Jump to content

ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ

వికీపీడియా నుండి
(IRNSS-1I నుండి దారిమార్పు చెందింది)
ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ
ఐఆర్ఎన్ఎస్ఎస్- శ్రేణికి చెందిన ఉపగ్రహం
మిషన్ రకంసముద్రయాన నిర్వహణ(navigation)
ఆపరేటర్ఇస్రో
మిషన్ వ్యవధి10 సంవత్సరాలు
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడుఇస్రో
లాంచ్ ద్రవ్యరాశి1425కిలోలు
డ్రై ద్రవ్యారాశి600కిలోలు
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ11 ఏప్రిల్ 2018 [1]
రాకెట్PSLV-XL C41 [2]
లాంచ్ సైట్సతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం
కాంట్రాక్టర్ఇస్రో
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థభూ కేంద్రీయ కక్ష్య
రెజిమ్భూసమకాలిక కక్ష్య
 

ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఒక కృత్రిమ ఉపగ్రహం.భారతీయ అంతరిక్షపరిశోధన సంస్థ అయిన ఇస్రోతయారు చేసిన ఉపగ్రహం.ఇది భారతీయ నావిగేషన్ (మార్గనిర్దేశ వ్యవస్థకు సంబంధించిన) ఉపగ్రహం.నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థకు చెంది ఇప్పటికి ఇస్రో ఏడు ఉపగ్రహాలను ప్రయోగించింది.నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థకు చెంది మొదట్లో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1A ఉపగ్రహంలోని రుబీడియం గడియారం పనిచెయ్యక పోవడంతో, 2017 ఆగస్టు 31 లో దాని స్థానాన్ని భర్తీ చెయ్యటానికి, పిఎస్ఎల్‌వి-సీ39 అనే ధ్రువీయ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ను అంతరిక్షములోకి పంపారు.కాని దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం విఫలమైనది .ఉపగ్రహం చుట్టూ అమర్చిన ఉష్ణకవచం (heat shield) అనుకున్న విధంగా తెరచుకోక, అలాగే వుండి పోవడం వలన, ప్రయోగలక్ష్యం నెరవేరలేదు.సాధారణంగాఉపగ్రహం బయలు దేరిన రెండు నిమిషాలకు ఉష్ణకవచం వేరుపాడాలి. కాని 20 నిమిషాల తరువాత కక్ష్యలోకి ఉపగ్రహం చేరినను ఉష్ణ కవచం వేరుపడలేదు.ఇప్పటికి ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎచ్ నిరద్ధకంగా అంతరిక్షములో 507 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొట్టుతున్నది.ఇప్పుడు పిఎస్ఎల్ వి-సీ41 అను ధ్రువీయ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుటకు ఇస్రో సర్వసన్నిద్ధమైనది.ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహం నావిగేసన్ కు చెంది ఎనిమిదవ ఉపగ్రహం[3]

ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ కౌంట్ డౌన్

[మార్చు]

మంగళవారం,10 ఏప్రిల్ 2018రాత్రి 8:08కి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోటలో వున్న సతీష ధవన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగానికి 32 గంటల కౌంట్ డౌన్ మొదలైనది.ఈ కౌంట్ డౌను గురువారం ఉదయం 4:04 వరకు కొనసాగును.సాధారణంగా ధ్రువీయ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగానికి 24గంటల కౌంట్ డౌన్ సరిపోవును.కాని గతంలో జరిగిన ప్రయోగ విఫలత దృష్ట్యా ఈసారి కౌంట్ డౌన్ వ్యవధిని పెంచారు.

ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ

[మార్చు]

ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐ ఉపగ్రహం నావిగేసన్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహం.ఈ ఉపగ్రహం మొత్తం బరువు 1425 కిలోలు. ఈ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థ భారతదేశంలో మొత్తంతో పాటు 1,500కి.లో మీటర్ల వరకు పనిచేస్తుంది. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే జీపీయస్‌ తరహాలో భారత్‌కు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విమానాలు, నౌకలు, రోడ్లు మీద వాహనాలకు దిక్సూచి వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోరానున్నది.ఉపగ్రహం యొక్క భౌతిక కొలతలు 1.58 X 1.5 X5 మీటర్లు. ఇంధనం లేకుండా ఉపగ్రహం బరువు 600 కిలోలు. ప్రయోగ సమయంలో ఇంధనంతో సహా బరువు 1425కిలోలు.

ఉపగ్రహంలోని ఉపకరణాలు/పేలోడు

[మార్చు]

ఉపగ్రహం రెండురకాల ఉపకరణాల సమూదాయాన్నికలిగిఉన్నది. అందులో ఒకటి దిక్సూచి (navigation payload) సంబంధించింది. రెండవది రెంజింగ్ (ranging) ఉపకరణాలు కలిగి ఉన్నాయి. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు కలిగిన విభాగం ఓడల/నౌకల, విమాన తదితర యానాలకు సంబంధించిన దిక్సూచి సమాచారాన్ని వినియోగదారులకు పంపిణి చేస్తుంది. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు L5- బ్యాండ్ (1176.45MHZ), S-బ్యాండ్ (2492.028 MHZ ) లో పనిచేయును. నావిగేసన్‌కు సంబంధించిన ఉపకరణాలలో అత్యంత కచ్చితమైన సమయాన్ని చూపించు రుబీడియం పరమాణు గడియారం అమర్చబడింది.

రెంజింగ్ (ranging) ఉపకరణాలభాగం C-బ్యాండ్ ట్రాన్స్‌పాండరును కల్గి, ఉపగ్రహం యొక్క కచ్చితమైన రేంజి తెలుపుతుంది.ఇదిభూమిపై దిశానిర్దేశం అందించగల ప్రాంత పరిధిని నిర్ధారిస్తుంది. లేజరు రెంజింగుకై కార్నర్ క్యూబ్ రెట్రోరేఫ్లేక్టరును ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐలో పొందుపరచారు. ఉపగ్రహం రెండు వైపుల రెండు సౌరపలకలను అమర్చారు. ఇవి 1660 వ్యాట్‌ల విద్యుత్తును ఉత్పత్తి చెయ్యును. దీనికి 90 అంపియర్ అవర్ సామర్ధ్యమున్న లిథియం-అయాన్ బ్యాటరిని అనుసంధానించారు. ఉపగ్రహం 440 న్యూటను శక్తిగల అపోజి మోటరును, 22 న్యూటను శక్తిగల 12 త్రస్టరులను కలిగి ఉంది. ఉపగ్రహం యొక్క విద్యుతు చాలక బలం/శక్తి 1670 వాట్స్. ఐ-1కె స్పేస్ క్రాఫ్ట్ బస్ కల్గి ఉంది.లేజరు రెంజింగు కై కార్నర్ క్యూబ్ రెక్టో రిఫ్లెక్టరులను కలిగి ఉంది.రాకెట్ బయలు దేరిన 19 నిమిషాల తరువాత 506 కిలోమీటర్ల ఎత్తులో, సెకనుకు 9.6 కిలోమీటర్ల త్వరణంలో ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది.ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ అంతరిక్షకేంద్రం లోని మొదటిప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు.

ప్రయోగ వివరాలు

[మార్చు]

32 గంటల కౌంట్ డౌన్ తరువాత ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఐని శిఖర భాగంలో ధరించిన, 44.4 మీటర్ల పొడవు,321 టన్నుల బరువున్న పిఎస్ఎల్‌వి- సి41 నిప్పులు కక్కుకుంటూ గగన మార్గంవైపు దూసుకెళ్లింది. అనుకున్న సమయానికి ఉపగ్రహాన్ని బదిలీ కక్ష్యలో ప్రవేశ పెట్టినది. రాకెట్ బయలు దేరిన 19 నిమిషాల తరువాత 506 కిలోమీటర్ల ఎత్తులో, సెకనుకు 9.6 కిలోమీటర్ల త్వరణంలో ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. ఉపగ్రహాన్ని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు[4] శుక్రవారం (13 -04-20 18) నాటికి ఈ ఉపగ్రహం 284 కి.మీ పెరిజి, 20,650 కి.మీ దూరంలో భూ బదిలీ కక్ష్యలో భూమి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నది. దీనిలోని ఇంజనులను దశలవారిగా మండించి.36,000 వేల కిలోమీటర్ల ఎత్తుకు చేర్చుతారు. ఈఉపగ్రహం పదేళ్ళపాటు సేవలను అందిస్తుంది.

ఇప్పటివరకు కక్ష్యలోకి పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహలు[5]

[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Launch date". Spaceflight101. 27 March 2018. Archived from the original on 27 మార్చి 2018. Retrieved 11 ఏప్రిల్ 2018.
  2. "Official page". Economic Times. 11 March 2018. Archived from the original on 17 మార్చి 2018. Retrieved 11 ఏప్రిల్ 2018.
  3. "India to launch 8th navigation satellite IRNSS-1I on 12 April to augment the NAVICC constellation". firstpost.com. Archived from the original on 2018-04-11. Retrieved 2018-04-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "ISRO successfully launches PSLV-C41/IRNSS-1I from Sriharikota:". financialexpress.com. Retrieved 2018-04-12.
  5. "IRNSS-1I". isro.gov.in. Archived from the original on 2018-04-11. Retrieved 2018-04-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)