Jump to content

హైదరాబాద్ బ్రదర్స్

వికీపీడియా నుండి
(హైదరాబాద్ సోదరులు నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాద్ బ్రదర్స్
వ్యక్తిగత సమాచారం
జననంయాకుత్‌పురా, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీత విద్వాంసులు, గాత్ర కళాకారుడు|గాత్ర కళాకారులు, సంగీత ద్వయం

హైదరాబాద్ బ్రదర్స్‌గా ప్రఖ్యాతులైన డి.రాఘవాచారి, డి.శేషాచారి (1957 - 2024 ఫిబ్రవరి 24)[1] కర్ణాటక సంగీత గాన ద్వయం.[2] భారతీయ శాస్త్రీయ కర్ణాటక సంగీతంలో సుప్రసిద్ధులైన గాత్రకళాకారుల ద్వయాలలో హైదరాబాదు సోదరులు కూడా ఒకరు.[3] నగరంతో వారికున్న అనుబంధం వల్ల కర్ణాటక సంగీతంలో హైదరాబాద్ బ్రదర్స్ లేదా హైదరాబాద్ సోదరులుగా ప్రాచుర్యం పొందారు.[3]

పరంపర

[మార్చు]

రాఘవాచారి, శేషాచారి సంప్రదాయ సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందినవారు.[2] తండ్రి దరూర్ రత్నమాచార్యుల వద్ద వారు సరిగమలు నేర్చుకున్నారు. హైదరాబాద్ సోదరుల తల్లి దరూర్ సులోచనా దేవి కూడా కర్ణాటక సంగీత విద్వాంసురాలే.[2] తరచుగా శేషాచారి, రాఘవాచారిల తల్లిదండ్రులు సులోచనాదేవి, రత్నమాచార్యులు జంటగా యాదగిరిగుట్టలో సంగీత కచేరీలు చేసేవారు.[2] శేషాచారి, రాఘవాచారి కుటుంబం మొదట హయత్ నగర్కు చెందినది కాగా అనంతరకాలంలో కుటుంబం యాకుత్ పురాకు మారింది. అక్కడే శేషాచారి, రాఘవాచారి జన్మించారు.[2] రాఘవాచారి శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హైదరాబాద్‌లో సంగీతానికి సంబంధించిన లోతులు, మెళకువలు సుసర్ల శివరాం శిష్యత్వంలో నేర్చుకున్నారు.[2][3]

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తున్న హైదరాబాద్ బ్రదర్స్

పురస్కారాలు

[మార్చు]
  1. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2

మూలాలు

[మార్చు]
  1. "D Seshachary of the Hyderabad Brothers passes away - The Hindu". web.archive.org. 2024-02-25. Archived from the original on 2024-02-25. Retrieved 2024-02-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Ranee Kumar (19 January 2012). "At the pinnacle". The Hindu. Retrieved 8 May 2013.
  3. 3.0 3.1 3.2 Aruna Chandaraju (15 July 2012). "Music is food for the soul". Deccan Herald. Retrieved 8 May 2013.