చర్చ:కాశీమజిలీ కథల పూర్తి జాబితా
Jump to navigation
Jump to search
ఆడియో, వీడియో లంకెలు
[మార్చు]@స్వరలాసిక గారూ, తెలుగు కథా సాహిత్యంలో పేరెన్నికగన్నవి అయిన కాశీ మజిలీలను శ్రమకోర్చి జాబితాగా వేస్తున్నందుకు మీకు అభినందనలు. అయితే ఇందులో ఇస్తున్న ఆడియో వీడియో లింకులను ప్రచారం కోసం ఇస్తున్నట్లు అవుతుందేమోనని నా అభిప్రాయం. అవి ఇక్కడ ఇవ్వడం సరైనదేనా, కాదా అని ఆలోచించగలరు. మిగతా సభ్యులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు. - రవిచంద్ర (చర్చ) 11:10, 12 ఫిబ్రవరి 2024 (UTC)
- ముందుగా శ్రమకోర్చి ఇలాంటివి వెలుగులోకి తీసుకొచ్చి జాబితాగా వేస్తున్నందుకు స్వరలాసిక గార్కి ధన్యవాదాలు.ఈ చర్చలో రవిచంద్ర గారు వెల్లడించిన అభిప్రాయం సరైనదే. పరోక్షంగా మనం వాటి ప్రచారంకోసం, వీక్షణలు పెంచటానికి భాగస్వామ్యం వహిస్తున్నట్లే.అందులో సందేహం లేదు. వ్యాసాలకు మూలాలు లింకులు ఇచ్చినప్పుడు వీటిని మనం పరిగణనలోకి తీసుకోకుండా తొలగించిన సందర్బాలు చాలా ఉన్నాయి.వాటిని తొలగించాలని నేను అభిప్రాయపడుతున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:34, 27 ఫిబ్రవరి 2024 (UTC)
- మీమీ అభిప్రాయాలకు ధన్యవాదాలు. వికీసోర్స్ లింకు ఇవ్వడంలో మా ఉద్దేశం అక్కడ పూర్తి కథను ఎవరైనా చదువుకోవచ్చునని మాత్రమే. అయితే ఆడియో మరియు వీడియో లింకులిస్తే ఎవరైనా ఉత్తరోత్తరా ఈ కథల గురించి వ్యాసాలను తయారుచేయడానికి ఉపయోగపడతాయని మాత్రమే. ఇక్కడ యూ ట్యూబ్ లింకులు మాత్రమే ఇస్తున్నాము కదా. ఇందులో నాకు సమస్య ఏమీ కనిపించడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 06:21, 27 ఫిబ్రవరి 2024 (UTC)
- రాజశేఖర్ గారూ, వికీసోర్సు లింకులను నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నేను అనేది బయటి లింకుల గురించి మాత్రమే. యూట్యూబు వీడియోలైనా మానిటైజ్ అవుతాయి కదండీ. కాబట్టి వాటికి వ్యాపార/ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. నాకు రాజన్ గారు, ఇతర యూట్యూబు ఛానళ్ళంటే ఇష్టం. నేను సబ్‌స్క్రయిబ్ చేసుకోవడమే కాక వ్యక్తిగతంగా చాలా మందికి పరిచయం చేశాను. కానీ వికీ ద్వారా వాటిని ప్రచారం చేయడం బాగుండదు అని నా ఉద్దేశ్యం. - రవిచంద్ర (చర్చ) 06:34, 27 ఫిబ్రవరి 2024 (UTC)
- ఈ పేజీలో వికీసోర్సు లింకులు ఎలాగూ ఇవ్వబడినవి.యూ ట్యూబ్ ఆడియో, వీడియో చానల్స్ అన్నీ దాదాపు వ్యాపార దృక్కోణంతో ఉన్నవే.కావున వీటిని గురించి మాత్రమే అభ్యంతరం. యర్రా రామారావు (చర్చ) 07:01, 27 ఫిబ్రవరి 2024 (UTC)
- రాజశేఖర్ గారూ, వికీసోర్సు లింకులను నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నేను అనేది బయటి లింకుల గురించి మాత్రమే. యూట్యూబు వీడియోలైనా మానిటైజ్ అవుతాయి కదండీ. కాబట్టి వాటికి వ్యాపార/ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. నాకు రాజన్ గారు, ఇతర యూట్యూబు ఛానళ్ళంటే ఇష్టం. నేను సబ్‌స్క్రయిబ్ చేసుకోవడమే కాక వ్యక్తిగతంగా చాలా మందికి పరిచయం చేశాను. కానీ వికీ ద్వారా వాటిని ప్రచారం చేయడం బాగుండదు అని నా ఉద్దేశ్యం. - రవిచంద్ర (చర్చ) 06:34, 27 ఫిబ్రవరి 2024 (UTC)
- వికీసోర్స్ కాకుండా బయటి యూ ట్యూబ్ మరియు ఇతరలింకుల్ని తొలగిస్తాము. పొరపాటుకు క్షమించమని మనవి.--Rajasekhar1961 (చర్చ) 06:55, 27 ఫిబ్రవరి 2024 (UTC)
- @రాజశేఖర్ గారి స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:02, 27 ఫిబ్రవరి 2024 (UTC)
- ధన్యవాదాలు రాజశేఖర్ గారూ. రవిచంద్ర (చర్చ) 07:03, 27 ఫిబ్రవరి 2024 (UTC)
- బయటి లింకులు తొలగించబడినవి. గమనించండి. మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:04, 27 ఫిబ్రవరి 2024 (UTC)