హుండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక ఆలయంలో హుండీపై అమ్మవారి వెండిరూపు

దేవాలయాలలో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈ హుండీ (Hundi). ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈ హండీ ద్వారా ఆలయంలో కొలువైన భగవంతునికి సమర్పణగా భావించి భక్తులు సమర్పిస్తారు. .

శంకరాచార్యులవారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ క్రింద 'శ్రీచక్రం' ప్రతిష్టించారని ఒక ప్రతీతి. 1950 వ దశకం లో ఆలయ జీర్ణోద్దారణ సమయంలో పూర్వం నేలపై వున్న రాళ్ళను (ప్లోరింగ్) తొలగించి కొత్త రాళ్ళను వేసే సమయం లో ఆ శ్రీచక్రాన్ని అలానే వుంచి దానిపై రాళ్ళను పేర్చినట్లుతిరుమల తిరుపతి దేవస్థానాల పత్రిక "సప్తగిరి" పేర్కొంది.

దేవాలయాల వ్యాపారీకరణను వ్యతిరేకిస్తున్న చిలుకూరు బాలాజీ దేవాలయం నిర్వాహకులు ఆ ఆలయంలో హుండీ విధానాన్ని రద్దు చేశారు.

వాణిజ్యంలో హుండీ
రుడాల్ప్ ఎర్నస్ట్ చిత్రించిన మనీ చేంజర్ చిత్రం

ప్రభుత్వంచే అధికారికంగా గుర్తింపబడిన బ్యాంకులు లేదా డబ్బు పంపిణీ సంస్థల ద్వారా కాకుండా, దళారీల ద్వారా నమ్మకం మీద ఆధారపడి, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా వంటి ప్రాంతాలనుండి భారత దేశానికి డబ్బు పంపే ఒక వ్యవస్థను హవాలా లేదా హుండీ విధానం అంటారు.

వ్యాపార శాస్త్రంలో హుండీ అన్న పదానికి మరొక అర్ధముంది. ఒకరు మరొకరి వద్దనుండి అప్పుకు సరుకులు కొన్నప్పుడు, అప్పుకు అమ్మే వ్యాపారి తన సరుకులను దిగుమతి చేసుకుంటున్న వర్తకుని వద్దకు పంపేటప్పుడు, ఆ సరుకులను స్వాధీన పర్చుకోవటానికి అవసరమయ్యే రైలు లేదా లారీ రశీదు (Railway Receipt R/R or Lorry Receipt L/R) పంపుతూ, దానితో పాటు మరొక ఒప్పంద పత్రం పంపుతారు. ఆ ఒప్పంద పత్రాన్ని హుండీ (Bill of Exchange) అని అంటారు. ఆ హుండీని అమోదించి దిగుమతి చేసుకుంటున్న వర్తకుడు సరుకులను స్వాధీన పర్చుకుంటాడు. సామాన్యంగా హుండీ లో వ్యక్త పరచిన సరుకు విలువను మూడు నెలల తరువాత చెల్లించాలి.

"https://te.wikipedia.org/w/index.php?title=హుండి&oldid=3720024" నుండి వెలికితీశారు