1. Zabeth (1999) pp. 12-13

మూలాలు, ఇతర పఠనాలు

[మార్చు]
  • al-Masudi, The Meadows of Gold, The Abbasids, transl. Paul Lunde and Caroline Stone, Kegan paul, London and New York, 1989
  • al-Tabari "The History of al-Tabari" volume XXX "The 'Abbasid Caliphate in Equilibrium" transl. C.E. Bosworth, SUNY, Albany, 1989.
  • Andre Clot Harun Al-Rashid and the Age of a Thousand and One Nights
  • Einhard and Notker the Stammerer, "Two Lives of Charlemagne," transl. Lewis Thorpe, Penguin, Harmondsworth, 1977 (1969)
  • John H. Haaren, Famous Men of the Middle Ages [2]
  • William Muir, K.C.S.I., The Caliphate, its rise, decline, and fall [3]
  • Theophanes, "The Chronicle of Theophanes," transl. Harry Turtledove, University of Pennsylvania Press, Philadelphia, 1982
  • Norwich, John J. (1991). Byzantium: The Apogee. Alfred A. Knopf, Inc. ISBN 0-394-53779-3.
  • Zabeth, Hyder Reza (1999). Landmarks of Mashhad. Alhoda UK. ISBN 964-444-221-0.

బయటి లింకులు

[మార్చు]

మూస:Commons2

హారూన్ రషీద్
Born: 763 Died: 809
Sunni Islam titles
అంతకు ముందువారు
Al-Hadi
Caliph of Islam
786 – 809
తరువాత వారు
Al-Amin