Jump to content

2011 ఢిల్లీ బాంబు పేలుడు

అక్షాంశ రేఖాంశాలు: 28°36′32″N 77°14′10″E / 28.6090°N 77.2362°E / 28.6090; 77.2362 (2011 Delhi bombing)
వికీపీడియా నుండి
2011 ఢిల్లీ బాంబు పేలుడు
2011 ఢిల్లీ బాంబు పేలుడు is located in ఢిల్లీ
ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ హైకోర్టు
2011 ఢిల్లీ బాంబు పేలుడు స్థలం
ప్రదేశంషేర్ షా రోడ్డు, ఢిల్లీ
భౌగోళికాంశాలు28°36′32″N 77°14′10″E / 28.6090°N 77.2362°E / 28.6090; 77.2362 (2011 Delhi bombing)
తేదీ2011 సెప్టెంబరు 7
10:14 IST (UTC+05:30)
దాడి రకం
బాంబు పేలుడు
ఆయుధాలుఅమ్మోనియం నైట్రేటు, PETN లతో కూడిన ఐ.ఇ.డి
మరణాలు15[1]
ప్రాణాపాయ గాయాలు
79[1]
నేరస్తులుహుజి,[2]
ఇండియన్ ముజాహిదీన్

2011 ఢిల్లీ బాంబు దాడి భారత రాజధాని ఢిల్లీలో 2011 సెప్టెంబరు 7, బుధవారం నాడు ఉదయం 10:14 గంటలకు ఢిల్లీ హైకోర్టులో గేట్ నంబర్ 5 బయట జరిగింది. అక్కడ అనుమానాస్పద బ్రీఫ్‌కేస్ బాంబును పెట్టారు. [3] ఈ పేలుడులో 15 మంది మృతి చెందగా, 79 మంది గాయపడ్డారు.

నేపథ్యం

[మార్చు]

అంతకు ముందు, మే 25న, గేట్ నంబర్ 7 వెలుపల హైకోర్టు వద్ద కూడా తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించింది, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. [4]

బంగ్లాదేశ్-భారత సంబంధాలపై చర్చించేందుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చారిత్రాత్మకమైన రెండు రోజుల అధికారిక పర్యటనకు బంగ్లాదేశ్‌లో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. [5] జూలై 13న ముంబైలో 26 మంది మరణించిన బాంబు పేలుళ్ళు జరిగిన రెండు నెలల లోపే ఈ దాడి జరిగింది.

దాడి

[మార్చు]

2011 సెప్టెంబర్ 7 న ఉదయం 10:14 సమయంలో పేలుడు జరిగింది. పేలుడు పదార్థాలను ఒక బ్రీఫ్‌కేస్‌లో పెట్టి హైకోర్టు రిసెప్షన్‌లో ఉంచారని, కోర్టు కేసులకు హాజరయ్యేందుకు ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వస్తారనీ హోం కార్యదర్శి ఆర్‌కె సింగ్ విలేకరులతో అన్నారు. [6] హోం మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక కార్యదర్శి ప్రకారం, అమ్మోనియం నైట్రేట్, PETN లతో రెండు కిలోల పేలుడు పదార్థాలను వాడారు. తక్కువ మొత్తంలో ఉపయోగించినప్పటికీ ఇవి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. [7]

బాధ్యత

[మార్చు]

పేలుళ్లు జరిగిన వెంటనే వచ్చిన నివేదికల ప్రకారం, బాంబు దాడులకు హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ (హుజీ) గ్రూప్ బాధ్యత వహించింది. [2] హుజీకి ఆపాదించబడిన ఇమెయిల్‌లో, 2001 భారత పార్లమెంటు దాడిలో దోషిగా తేలిన మహ్మద్ అఫ్జల్ గురును సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఉరితీయరాదని ఈ బృందం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. [8] అయితే, అఫ్జల్ గురు, తనకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని తీవ్రంగా ఖండించాడు. తన పేరును "అనవసరంగా" ఈ "పిరికి చర్య"లోకి లాగుతున్నారనీ, దీనిని "అందరూ ఖండించాలి" అనీ అతడన్నాడు. [9]

ఈ ఈమెయిలు వచ్చిన మరుసటి రోజున ఇండియన్ ముజాహిదీన్, టెలివిజన్ మీడియాకు మరో ఈమెయిలు పంపింది. దాడి చేసినది IM అని, HuJI కాదనీ చెబుతూ రాబోయే మంగళవారం నాడు షాపింగ్ కాంప్లెక్స్‌లపై మరిన్ని దాడులు చేస్తామని బెదిరించింది. [10]

సెప్టెంబరు 10న, భారత కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఢిల్లీ హైకోర్టులో జరిగిన పేలుళ్లకు బాధ్యత వహించే ఈమెయిళ్ళను అసలు నేరస్థులే పంపారని అనుకోనక్కర్లేదనీ, పేలుడు గురించి తెలిసాక ఇతర వ్యక్తులు ఆ ఈమెయిళ్ళు పంపి ఉండవచ్చుననీ అన్నారు. [11]

దర్యాప్తులు

[మార్చు]

బాంబు పేలుడు జరిగిన రోజున ఇద్దరు అనుమానిత వ్యక్తుల స్కెచ్‌ను ఢిల్లీ పోలీసు శాఖ విడుదల చేసింది. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన వివరాల ఆధారంగానే ఈ స్కెచ్‌లు వేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ స్కెచ్‌లో ఒక వ్యక్తి 50 ఏళ్ల వయస్సులో ఉన్నాడని, మరొక వ్యక్తి, మధ్య 20 ల్లో ఉన్నట్లు చూపించారు. [12]

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది. [13] ఈమెయిల్‌ను పరిశీలించడానికి 20 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. [14] సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పేలుడు పదార్థాల కూర్పును పరిశీలిస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తుందని, దానిపై NIA తదనుగుణంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. [15] harkatuljihadi2011@gmail.com అనే ఇమెయిల్ చిరునామాతో HuJI పంపిన ఈమెయిలు జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లోని మాలిక్ మార్కెట్‌లో ఉన్న గ్లోబల్ ఇంటర్నెట్ కేఫ్ అనే సైబర్ కేఫ్ నుండి పంపినట్లు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఎన్‌ఐఏ బృందం సైబర్ కేఫ్ యజమాని, అతని సోదరుడితో సహా ముగ్గురు అనుమానితులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకుంది. [16] అయితే, NIA డైరెక్టర్ జనరల్, HuJI మెయిల్‌పై అప్పుడే వ్యాఖ్యానించలేమని, అయితే HuJI భారతదేశాన్ని తన ప్రాథమిక లక్ష్యంగా భావించే సమూహం కాబట్టి (తాము) దానిని తీవ్రంగా పరిశీస్తున్నామని తెలిపారు. [17] దొంగిలించబడిన ATM కార్డును దుర్వినియోగం చేయడంలో ప్రమేయమున్న కారణంగా పాట్నాకు చెందిన ఒక వ్యక్తిని NIA బృందం అరెస్టు చేసి, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. [18] ఇండియన్ ముజాహిదీన్ పేరుతో పంపిన మరో ఈమెయిలును అహ్మదాబాద్‌లోని 22 ఏళ్ల మోను ఓజా పంపాడని గుర్తించారు. అతను ఉద్దేశపూర్వకంగా ఈ నకిలీ ఈమెయిలును సృష్టించినట్లు అంగీకరించాడు. [10] [19]

ఇంటెలిజెన్స్ బ్యూరో, తమకు ఒక్క ఇన్‌పుట్ మాత్రమే లభించిందనీ, ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుదారులైన వారు ఢిల్లీ నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందనీ చెప్పడంతో ఢిల్లీ పోలీసు శాఖ దీనిపై విడిగా ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

అక్టోబరు 7న, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌కు చెందిన వసీం అక్రమ్ మాలిక్ అనే వైద్య విద్యార్థిని అరెస్టు చేసింది, అతను పేలుడుకు ప్రధాన కుట్రదారు అని పేర్కొంది. [20] [21] నిర్బంధించిన అనుమానితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బంగ్లాదేశ్‌లోని యునాని మెడిసిన్ విద్యార్థి కాశ్మీరీ వసీం అక్రమ్ మాలిక్‌ను భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద [22]అరెస్టు చేసారు. కిష్ట్వార్ ప్రాంతంలోని సైబర్ కేఫ్ నుండి ఈమెయిళ్ళు రావడంతో NIA బృందం ఆ ప్రాంతంపై దృష్టి పెట్టింది. అరెస్టయిన వారికి హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామీ అనే ఉగ్రవాద సంస్థతో బలమైన సంబంధాలున్నాయని ఎన్ఐఏ పేర్కొంది. [20] పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO) డిఫెన్స్, కల్నల్ RK పాల్టా 2012 ఆగస్టు 6 న కిష్త్వార్ జిల్లాలోని త్రోథిల్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు ప్రకటించాడు. వీరిని అమీర్‌ అలీ, మహ్మద్‌ షఫీ అలియాస్‌ సకిబ్‌గా గుర్తించారు. ఢిల్లీ హైకోర్టు పేలుళ్లలో అమీర్ అలీ ప్రధాన నిందితుడని కిష్త్వార్-దోడా-రాంబన్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) పేర్కొన్నారు. [23]

2012 మార్చిలో ఎన్‌ఐఏ, ఒక మైనర్‌తో సహా ఆరుగురు నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న నిందితులు: వసీం అక్రమ్ మాలిక్, అతని సోదరుడు జునైద్ అక్రమ్ మాలిక్, అమీర్ అబ్బాస్ దేవ్, షాకీర్ హుస్సేన్ సేఖ్ అలియాస్ ఛోటా హఫీజ్, అమీర్ కమల్. వీరిలో అమీర్ అబ్బాస్ దేవ్ అప్రూవర్‌గా మారడంతో కోర్టు అతనికి క్షమాపణ ప్రసాదించింది. [24] జునైద్, షకీర్, అమీర్ లు అప్పటికి ఇంకా పరారీ లోనే ఉన్నారు. [25]

2012 సెప్టెంబరు 4 న, న్యూ ఢిల్లీలోని ప్రత్యేక NIA కోర్టు నేరపూరిత కుట్ర, హత్య, హత్యాయత్నం వంటి వివిధ ఉగ్రవాద ఆరోపణలతో వ్యవహరించే భారతీయ శిక్షాస్మృతి నిబంధనల ప్రకారం మాలిక్‌కు వ్యతిరేకంగా తగిన ప్రాథమిక సాక్ష్యాలను కనుగొంది. అయితే, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, కుట్ర చేయడం, దేశంపై యుద్ధం చేసేందుకు ఆయుధాలు సేకరించడం వంటి అభియోగాలను కోర్టు ఉపసంహరించుకుంది. అభియోగాల దాఖలుకు కోర్టు గడువు అక్టోబరు 1 గా విధించింది. [25] [24]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 http://www.nia.gov.in/writereaddata/Portal/CasesPdfDoc/RC-09-2011-DLI-ch-1-1.pdf [bare URL PDF]
  2. 2.0 2.1 "Terror attack: Powerful blast outside Delhi High Court kills 11". Indian Express. 7 September 2011. Retrieved 7 September 2011.
  3. "Terror strikes Delhi again, 11 dead in HC blast". CNN-IBN. 7 September 2011. Archived from the original on 17 October 2012. Retrieved 7 September 2011.
  4. "Minor explosion outside Delhi High Court, no casualties". NDTV. 25 May 2011. Retrieved 8 September 2011.
  5. "India probing bomb claim by Harkatul Jihad Islami". Express Tribune. 7 September 2011. Retrieved 7 September 2011.
  6. "Black Wednesday: Blast at Delhi high court kills 11, injures 76". The Times of India. 7 September 2011. Archived from the original on 20 July 2012. Retrieved 7 September 2011.
  7. "Delhi court blast: 11 dead, 74 injured". NDTV. 7 September 2011. Archived from the original on 8 September 2011. Retrieved 7 September 2011.
  8. Mohan, Vishwa (7 September 2011). "HuJI claims responsibility for Delhi high court blast". The Times of India. Archived from the original on 6 November 2012. Retrieved 7 September 2011.
  9. "Afzal Guru denies link to Delhi blast". NDTV. 9 September 2011. Retrieved 11 September 2011.
  10. 10.0 10.1 Chauhan, Neeraj (9 September 2011). "Indian Mujahideen claims Delhi blast, says it will hit market next Tuesday". The Times of India. Archived from the original on 15 March 2012. Retrieved 9 September 2011.
  11. "Delhi blast emails can be fake: Home secretary". Hindustan Times. 10 September 2011. Archived from the original on 10 September 2011. Retrieved 11 September 2011.
  12. "Police release sketches of two Delhi high court blast suspects". The Times of India. 7 September 2011. Archived from the original on 6 November 2012. Retrieved 7 September 2011.
  13. "Delhi police sidelined, NIA to probe Delhi blast". rediff.com. 7 September 2011. Retrieved 8 September 2011.
  14. "Pak link to Delhi High Court blast". zeenews.india.com. 7 September 2011. Retrieved 8 September 2011.
  15. "Signature style attacks on the wane; affect probes". rediff.com. 8 September 2011. Retrieved 8 September 2011.
  16. "Delhi blast: Police arrest 3 in J&K, death toll rises to 12". The Times of India. 8 September 2011. Archived from the original on 6 November 2012. Retrieved 8 September 2011.
  17. "Delhi HC blast: HuJI email traced to J&K". rediff.com. 8 September 2011. Retrieved 8 September 2011.
  18. "Delhi HC blast: Sleuths look for 'getaway' car owner". rediff.com. 8 September 2011. Retrieved 8 September 2011.
  19. "Man faces life term for Delhi terror email". The Times of India. 13 September 2011. Archived from the original on 6 November 2012. Retrieved 13 September 2011.
  20. 20.0 20.1 "Kashmiri medical student arrested in Delhi blast case". CNN-IBN. 7 October 2011. Archived from the original on 8 October 2011. Retrieved 7 October 2011.
  21. "Delhi HC blast: NIA claims arrest of chief conspirator". India Today. Retrieved 7 October 2011.
  22. "NIA gets 14-day custody of Delhi blast accused". 7 October 2011. Retrieved 7 October 2011.
  23. "Delhi HC blast prime accused killed in Army encounter". 6 August 2012.
  24. 24.0 24.1 "blast accused charged with terror, murder". The Hindu. 5 September 2012. Retrieved 21 September 2012.
  25. 25.0 25.1 "Court to frame charges Oct 1". The Hindustan Times. 21 September 2012. Archived from the original on 22 September 2012. Retrieved 21 September 2012.