చర్చ:క్రికెట్ పదకోశం
క్రికెట్ పదకోశం పేజీని 2023 క్రికెట్ ప్రాజెక్టులో భాగంగా సృష్టించారు. దీన్ని, అవసరం మేరకు విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
మూలాల్లో దోషాలు
[మార్చు]మూలాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న దోషాలను పట్టించుకోనక్కర్లేదు. అన్ని మూలాలనూ చేర్చినపుడు ఆ దోషాలు వాటంతటవే తొలగిపోతాయి. __ చదువరి (చర్చ • రచనలు) 15:39, 4 అక్టోబరు 2023 (UTC)
- అవునండి. అందుకే మన దృష్టి వీటి మీద ఎక్కువ ఉంటుందని 'ఆంగ్ల వికీపీడియా నుంచి తీసుకున్నాము' అని సరళంగా రాసేసాను. ఇవి పొరపాటున ఉండిపోయినట్లున్నాయి. మిగిలిన పేజీలు చేస్తున్నాను. ధన్యవాదాలు. VJS (చర్చ) 16:04, 4 అక్టోబరు 2023 (UTC)
ఒకే పేజీయా, పలు పేజీలా?
[మార్చు]@Vjsuseela గారూ, ప్రధానబరిలో ఉపపేజీలు చెయ్యరాదనే నియమం ఒకటి వికీపీడియాలో ఉంది. అందుకే క్రికెట్ పదకోశం/2, క్రికెట్ పదకోశం/3 పేజీలను అది ఉపపేజీలుగా పరిగణించలేదు. "/" అంటే ఉపపేజీ అని అర్థం. కానీ పై పేజీల్లో ఉన్న "/" ను ఆ అర్థంలో తీసుకోలేదు. అది కూడా పేరులోనే భాగమని భావించింది. అందుకే -
- పై రెండు పేజీల్లో అన్నిటికంటే పైన "<క్రికెట్ పదకోశం" అనే లింకు లేదు. వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 పేజీ చూడండి. ఆ పేజీలో పైన "< వికీపీడియా:వికీప్రాజెక్టు" అనే లింకు ఉంది చూడండి. ఉపపేజీ నుండి మాతృపేజీకి వెళ్ళేందుకు అన్ని ఉపపేజీల్లోనూ ఉండే లింకు అది. క్రికెట్ పదకోశం/2,3 లను అది ఉపపేజీలుగా పరిగణించలేదు కాబట్టి ఆ లింకు లేదు.
- "క్రికెట్ పదకోశం" పేజీ లోని "పేజీ సమాచారం" అనే లింకును నొక్కి ఆ పేజీ లోకి వెళ్ళి చూస్తే మిగతా పేరుబరుల్లోని పేజీలకు ఉన్నట్లు "ఈ పేజీకి ఉన్న ఉపపేజీల సంఖ్య" అనే అంశం దీనికి లేదు.
మరొక సంగతి ఏంటంటే, ట్యాబ్ బార్ పెడదామని నేను ఈమెయిల్లో రాసాను గదా.. కానీ ఈ పద్ధతి కూడా ప్రధానబరిలో లేదని తరువాత నేను గమనించాను. ఇదంతా చూస్తూంటే.. మౌలికంగా విజ్ఞానసర్వస్వ సమాచారాన్ని అంచెలంచెలుగా పెట్టడం మీడియావికీ సాఫ్టువేరుకు ఇష్టం లేనట్టుంది.
కింది ప్రత్యామ్నాయాలను పరిశీలించండి.
- "క్రికెట్ పదకోశం - త-న", "క్రికెట్ పదకోశం - ప-మ" ఇలా పేజీలు చెయ్యడం. కానీ వీటిలో ట్యాబు పెట్టరాదు. విషయ సూచిక పెట్టి వాటికి లింకులు ఇవ్వవచ్చు. లేదా ఒక ప్రత్యేక నేవిగేషను మూసను చెయ్యవచ్చు. (విషయ సూచిక కూడా ఒక ఏవిగేషను మూస లాంటిదే, ఆకారంలో మార్పు ఉంటుందంతే)
- క్రికెట్ పదకోశం అనే ఒక్క పేజీ లోనే మొత్తం సమాచారాన్నంతటినీ ఉంచడం. దీని వలన ఇంకో ప్రయోజనం ఉంది: ఒక పదం నుండి ఇంకో పదానికి లింకులు ఇచ్చినపుడు, ఆ లింకును నొక్కిన పాఠకులు ఠక్కున గమ్యానికి వెళ్తారు - అదే పేజీలో ఉంటుంది కాబట్టి. లేదంటే మరొక పేజీ లోడు చెయ్యాల్సి ఉంటుంది. ఎలాగూ విషయ సూచిక పెడతాం కాబట్టి అంతా ఒక్క పేజీలోనే ఉన్నా నష్టం లేదు. కాకపోతే పేజీ పొడుగై పోతుంది.
ఆలోచించండి. __ చదువరి (చర్చ • రచనలు) 14:07, 5 అక్టోబరు 2023 (UTC)
- చదువరిగారు. మీ సూచనలకు ధన్యవాదాలు.
- ఆంగ్ల వికీపీడియాలో ఇది ప్రాజెక్ట్ పేజీ కాకుండా సాధారణపేజీలో నేఉంది. అందుకని అలాగే చేశాను. ఒకే పేజీలో మొత్తం పదాలు ఉంటే పేజీ పెద్దగా అవుతుంది.
- కాబట్టి వేరుగా పేజీలు చేస్తే అంటే - విషయ సూచికలో లింక్ ఇవ్వవచ్చు. పదకోశం-క-ఙ పేజీకి పదకోశం/2లింక్ ఇవవచ్చుకదా.
- కన్నడ, హిందీ నమూనాలు కింద ఇచ్చాను
- https://w.wiki/7fix
- https://w.wiki/7fj6
- అందుకే ప్రధాన -పేజీ కాకుండా మిగిలినవి trial గా చేశాను. మార్చవచ్చు కదా? నాకు ఇంకొంచెం అర్ధం ఆవవలసిఉంది.
VJS (చర్చ) 18:04, 5 అక్టోబరు 2023 (UTC)
- @Vjsuseela గారూ,
- ప్రాజెక్టు పేజీలుగా చేద్దామన్నది నా ఉద్దేశం కాదు. అలా చెయ్యకూడదు కూడా. ప్రధానబరిలో ఉపపేజీలు కుదరదు అని చెప్పానంతే.
- నేను చాటభారతం అంతా రాసి వదిలెయ్యకుండా నా అభిప్రాయం కూడా స్పష్టంగా చెప్పి ఉండాల్సింది. ఇంతకీ నా అభిప్రాయం ఏంటంటే ఒకే పేజీగా చేద్దామని. అందుకే విషయసూచికను కూడా ఆ పద్ధతి లోనే పెట్టాను.
- మీరిచ్చిన లింకులు చూసాను. హిందీలో అయితే విభాగాలు తప్ప సమాచారం ఏమీ లేదు. కన్నడంలో కూడా వేరువేరుపేజీలు లేవు, అంతా ఒకే పేజీలోనే ఉంది. కాకపోతే దాన్ని విభజించాలని ఎవరో ప్రతిపాదించారు. (వాళ్ళూ మనలాగే చర్చలు జరపరు కాబోలు.. 2011 నుండీ ఆ ప్రతిపాదన అలానే పడి ఉంది.) ఇంగ్లీషు, బెంగాలీ, తమిళంతో సహా ఇతర భాషలు కూడా ఐదారు చూసాను. అన్నీ కూడా ఒకే పేజీలో ఉన్నాయి.
- అయితే అక్కడ అలా ఉన్నాయని మనం కూడా అలానే చెయ్యాలనేమీ లేదు. మన పద్ధతిలో మనం చేసుకుపోదాం. మీ ఆలోచన ప్రకారమే కానివ్వండి. __ చదువరి (చర్చ • రచనలు) 00:39, 6 అక్టోబరు 2023 (UTC)