R
Jump to navigation
Jump to search
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
R లేదా r (ఉచ్చారణ: ఆర్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 18 వ అక్షరం. R ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఆర్స్ అని, తెలుగులో "ఆర్"లు అని పలుకుతారు.[1] ఇది Q అక్షరానికి తరువాత, S అక్షరానికి ముందు వస్తుంది (Q R S).
ఆర్ యొక్క ప్రింటింగ్ అక్షరాలు
[మార్చు]R - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
r - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
ఆర్ యొక్క అర్థం
[మార్చు]- జ్యామితిలో, R అనేది వృత్తం యొక్క వ్యాసార్థం (Radius).
- నావిగేషన్లో, R అంటే "కుడి" (right) దిశ.
- సినిమాల్లో, R అంటే "పరిమితం చేయబడింది" (restricted)
రచనా వ్యవస్థలలో వాడకం
[మార్చు]రచనా వ్యవస్థల వాడకంలో R అనే అక్షరం ఆంగ్లంలో ఎనిమిదవ అత్యంత సాధారణ అక్షరం, నాల్గవ అత్యంత సాధారణ హల్లు (⟨t⟩, ⟨n⟩, ⟨s⟩ తరువాత).[2]
మూలాలు
[మార్చు]- ↑ "R", Oxford English Dictionary 2nd edition (1989); "ar", op. cit
- ↑ "Frequency Table". Math.cornell.edu. Retrieved 7 November 2017.