హేమిస్ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేమిస్ జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
సమీప నగరంలెహ్
విస్తీర్ణం4400 చ. కి.మీ.
స్థాపితం1981
పాలకమండలిభారత ప్రభుత్వం, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం

హేమిస్ జాతీయ ఉద్యానవనం జమ్మూ కాశ్మీర్ లోని లడఖ్ అనే ఎతైన ప్రాంతంలో ఉంది. ఈ ఉద్యానవనం దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జాతీయ ఉద్యానవనం.

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యానవనాన్ని 1981 లో స్థాపించారు. ఇది 600 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. 1988 లో మరికొన్ని ప్రదేశాలను కలుపుకొని ఈ ఉద్యానవనం 3350 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది.[1] 1990 లో మరికొన్ని ప్రదేశాలను కలుపుకొని 4400 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద జాతీయ ఉద్యానవనంగా పేరు పొందింది.[2]

జంతు సంపద[మార్చు]

ఈ ఉద్యానవనంలో సుమారు 200కు పైగా మంచు చిరుతపులులు. టిబెటన్ తోడేలు, యురేసియన్ బ్రౌన్ ఎలుగుబంట్లు, ఎర్ర నక్కలు వంటి జంతువులు ఉన్నాయి. సైబీరియన్ ఐబెక్స్ వంటి అరుదైన జంతువులు ఉన్న ఏకైక ఉద్యానవనం.[3]

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ ఉద్యానవనం కరాకోరం-వెస్ట్ టిబెటన్ పీఠభూమి, ఆల్పైన్ స్టెప్పే ప్రాంతాలకు మధ్యలో ఉంది. ఇందులో పైన్ అడవులు, ఆల్పైన్ పొదలు, పచ్చికభూములు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. http://www.snowleopardnetwork.org/bibliography/anlp99.htm[permanent dead link]
  2. Encyclopaedic Dictionary of Environment, By G R Chhatwal, D K Pandey, K K Nanda, Published by Anmol Publications PVT. LTD., 1988 (ISBN 8170411009), (ISBN 9788170411000)
  3. Wild Sheep and Goats and Their Relatives: Status Survey and Conservation Action Plan for Caprinae By David M. Shackleton, International Union for Conservation of Nature and Natural Resources Species Survival Commission. Caprinae Specialist Group Contributor David M. Shackleton, Published by IUCN, 1997 (ISBN 2831703530), (ISBN 9782831703534)