చర్చ:తెలంగాణ జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ
Jump to navigation
Jump to search
జిల్లాల పటం లోని దోషం
[మార్చు]యర్రా రామారావు గారూ, ఈ పేజీలో ఉన్న పటంలో ఒక దోషముంది. రంగారెడ్డి జిల్లాను "హైదరాబాదు రంగారెడ్డి" అని రాసారు. అలాగే ఇతర జిల్లాల పేర్లనుకూడా అధికారికంగా ఏ పేరు ఉంటే అదే రాయాలి. File:TG-districts-te.svg ను ఎక్కించిన అర్జునరావు గారూ, పరిశీలించి అవసరమైన సవరణలు చెయ్యవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 07:08, 22 జనవరి 2022 (UTC)
- చదువరి గారు నేను అంతగా పరిశీలించలేదు.ఇంకా అలాగే కొన్ని జిల్లాల పేర్లు సవరించాల్సి ఉంది. అంతేగాదు పటంలో అక్షరాల అంతక్లారిటీగా లేవు. రంగులు అక్షరాలను అధిగమించినట్లుగా ఉంది. అర్జునరావు గారూ జిల్లా పేర్లు పరిశీలించి అవసరమైన సవరణలు చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 09:07, 22 జనవరి 2022 (UTC)
- చదువరి,యర్రా రామారావు గార్లకు, మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు. ఈ పటంలో జిల్లా ముఖ్యపట్టణాలను చూపుతూ, సంబంధిత జిల్లాలను బ్రాకెట్లలో చూపాను. అదే పటం వివరణ(లెజెండ్) లో చూపాను. అది మీరు గమనించలేదేమో. తెలంగాణా జిల్లాల పునర్విభజన తరువాత, కొన్ని పట్టణాలు రెండు జిల్లాలకు ముఖ్యపట్టణాలయినాయి. హైద్రాబాదు రాష్ట్ర రాజధాని కూడా కావున, జిల్లా ముఖ్యపట్టణాల బిందువు రంగు కంటే వేరే రంగుతో, హైద్రాబాదు, రంగారెడ్డి జిల్లాలను బ్రాకెట్లలో తెలిపాను . ఈ పద్ధతిలో జరిగిన లోపం హనుమకొండ,వరంగల్ జిల్లాలకు ముఖ్యపట్టణం వరంగల్ కావున దానిని కూడా హైదరాబాదు లాగా గుర్తించవలసినది. ఇక పటం వెక్టర్ రూపం కావున, పటాన్ని ప్రత్యేకంగా చూసినపుడు అక్షరాలు స్పష్టతగానే వున్నాయని నా అభిప్రాయం. జిల్లాలకు రంగులు వాడాము కావున, ముఖ్యపట్టణాల పేర్లకు నేపధ్యంగా వేరే రంగు వాడాను. ఆంగ్ల వికీలో పటాలకు ప్రమాణాలు ఏర్పడ్డాయి కాని ఇటువంటి రంగులద్దిన భౌగోళిక పటాలకు ప్రామాణికాలు కనబడలేదు. భూగోళిక పటాల తయారీ కూడా ఒక ప్రత్యేక నైపుణ్యం కాని నాకంత అనుభవంలేదు. ఎవరు చేసినదానిలో లోపాలు, వారికన్నా ఇతరులే సులభంగా గుర్తించగలుగుతారు కావున, మీరు నిశితంగా పరిశీలించి ఇంకేమైనా దోషాలుంటే తెలిపితే, తదుపరి సవరణలో వీలైనంతవరకు మార్చుతాను. అప్పటివరకు అవసరమనుకుంటే తెలంగాణ_జిల్లాల_పటము లో అవసరమైన సవరణలు చేసి వాడుకొనవచ్చు.--అర్జున (చర్చ) 00:13, 24 జనవరి 2022 (UTC)
- ఈ వ్యాసంలో ఎక్కించిన పటం తెలంగాణ జిల్లాల పటం.అందువలన జిల్లాపేర్లు ముఖ్యంకానీ, ఇక్కడ ముఖ్య పట్టణాలు పేర్లు, స్థానాలు గుర్తు అనవసరం.ఎందుకంటే తెలంగాణ జిల్లాల ముఖ్యపట్టణాల పటం కాదుకదా?ఆ ప్రదేశం మొత్తం ఆ జిల్లాకు చెందిందే కదా?ముఖ్య పట్టణాలు స్థానం ఈ పటంలో చూపించనవసరంలేదు. యర్రా రామారావు (చర్చ) 00:54, 24 జనవరి 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, సాధారణంగా జిల్లాల పటంలో జిల్లాతో పాటు ముఖ్యపట్టణం కూడా తెలిపే వాడుక వుంది. తెలంగాణాలో జిల్లాల సంఖ్య ఎక్కువగా వున్నందున, రెండు చూపటానికి సమస్య కావున, ఇలా చేయటానికి ప్రయత్నించాను. అర్జున (చర్చ) 23:12, 25 జనవరి 2022 (UTC)
- ఈ వ్యాసంలో ఎక్కించిన పటం తెలంగాణ జిల్లాల పటం.అందువలన జిల్లాపేర్లు ముఖ్యంకానీ, ఇక్కడ ముఖ్య పట్టణాలు పేర్లు, స్థానాలు గుర్తు అనవసరం.ఎందుకంటే తెలంగాణ జిల్లాల ముఖ్యపట్టణాల పటం కాదుకదా?ఆ ప్రదేశం మొత్తం ఆ జిల్లాకు చెందిందే కదా?ముఖ్య పట్టణాలు స్థానం ఈ పటంలో చూపించనవసరంలేదు. యర్రా రామారావు (చర్చ) 00:54, 24 జనవరి 2022 (UTC)
- చదువరి,యర్రా రామారావు గార్లకు, మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు. ఈ పటంలో జిల్లా ముఖ్యపట్టణాలను చూపుతూ, సంబంధిత జిల్లాలను బ్రాకెట్లలో చూపాను. అదే పటం వివరణ(లెజెండ్) లో చూపాను. అది మీరు గమనించలేదేమో. తెలంగాణా జిల్లాల పునర్విభజన తరువాత, కొన్ని పట్టణాలు రెండు జిల్లాలకు ముఖ్యపట్టణాలయినాయి. హైద్రాబాదు రాష్ట్ర రాజధాని కూడా కావున, జిల్లా ముఖ్యపట్టణాల బిందువు రంగు కంటే వేరే రంగుతో, హైద్రాబాదు, రంగారెడ్డి జిల్లాలను బ్రాకెట్లలో తెలిపాను . ఈ పద్ధతిలో జరిగిన లోపం హనుమకొండ,వరంగల్ జిల్లాలకు ముఖ్యపట్టణం వరంగల్ కావున దానిని కూడా హైదరాబాదు లాగా గుర్తించవలసినది. ఇక పటం వెక్టర్ రూపం కావున, పటాన్ని ప్రత్యేకంగా చూసినపుడు అక్షరాలు స్పష్టతగానే వున్నాయని నా అభిప్రాయం. జిల్లాలకు రంగులు వాడాము కావున, ముఖ్యపట్టణాల పేర్లకు నేపధ్యంగా వేరే రంగు వాడాను. ఆంగ్ల వికీలో పటాలకు ప్రమాణాలు ఏర్పడ్డాయి కాని ఇటువంటి రంగులద్దిన భౌగోళిక పటాలకు ప్రామాణికాలు కనబడలేదు. భూగోళిక పటాల తయారీ కూడా ఒక ప్రత్యేక నైపుణ్యం కాని నాకంత అనుభవంలేదు. ఎవరు చేసినదానిలో లోపాలు, వారికన్నా ఇతరులే సులభంగా గుర్తించగలుగుతారు కావున, మీరు నిశితంగా పరిశీలించి ఇంకేమైనా దోషాలుంటే తెలిపితే, తదుపరి సవరణలో వీలైనంతవరకు మార్చుతాను. అప్పటివరకు అవసరమనుకుంటే తెలంగాణ_జిల్లాల_పటము లో అవసరమైన సవరణలు చేసి వాడుకొనవచ్చు.--అర్జున (చర్చ) 00:13, 24 జనవరి 2022 (UTC)
ఈ పటం లోని దోషాలు
[మార్చు]ఈ పటంలో కింది దోషాలున్నై.
- జిల్లాల పేర్లు ప్రామాణికంగా లేవు. ఉదా: యాదాద్రి జిల్లా కాదు, అది యాదాద్రి భువనగిరి జిల్లా. (మిగతా జిల్లా పేర్లనూ సరిచూసుకోవాలి)
- ఇది జిల్లాల పటం. ఇందులో జిల్లా పేరు ప్రముఖంగా ఉండి, ముఖ్యపట్టణం బ్రాకెట్లోనో చిన్నది గానో ఉండడం పద్ధతి. అలా ఉంటే పటాన్ని చూడగానే అర్థమౌతుంది. ప్రస్తుత పటం కొంత తికమక కలిగిస్తుంది. కొందరికి కలిగించకపోవచ్చేమో నాకు తెలియదు గానీ, సహజ మానవ మేధ (ఇంటలెక్ట్) కు కలిగేది తికమకే. అంచేత జిల్లా పేరు ప్రముఖంగా ఉండాలి, ముఖ్యపట్టణం బ్రాకెట్లో ఉండాలి.
- లేదా దీన్ని ముఖ్యపట్టణాల పటంగా ఉంచేసి, జిల్లాలకు మరో పటాన్ని చెయ్యాలి. (బ్రాకెట్లో జిల్లా పేరు ఉండడాన్ని బట్టి ఇది జిల్లాల పటంగా కాకుండా, జిల్లా ముఖ్యపట్టణాల పటం లాగా ఉంది.)
- కేవలం కొన్నిటికి మాత్రమే బ్రాకెట్లు ఉండడాన్ని బట్టి, ఆ జిల్లాలకు జిల్లా పేరు ముఖ్యపట్టణం పేరూ వేరువేరని అర్థమౌతోంది. జిల్లా పేర్ల గురించి తెలియని వాళ్ళకు అది సరిగ్గా అర్థం కాదు. ఉంటే అన్నిటికీ ముఖ్య పట్టణాల పేర్లుండాలి, లేదంటే దేనికీ ఉండకూడదు.
- సాధారణంగా పటాన్ని చూడగానే మరే వివరణా లేకుండా అర్థమవ్వాలి - మరీ క్లిష్టమైన అంశాలను చూపించే పటమైతే సూచికను వాడుతారు. కానీ ఈ పటం చూపించాల్సింది జిల్లాలను మాత్రమే అయినప్పటికీ తికమకగా తయారైంది. పటాన్ని చూడగానే, ఏ వివరణలూ అక్కర్లేకుండానే తెలిసేలా మారిస్తే చాలు.
- హైదరాబాదు జిల్లా ఏదో సూచించలేదు.
__చదువరి (చర్చ • రచనలు) 02:01, 24 జనవరి 2022 (UTC)
- @Chaduvari గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. వీలువెంబడి సవరిస్తాను. అర్జున (చర్చ) 23:13, 25 జనవరి 2022 (UTC)
- @Chaduvari గారు,@యర్రా రామారావు గారు, సవరించిన పటంతో తాజా పరచాను. ఇంకేమైనా సూచనలుంటే రెండు రోజులలో తెలియపరచండి. --అర్జున (చర్చ) 06:35, 25 ఏప్రిల్ 2022 (UTC)
- అర్జునరావు గారూ పటంలో మరికొన్ని లోపాలు ఉన్నవి.అవి
- కొమరం భీం అసీఫాబాద్ అని ఉంది.దానిని కొమరం భీం జిల్లా అని సవరించాలి
- రాజన్న సిరిసిల్ల అని ఉంది.దానిని రాజన్న జిల్లా అని సవరించాలి.
- జయశంకర్ భూపాలపల్లి అని ఉంది.దానిని జయశంకర్ జిల్లా అని సవరించాలి.
- యాదాద్రి భువనగరి అని ఉంది.దానిని యాదాద్రి జిల్లా అని సవరించాలి.
- భద్రాద్రి కొత్తగూడెం అని ఉంది.దానిని భద్రాద్రి జిల్లా అని సవరించాలి.
- జోగులాంబ గద్వాల అని ఉంది.దానిని జోగులాంబ జిల్లా అని సవరించాలి.
- తెలంగాణ జిల్లాల పునర్వ్యస్థీకరణ ఫైనల్ నోటిఫికేషన్లు ఒకసారి పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 17:30, 7 మే 2022 (UTC)
- యర్రా రామారావు గారు, మీ సూచనలకు ధన్యవాదాలు. తెలంగాణా జిల్లాపేర్లు నేను జిల్లా వెబ్సైట్లనుండి తీసుకున్నాను. ఉదాహరణకు రాజన్న సిరిసిల్ల చూడండి. పేర్లలో తికమకపడే అవకాశం లేనందున, ప్రస్తుతానికి పటంలో ఇలా వున్నా ఇబ్బంది లేదనిపిస్తున్నది. వీలువెంబడి పెద్ద మార్పులు ఏమైనా చేయవలసి వస్తే అప్పుడు పరిశీలించి సవరిస్తాను. --అర్జున (చర్చ) 06:31, 11 మే 2022 (UTC)
- అర్జునరావు గారూ నిజమేనండీ.నేను గతంలోనే గమనించాను.కొన్ని జిల్లా వెబ్సైట్లలో అలాగే రాసారు. ప్రభుత్వ ఉత్తర్వులలోనే తప్పులు ఉంటున్నాయి.ఇక వీటిలో తప్పులు ఎందుకు ఉండవు.అయితే నేను అనేది కొన్నిఅలా, కొన్ని ఇలా బాగుండదనే అభిప్రాయంతో మీదృష్టికి తీసుకువచ్చాను.మీకు అవకాశం ఉన్నప్పుడు, దానిని వేరే సందర్బంలో సవరించేటప్పుడు సవరించగలరని ఆశిస్తున్నాను.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 06:41, 11 మే 2022 (UTC)