Jump to content

చర్చ:ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2021 సంవత్సరం, 10 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఆంగ్ల వికీ వ్యాసం

[మార్చు]

@Chaduvari గారూ, మొదట్లో ఇది ఆర్యుల వలస సిద్ధాంతం అని పొరబడ్డాను కానీ ప్రవేశిక చదవగానే అవి రెండూ వేర్వేరు అని అర్థం అయింది. ఈ వ్యాసానికి ఆంగ్ల వికీ లింకు కలుపుదామని ప్రయత్నించాను కానీ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనే పేరుతో ఆంగ్ల వికీ వ్యాసం దొరకలేదు. ఇంకేదైనా పేరుతో ఉందా లేక మీరే స్వయంగా ఆధారాలు సేకరించి తెలుగు వికీలో మాత్రమే రాశారా? రవిచంద్ర (చర్చ) 14:50, 23 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అవును రవిచంద్ర గారు. ఒకప్పుడు ఉన్న ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, ఆ తరువాత ఆర్యుల వలస సిద్ధాంతంగా మారింది కదా. దానికి అనుగుణంగా ఎన్వికీలో ఆర్యుల "దండయాత్ర" సిద్ధాంతం వ్యాసాన్ని వలస సిద్ధాంతం వ్యాసానికి దారిమార్పుగా చేసారు. ఆ పేజీలో దారిమార్పును తీసేసి, పాఠ్యాన్ని చేర్చడం దాన్ని తిరగ్గొట్టడం అనేక సార్లు జరిగాయి. అయితే దీనికి విడిగా పేజీ ఉండాల్సిన అవసరం ఉంది. అంచేత తెవికీలో ఈ పేజీ పెట్టాను.
ఇలాంటిదే మరొకటి.., శాసనోల్లంఘన ఉద్యమం అనే పేజీని కూడా ఎన్వికీలో, కేవలం ఉప్పు సత్యాగ్రహానికే పరిమితం చేసి, దానిని దారిమార్పు పేజీగా చేసేసారు. దానికి కూడా తెలుగులో విడిగా పేజీ ఉంది - మనకు, ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం పేజీలు విడివిడిగా ఉన్నై.__ చదువరి (చర్చరచనలు) 02:34, 24 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, సందేహం తీరింది. ధన్యవాదాలు. రవిచంద్ర (చర్చ) 09:01, 26 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]