హిట్ వికెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిట్ వికెట్ అనేది క్రికెట్ క్రీడలో అవుట్ చేయడానికి ఒక పద్ధతి. ఈ పద్ధతిని క్రికెట్ చట్టాల్లో చట్టం 35 లో న్నిర్వచించారు. బౌలరు తన డెలివరీ స్ట్రైడ్‌లోకి ప్రవేశించిన తర్వాత, బంతి ఆటలో ఉన్నప్పుడు, బ్యాటరు తన బ్యాట్‌తోగాని, తన శరీరంతో గాని వికెట్‌లను పడేసినట్లైతే, ఆ బ్యాటరు "హిట్ వికెట్"గా ఔటౌతాడు.[1] స్ట్రైకరు బంతిని ఆడే ప్రయత్నంలో సిద్ధమౌతున్నపుడు గానీ, బంతిని ఆడేప్పుడు గానీ, ఆడాక తన మొదటి పరుగు త్యబోతూ గానీ ఇలా హి వికెట్ అవ్వవచ్చు. సరళమైన భాషలో చెప్పాలంటే, స్ట్రైకింగు చేస్తున్న బ్యాటరు బంతిని కొట్టే ప్రయత్నంలో లేదా పరుగు మొదలుపెట్టే ప్రయత్నంలో బెయిల్‌లను పడేస్తే, అతను హిట్ వికెట్‌గా ఔట్ అవుతాడు.

క్యాచ్, బౌల్డ్, లెగ్ బిఫోర్ వికెట్, రనౌట్, స్టంపౌట్ల తర్వాత బ్యాటరును అవుట్ చేసే పద్ధతుల్లో ఇది ఆరవది. ఐదు సాంప్రదాయిక పద్ధతులతో పోలిస్తే ఇది చాలా అరుదుగా ఉంటుంది. అయితే మిగిలిన నాలుగింటితో ( టైమౌట్, ఫీల్డర్లను అడ్డుకోవడం, రిటైరవడం, బంతిని రెండుసార్లు కొట్టడం ) పోలిస్తే ఇది మరింత తరచుగా జరుగుతుంది.

బౌలరు బంతిని అసలు వెయ్యకనే పోయినా, లేదా ఆ బంతి నో-బాల్ అయినా "హిట్ వికెట్" ఇవ్వరు.

ఈ పద్ధతిలో పడిన వికెట్‌కు క్రెడిట్ బౌలరుకు చెందినప్పటికీ, బౌలర్లు వికెట్లు తీయాలని కోరుకునే పద్ధతి ఇది కాదు.

2023 జూలై 28 టెస్ట్ క్రికెట్లో 163 సార్లు హిట్ వికెట్ గా ఔటిచ్చారు.[2] వన్‌డేల్లో 75 సార్లు, [3] టి20ల్లో 30 సార్లు ఇచ్చారు.[4] మహిళా క్రికెట్లో టెస్టుల్లో 12 సార్లు, [5] వన్‌డేల్లో 8 సార్లు, [6] టి20ల్లో 11 సార్లు హిట్ వికెట్ ఔట్లు ఇవ్వారు.[7]

విరిగిపోయిన బ్యాట్[మార్చు]

1921 యాషెస్ సిరీస్‌లో 3వ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో, హెడ్డింగ్లీలో, ఆండీ డుకాట్ ఇంగ్లండ్ తరపున తన ఏకైక టెస్టులో ఆడుతూ, ఆస్ట్రేలియా ఆటగాడు టెడ్ మెక్‌డొనాల్డ్ వేసిన ఫాస్ట్ బాల్‌ తనకు తగలకుండా బ్యాటు అడ్డం పెట్టుకున్నాడు. డుకాట్ బ్యాట్ విరిగి, ఒక ముక్క వెనక్కి ఎగిరి బెయిల్‌ను పడేసింది. బంతిని స్లిప్ ఫీల్డరు క్యాచ్ పట్టాడు. డుకాట్ "క్యాచ్"గా ఔట్ అయ్యాడు గానీ అతను "హిట్ వికెట్" కూడా ఔటై ఉండేవాడు.[8]

తర్వాత 1921 లో, జోహన్నెస్‌బర్గ్‌లోని ఓల్డ్ వాండరర్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన 2వ టెస్టులో, మెక్‌డొనాల్డ్ ఇదే పద్ధతిలో బిల్లీ జుల్చ్‌ బ్యాట్స్‌మన్ బ్యాట్‌ను విరగగొట్టాడు. దాని ముక్కలు బెయిల్‌కు తగిలి దాన్ని పడెయ్యడంతో జుల్చ్‌కు "హిట్ వికెట్" లభించింది.[9]

ఈ సంఘటనల తర్వాత, "హిట్ వికెట్" ఇవ్వాలంటే బ్యాట్ అంతా స్టంపులకు తగలాలని MCC స్పష్టం చేసింది. అయితే, 2010 అక్టోబరు 1 న, బ్యాటు ముక్క తగిలినా "హిట్ వికెట్"గా ఔట్ అవుతుందని అనుమతించాలని ఈ చట్టాన్ని మార్చారు.

గ్లవ్‌ ఎగిరి..[మార్చు]

1953లో ఓవల్‌లో సర్రేతో జరిగిన మ్యాచ్‌లో అలెక్ బెడ్సర్ వేసిన ఒక లిఫ్టింగ్ బంతి, డెర్బీషైర్ తరపున ఆడుతున్నఅలాన్ రెవిల్ చేతికి తగిలింది. రివిల్ నొప్పితో చేతిని విదిలించగా, అతని గ్లవ్ ఎగిరి, స్టంప్‌లకు తగిలి, బెయిల్‌ పడిపోయింది. రెవిల్ "బంతిని ఆడినట్లుగానే" భావించిన అంపైరు, "హిట్ వికెట్"గా ఔటైనట్లు ప్రకటించాడు.[9]

హెల్మెట్/టోపీ తగిలి[మార్చు]

టెస్టు క్రికెట్‌లో, హెల్మెట్/టోపీ స్టంప్‌లపై పడటం వల్ల చాలా మంది బ్యాట్స్‌మన్లు "హిట్ వికెట్"గా ఔటయ్య్యారు.

1960-61లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన 2వ టెస్టులో ( బ్రిస్బేన్‌లో ప్రసిద్ధ టైడ్ టెస్టు అయిన వెంటనే జరిగిన టెస్టు), జోయ్ సోలమన్, రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్‌లో మొదట ఔట్ అయ్యాడు. రిచీ బెనాడ్ వేసిన టాప్ స్పిన్నరును ఆడుతూ, అతని టోపీ పడిపోవడంతో బెయిల్ పడి, అతను "హిట్ వికెట్"గా ఔటయ్యాడు.[10] అలా ఔట్ చేయడం స్పోర్టివ్‌గా లేదని ఆస్ట్రేలియా ప్రేక్షకులు భావించి, తమ స్వంత జట్టునే గేలి చేసారు.

1962లో ఎడ్జ్‌బాస్టన్‌లో హాంప్‌షైర్‌తో జరిగిన వార్విక్‌షైర్ కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో, MJK స్మిత్ టోపీ ఈదురుగాలికి ఎగిరి వికెట్‌పై పడి అవుట్ అయ్యాడు.[9][11]

1974 జూలైలో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన 3వ టెస్టులో ఇంగ్లండ్‌ ఆటగాడు క్రిస్ ఓల్డ్‌ బౌలింగులో అశోక్ మన్‌కడ్, [12] 1977 డిసెంబరులో బ్రిస్బేన్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ థామ్సన్ బౌలింగులో దిలీప్ వెంగ్‌సర్కార్‌ ఈ పద్ధతిలో అవుట్ అయ్యారు [13]

2000 ఫిబ్రవరిలో డునెడిన్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన 3వ వన్డే ఇంటర్నేషనల్‌లో, బ్రెట్ లీ వేసిన షార్ట్ పిచ్ డెలివరీ న్యూజిలాండ్ ఆటగాడు ఆడమ్ పరోర్ హెల్మెట్‌కు తగిలింది. హెల్మెట్ ఊడి స్టంపులపై పడి, పరోర్ "హిట్ వికెట్"గా ఔట్ అయ్యాడు.[9][14]

2007 జూన్ 9 న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ ల మధ్య జరిగిన 3వ టెస్టులో, కెవిన్ పీటర్సన్ హెల్మెట్ ఊడి స్టంప్‌పై పడడంతో "హిట్ వికెట్"గా ఔటయ్యాడు. బౌలర్ డ్వేన్ బ్రావో వేసిన బౌన్సరు హెల్మెట్‌కు తగిలి పడిపోయింది. బంతి తాకిడికి హెల్మెట్‌కుండే చిన్‌స్ట్రాప్‌ను తెగి హెల్మెట్ ఊడిపోయిందని రీప్లేల్లో కనబడింది.

విచిత్రమైన హిట్ వికెట్లు[మార్చు]

2006 ఆగస్టు 6 న హెడ్డింగ్లీలో ఇంగ్లండ్‌తో జరిగిన 3వ టెస్టులో పాకిస్థాన్ ఆటగాడు ఇంజమామ్-ఉల్-హక్ "హిట్ వికెట్"గా ఔట్ అయ్యాడు. అతను ఇంగ్లాండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్‌ వేసిన బంతిని స్వీప్‌ చేసేందుకు ప్రయత్నించి, బ్యాలెన్స్ కోల్పోయి, అతని స్టంప్‌లపై వెనుకకు పడిపోబోయాడు. అతను స్టంప్‌లపై పడకుండా తప్పుకునేందుకు ప్రయత్నించాడు గానీ వాటిపై బిళ్ళబీటుగా పడిపోయి హిట్‌వికెట్‌ ఔటయ్యాడు.

2009 సెప్టెంబరు 14 న కొలంబోలో భారత్‌తో జరిగిన ముక్కోణపు వన్‌డే కాంపాక్ కప్ ఫైనల్స్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఒక షాట్‌కు ప్రయత్నించినపుడు చేతుల్లోంచి బ్యాట్‌ జారిపోయి, వెనుకకు ఎగిరి స్టంప్స్‌పై పడి, ఔటయ్యాడు.

2017 డిసెంబరు 1 న, వెస్టిండీస్ ఆటగాడు సునీల్ అంబ్రిస్ తన తొలి టెస్టు లోనే హిట్ వికెట్‌గా ఔట్ అయిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. పైగా అది గోల్డెన్ డక్‌ కూడా. అతను ఆ తరువాతి ఆటలో కూడా అదే విధంగా ఔట్ అయ్యాడు. వరుసగా గేమ్‌లలో రెండుసార్లు ఈ విధంగా అవుట్ అయిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

మూలాలు[మార్చు]

  1. "Law 35 – Hit wicket". lords.org (in ఇంగ్లీష్). Retrieved 2018-01-14.
  2. "Batsmen dismissed by hit wicket in Test cricket". ESPNcricinfo. Retrieved 26 January 2023.
  3. "Batsmen dismissed by hit wicket in One Day International cricket". ESPNcricinfo. Retrieved 26 January 2023.
  4. "Batsmen dismissed by hit wicket in Twenty20 International cricket". ESPNcricinfo. Retrieved 4 July 2023.
  5. "Players dismissed by hit wicket in women's Test cricket". ESPNcricinfo. Retrieved 26 January 2023.
  6. "Players dismissed by hit wicket in women's One Day International cricket". ESPNcricinfo. Retrieved 6 August 2023.
  7. "Players dismissed by hit wicket in women's Twenty20 International cricket". ESPNcricinfo. Retrieved 24 March 2023.
  8. "Full Scorecard of Australia vs England 3rd Test 1920/21 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-06-14.
  9. 9.0 9.1 9.2 9.3 "The XI freakish dismissals" (in ఇంగ్లీష్). ESPNcricinfo. 2006-01-02. Retrieved 2021-06-14.
  10. "Full Scorecard of Australia vs West Indies 2nd Test 1960/61 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-06-14.
  11. "Warwickshire v Hampshire in 1962". Warwickshire County Cricket Club. Archived from the original on 31 మార్చి 2018. Retrieved 31 March 2018.
  12. "Full Scorecard of India vs England 3rd Test 1974 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-06-14.
  13. "Full Scorecard of Australia vs India 1st Test 1977/78 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-06-14.
  14. "Full Scorecard of Australia vs New Zealand 3rd ODI 1999/00 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-06-14.