Jump to content

హుకుమ్ సింగ్ (ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
హుకుమ్ సింగ్

పదవీ కాలం
16 మే 2014 – 3 ఫిబ్రవరి 2018
ముందు బేగం తబస్సుమ్ హసన్
తరువాత బేగం తబస్సుమ్ హసన్
నియోజకవర్గం కైరానా

వ్యక్తిగత వివరాలు

జననం (1938-04-05)1938 ఏప్రిల్ 5
కైరానా , యునైటెడ్ ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా
మరణం 2018 ఫిబ్రవరి 3(2018-02-03) (వయసు 79)
నోయిడా , ఉత్తరప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (1995-2018)
భారత జాతీయ కాంగ్రెస్ (1974-1980) (1985-95)

జనతా పార్టీ (సెక్యులర్) (1980-85)

జీవిత భాగస్వామి రేవతి సింగ్ (13 జూన్ 1958)
సంతానం 5
నివాసం కైరానా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
పూర్వ విద్యార్థి అలహాబాద్ విశ్వవిద్యాలయం (ఎల్‌ఎల్‌బీ)
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

హుకుమ్ సింగ్ (5 ఏప్రిల్ 1938 - 3 ఫిబ్రవరి 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1985లో వీర్ బహదూర్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేసి, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కైరానా నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

హుకుమ్ సింగ్ 1974లో కాంగ్రెస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కాంగ్రెస్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యే, ఒక పర్యాయం జనతా పార్టీ (సెక్యులర్) నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 1995లో బిజెపిలో చేరి కైరానా నుండి 1996, 2002, 2007 & 2012లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2009 లోక్‌సభ ఎన్నికలలో కైరానా నియోజకవర్గం నుండి ఓడిపోయి ఆ తరువాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

హుకుమ్ సింగ్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ నోయిడాలోని జేపీ ఆస్పత్రిలో 3 ఫిబ్రవరి 2018న మరణించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (15 June 2016). "Hukum Singh: 1965 veteran, Congressman during Emergency and Ram Temple movement and now a BJP MP". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  2. India Today (18 June 2016). "Kairana exodus: Who is Babu Hukum Singh?" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  3. The Indian Express (4 February 2018). "BJP's Kairana MP Hukum Singh, seven-term MLA, dies" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  4. Scroll (4 February 2018). "Veteran politician and BJP MP from Uttar Pradesh Hukum Singh dies" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
  5. The Indian Express (3 February 2018). "BJP MP from Kairana Hukum Singh dies aged 79" (in ఇంగ్లీష్). Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.