Jump to content

హిందూ సామ్రాజ్య దినోత్సవం

వికీపీడియా నుండి
(హిందూ సామ్రాజ్య దినోత్సవము నుండి దారిమార్పు చెందింది)
రాయఘడ్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహం

హిందూ సామ్రాజ్య దినోత్సవం, ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా జరుపుకుంటారు.ఛత్రపతి శివాజీహిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన వీరుడు.1674 జూన్ 6న (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి) రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి' అని బిరుదును ప్రదానం చేసారు.[1]శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శహజీ భోస్లె, జిజాభాయి దంపతులకు జన్మించాడు.[2]

చరిత్ర

[మార్చు]
ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం

ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా తెలుగు సంవత్సరం,హిందూ నెల ప్రకారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు.[3] శివాజీ పట్టాభిషేకంతో హిందూ రాజ్యం ఉనికిలోకి వచ్చిందని నమ్ముతారు. చత్రపతి శివాజీ మరాఠా రాజ్యాన్ని స్థాపించిన 17 వ శతాబ్దపు పాలకుడు.ఈ రోజును మహారాష్ట్రలో "శివ స్టేట్‌హుడ్ ఫెస్టివల్" జరుపుకుంటారు.ప్రతి భారతీయుడి హృదయంలో ఇప్పటికీ శివాజీ మహారాజ్ శౌర్యప్రతాపం మిళితమై ఉంది. అతని కథలు పిల్లలకు సాహసం, వక్తృత్వానికి ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.ఐదు వేల అడుగుల ఎత్తులో ఉన్న మహారాష్ట్ర రాయ్‌ఘడ్ కోటలో జరిగిన ఒక గొప్ప కార్యక్రమంలో మరాఠా రాజు పట్టాభిషేకం చేశారు. రాయ్‌ఘడ్‌లోని ప్రజలు ప్రతి సంవత్సరం హిందూ నెల జ్యేష్ఠ శుక్ల త్రయోదశి (13 వ రోజు) రోజున దీనిని జరుపుకుంటారు.[4]

చరిత్ర ప్రకారం, హైందవ స్వరాజ్ స్థాపించడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ యుక్తవయసులోనే ప్రమాణం చేశాడు.మొఘలులపై పోరాటంచేసాడు.అనేక కోటలను జయించాడు.అతనిని గురించిన కథలు ప్రతి భారతీయుడు మనస్సులో ఆడ్రినలిన్ గ్రంధిలా ప్రహహించే గర్వించదగిన ఉత్తేజాన్ని కలిగిస్తాయి.యమున, సింధు, గంగా, గోదావరి, నర్మదా, కృష్ణ, కావేరితో సహా ఏడు నదుల పవిత్ర జలాలతో పట్టాభిషేకం చేశారు.రాయ్‌ఘడ్‌‌లో ఆ రోజుల్లోనే దాదాపు యాభై వేల మంది పాల్గొన్న గొప్ప కార్యక్రమం ఇది. శివాజీకి షకకర్త (ఒక శకం స్థాపకుడు), ఛత్రపతి (పరమావ సార్వభౌమాధికారి) అనే పేర్లు పెట్టారు.అతను హిందూ విశ్వాసం రక్షకుడు, అంటే హైందవ ధర్మోధారక్ అనే బిరుదును పొందాడు.[4]

అతను తన జీవిత కాలంలో, మొఘల్ సామ్రాజ్యం, గోల్కొండ సుల్తానేట్, బీజాపూర్ సుల్తానేట్, అలాగే యూరోపియన్ వలస శక్తులతో పొత్తులు,శత్రుత్వాలలో విజయం పొందాడు.అతని సైనిక దళాలు మరాఠా గోళాన్ని విస్తరించి, కోటలను అన్నిటినీ వారి స్వాధీనం చేసుకున్నాయి.నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు.చక్కటి నిర్మాణాత్మక పరిపాలనా సంస్థలతో సమర్థ, ప్రగతిశీల పౌర పాలనను సాగించాడు.అతను ప్రాచీన హిందూ రాజకీయ సంప్రదాయాలను, న్యాయస్థాన సమావేశాలను పునరుద్ధరించాడు. కోర్టు నిర్వహణలలో పెర్షియన్ భాష కాకుండా మరాఠీ, సంస్కృతం వాడకాన్ని ప్రోత్సహించాడు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కు ఈ దినోత్సవం రోజు చాలా ముఖ్యమైంది,ఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి. ఇతర ఐదు పండుగలు విజయదశిమి, మకర సంక్రాంతి, ఉగాది, గురుపూర్ణిమ, రక్షాబంధన్ మహోత్సవ్.[4] గా ఉన్నాయి

మూలాలు

[మార్చు]
  1. "హిందూ సామ్రాజ్య దినోత్సవం". www.yuvnews.com. Retrieved 2020-08-01.
  2. "శివాజీ పట్టాభిషేకం - హిందూ సామ్రాజ్య దినోత్సవం - hindu samrajya diwas speech". Retrieved 2020-08-01.
  3. vskteam (2019-06-15). "వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ - హిందూ సామ్రాజ్య దినోత్సవం". VSK Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-01.
  4. 4.0 4.1 4.2 "June 4- Hindu Samrajya Diwas or Hindu Empire Day". Janam TV National (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-04. Archived from the original on 2020-09-20. Retrieved 2020-08-01.

వెలుపలి

[మార్చు]

లంకెలు

[మార్చు]