G20 2023 ఇండియా సమిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2023 జి 20 న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశం జి 20 (గ్రూప్ ఆఫ్ ట్వంటీ)  పద్దెనిమిదవ సమావేశం. 2023 సెప్టెంబరు 9-10 తేదీలలో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. భారతదేశంలో జరిగిన తొలి జీ20 సదస్సు[1].

అవలోకనం[మార్చు]

జి 20 - లేదా గ్రూప్ ఆఫ్ ట్వంటీ అంటే ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమస్యలపై చర్చించడానికి సమావేశమయ్యే దేశాల సమావేశం. ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి పైగా జీ20 దేశాల వాటా ఉంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది ఈ దేశాలలో ఉన్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా,యూరోపియన్ సమాఖ్య దేశాలు జి 20 సభ్యత్య దేశాల సమాఖ్య. జీ20లో సభ్యత్వం ఉన్న కొన్ని దేశాలు జీ7గా కూడా సమావేశమవుతున్నాయి. ఇవి ప్రపంచంలోని ఏడు ప్రముఖ పారిశ్రామిక దేశాలు. ఢిల్లీ సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత జీ20 సభ్యదేశంగా ఆహ్వానించారు. ఈ సంస్థ 55 ఆఫ్రికా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత 1999లో ఈ గ్రూపును స్థాపించారు. ఈ సమాఖ్య ఉద్దేశ్యం ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించే మార్గాలపై చర్చించడానికి ఆర్థిక మంత్రులు, అధికారులకు ఒక వేదికగా రూపొందించబడింది. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి, ఆ సంవత్సరం ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా మొదటి నాయకుల శిఖరాగ్ర సమావేశం 2008 లో జరిగింది. వాతావరణ మార్పులు, సుస్థిర ఇంధనం వంటి అంశాలను చేర్చడానికి జి 20 ఇటీవలి సంవత్సరాలలో తన దృష్టిని విస్తరించింది. ప్రతి సంవత్సరం, వేరే జి 20 సభ్య దేశం అధ్యక్ష పదవిని చేపట్టి, నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ఎజెండాను నిర్ణయిస్తుంది[2].

ఎజెండా[మార్చు]

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుకున్న దృశ్యం

జి 20 శిఖరాగ్ర సమావేశం (సమ్మిట్) 2023 కు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్నందున, ఈ 2023 సమావేశాలకు ఎజెండాలను రూపొందిస్తుంది. ఈ ఎజెండాలో ప్రపంచ ఆర్థిక సమస్యలను, సవాళ్లను పరిష్కరించడానికి ఇతర జి 20 సమ్మిట్ 2023 సభ్యులను ఏకతాటి పై నడవాలని ప్రతిపాదిస్తుంది. 2023 సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ సవాళ్లపై చర్చించనున్నారు. 2023 జి 20 చర్చల కోసం జి 20 భారతదేశం ఆరు ముఖ్యమైన ఎజెండా ప్రాధాన్యతలను వివరించింది, ఇందులోని ప్రతి ఒక్క అంశం అంతర్జాతీయ సమాజానికి  దోహదం చేసే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. గ్రీన్ డెవలప్ మెంట్, క్లైమేట్ ఫైనాన్స్ అండ్ ఎల్ ఐఎఫ్ ఈ, యాక్సిలరేటెడ్, ఇన్ క్లూజివ్ అండ్ రెసిస్టెంట్ గ్రోత్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పురోగతిని వేగవంతం చేయడం, సాంకేతిక పరివర్తన, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, 21వ శతాబ్దానికి బహుళపక్ష సంస్థలు, మహిళా ప్రాధాన్యత వంటివి ఉన్నాయి. జీ20 సమ్మిట్ 2023 పిలుపు (థీం) 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు'. జీ20 శిఖరాగ్ర సదస్సు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో పాటు, ఈ దేశాల నాయకుల వార్షిక సమావేశం జి 20 శిఖరాగ్ర సమావేశం. ప్రపంచ ఆర్థిక అంశాలు, అంతర్జాతీయ సహకారంపై చర్చలకు ఈ సదస్సు అవకాశం కల్పిస్తుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఇతర కీలక అంశాలపై ఈ సదస్సులో నేతలు చర్చించారు. జి 20 శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన చర్చలు,ఒప్పందాలు ప్రపంచ విధానాల, తీసుకునే చొరవలపై గణనీయమైన ప్రభావాలను చూపుతాయి అని భావిస్తున్నారు[3].

2023 జీ20 సదస్సు[మార్చు]

జి 20 సభ్యదేశాల సంయుక్త ప్రకటన లో రష్యా దేశాన్ని నేరుగా విమర్శించకుండా "ప్రపంచ ఆహార ,ఇంధన భద్రతపై ఉక్రెయిన్ల ఘర్షణ ప్రజల కష్టాలు,ప్రతికూల పరిణామాలను" ఖండించింది. అయితే ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ ప్రకటన "గర్వించదగినది ఏమీ లేదు" అని పేర్కొంది. ఈ సదస్సు లో అమెరికా, భారత్, సౌదీ అరేబియా, యూరోపియన్ సమాఖ్య దేశాల రైల్వేలు, షిప్పింగ్ మార్గాల గురించి చేయవల్సిన కార్యక్రమాలను ప్రకటించాయి, దీనిద్వారా దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఐరోపా దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తుందని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ చైనా నిర్మిస్తున్న "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ [4]"అనే కొత్త ప్రపంచ వాణిజ్య మార్గాలను నిర్మించాలనే ప్రాజెక్టును ఎదుర్కోవడానికి కూడా ఉద్దేశించబడింది.

మూలాలు[మార్చు]

  1. "G20 Summit: Delhi prepared to showcase rich culture and cuisine to world leaders". mint (in ఇంగ్లీష్). 2023-09-02. Retrieved 2023-11-25.
  2. "What is the G20 and what was achieved at the Delhi summit?" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-06-28. Retrieved 2023-11-25.
  3. "G20 Summit 2023 Location, Celebration & Countries List". adda247. 2023-09-09. Retrieved 2023-11-25.
  4. "China's Massive Belt and Road Initiative". Council on Foreign Relations (in ఇంగ్లీష్). Retrieved 2023-11-25.