వేదిక చర్చ:శిలాజ ఇంధనం

వికీపీడియా నుండి
(చర్చ:శిలాజ ఇంధనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

YVSREDDY గారూ ఈ వ్యాసంలో మూలాలను చేర్చి పూర్తి చేయండి. కె.వెంకటరమణ (చర్చ) 08:53, 18 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఖచ్చితత్వం లేని సమాచారానికి నమూనా

[మార్చు]

ఈ వ్యాసానికి సంబంధించిన ఇప్పటి కూర్పుకు సంబంధించి నా ఆలోచనలివి:

  1. నాసిరకం భాష:
    1. "విద్యుత్ ప్లాంట్లలో శిలాజ ఇంధనాలు, సాధారణంగా బొగ్గు, నీటిని వేడి చేసి ఆవిరిలోకి మార్చడానికి కాల్చబడుతుంది" - భాష కృతకంగా ఉంది. చెప్పదలచిన అర్థం వెళ్ళడం లేదు. ఇక్కడ రావాల్సిన అర్థం సుమారుగా ఇది: విద్యుత్ ప్లాంట్లలో శిలాజ ఇంధనాలను మండించి, దానితో నీటిని మరిగించి ఆవిరిగా మారుస్తారు. ఈ ప్లాంట్లలో సాధారణంగా బొగ్గును ఇంధనంగా వాడుతారు. -ఈ అర్థం వచ్చేలా సహజమైన భాష రాసి ఉండాల్సింది.
    2. "శిలాజ ఇంధనాల ద్వారానే నేడు ఎక్కువ రవాణా జరుగుతుంది, ఇవి లేకుండా, ఎక్కువ రవాణా జరగదు." వాక్యంలో మొదటి భాగం చెప్పినదాన్నే రెండో భాగం ("ఇవి లేకుండా, ఎక్కువ రవాణా జరగదు.") కూడా చెబుతోంది. పునరుక్తి దోషం అంటారనుకుంటా దీన్ని. రవాణాలో శిలాజ ఇంధనాలను ఎంత ఎక్కువగా వినియోగిస్తున్నారో నొక్కి చెప్పదలిస్తే.. రవాణా కోసం వాడే ఇంధనాల్లో సింహభాగం శిలాజ ఇంధనాలదే అనో రవాణా కోసం వాడే ఇంధనాల్లో ఫలానా ఇంత శాతం వాటా శిలాజ ఇంధనాలదే అనో రాస్తే సబబుగా ఉంటుంది.
    3. "ప్రజలు తమ ఇళ్లలో వేడి చేయడానికి శిలాజ ఇంధనాలను కూడా మంట కొరకు ఉపయోగిస్తారు." :వాక్య నిర్మాణం సరిగ్గా లేదు.
    4. "ముడి చమురును వేరుచేసి ఎల్‌పిజి, గ్యాసోలిన్, కిరోసిన్, జెట్ ఇంధనం, డీజిల్ ఇంధనం వంటి వివిధ ఇంధనాలను తయారు చేయవచ్చు."- ముడిచమురు నుండి ఫలానా పదార్థాలను వేరు చెయ్యవచ్చు అనే అర్థం రావాల్సి ఉంది. కానీ భాషలో ఆ ఖచ్చితత్వం లేదు. ముడిచమురును దేనినుండి వేరు చెయ్యాలి? అనే ప్రశ్నకు ఆస్కారం ఇస్తోంది.
    5. "అంటే మోటార్ బైక్‌లు, కార్లు, ట్రక్కులు, ఓడలు, విమానాలు, రైళ్లు, అంతరిక్ష నౌకలు వంటి మోటారు వాహనాలను తరలించడానికి అవి దహనమవుతాయి. " - ఫలానా వాహనాల్లో వీటిని ఇంధనంగా వాడుతారు అంటే సరిపోయేది. ఈ వ్యాస సందర్భానికి మరింత వివరం అవసరం లేదు. ఒకవేళ రాయదలచుకున్నా, సరిగా రాయాలి గాని ఇలా తప్పుగా కాదు -"తరలించడానికి" అనేది తప్పు. ఒక వాహనాన్ని లారీ మీదో, ట్రైలరు మీదో, మరో దాని మీదో ఎక్కించి తీసుకుపోతే దాన్ని తరలించడం అంటారు. "ఆటోమొబైలు" అనే "స్వయంచాలక" అర్థం కోసం "తరలించడం" వాడడం తప్పు.
  2. సమాచారంలో ఖచ్చితత్వం లేదు: రాసే సమాచారంలో ఖచ్చితత్వం ఉండాలి. వాడే భాష ఎంత ఖచ్చితత్వంతో ఉంటే సమాచారం అంత ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ఉదాహరణలిక్కడ:
    1. ".., ఆవిరైన నీరు టర్బైన్ అని పిలువబడే ఫ్యాన్ లాంటి వస్తువును నెట్టివేస్తుంది." - నీటిఆవిరి టర్బైన్ను నెట్టివెయ్యదు. టర్బైన్ను తిప్పుతుంది. నెట్టివెయ్యడం అనేది తప్పు. తరువాతి వాక్యంలో తిరగడం అనే రాసారు. ఇక్కడ మాత్రం ఆ మాట వాడలేదు.
    2. "అలా టర్బైన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు, టర్బైన్ లోపల అయస్కాంతాలు విద్యుత్తును తయారు చేస్తాయి." - టర్బైను ఏదో వేరే వస్తువు చుట్టూ తిరుగుతున్నదనో, టర్బైను చుట్టూ మరోటేదో తిరుగుతోందనో అర్థం వస్తోంది. ఇక్కడ ఖచ్చితత్వం మిస్సైంది. టర్బైను తిరిగేటపుడు లేదా టర్బైను లోని రోటారు తిరిగేటపుడు అనో అనాలి.
    3. "అలా టర్బైన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు, టర్బైన్ లోపల అయస్కాంతాలు విద్యుత్తును తయారు చేస్తాయి." అయస్కాంతాలు టర్బైన్లో ఉండవు, జనరేటర్లో ఉంటాయి. ఖచ్చితత్వం లోపించడమే కాదు, ఇదసలు తప్పు సమాచారం ఇస్తోంది. "అయస్కాంతాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి" అనే దానిలో ఖచ్చితత్వం లేదు. దాన్ని వివరంగా (బహుశా ఇలా -స్టేటర్లు సృష్టించిన అయస్కాంత క్షేత్రాన్ని ఖండిస్తూ రోటారు తిరిగినపుడు...) రాయాలి. మామూలుగా విద్యుత్తును "తయారు చేస్తా"రని రాయరు, "ఉత్పత్తి చేస్తా"రని రాస్తారనుకుంటా.. పరిశీలించండి. ("విద్యుత్తయారీ" అనరు, "విద్యుదుత్పత్తి" అంటారనుకుంటా)
    4. "పాక్షిక స్వేదనం" కాదు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ను మన పాఠ్య పుస్తకాల్లో "ఆంశిక స్వేదనం" అని అనువదించినట్లు నాకు గుర్తు. దాన్ని పరిశీలించాలి.
    5. "వంటలు చేయడానికి కట్టెలు ఉపయోగించవచ్చు, కాని వంట పాత్రలు మసిబారతాయి, అందువలన చాలా ఇళ్లలో, ప్రజలు సహజ వాయువును వంట కోసం గ్యాస్ స్టవ్‌ ద్వారా ఉపయోగిస్తున్నారు." రెండు సమస్యలున్నాయిందులో - 1. కట్టెల వలన పాత్రలు మసిబారతాయి కాబట్టి వంటగ్యాసును వాడుతున్నారు అనేది ఖచ్చితత్వానికి బహు దూరంగా ఉంది. కట్టెల కెలోరిఫిక్ విలువ, పొగ, వాయు కాలుష్యం, ఆరోగ్య సమస్య, హ్యాండ్లింగు, నిల్వ, వంటి ప్రధాన అంశాలను స్పృశించకుండా, వీటితో పోలిస్తే చాలా చిన్నదైన అంశాన్ని మాత్రమే చెప్పడం అంటే తప్పు సమాచారం ఇచ్చినట్లే.
    6. మరొక్క సంగతి - వంట కోసం వాడుతున్నది "ఎల్‌పిజి" (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్). "సహజ వాయువు"ను వాడుతున్నారు గానీ, బహు తక్కువ. ఇక్కడ రాయాల్సింది "ఎల్‌పిజి". లేదా రెండూ రాయాలి. సహజ వాయువు ఒక్కటే రాసి, ఎక్కువగా వాడే ఎల్‌పిజి రాయకపోవడం తప్పు అర్థాన్ని తీసుకువెళ్తోంది.
    7. "శిలాజ ఇంధనాలను తారు రోడ్డు నిర్మాణంలో విస్తృతంగా ఉపయోగిస్తారు." స్పష్టత లేదు. రోడ్డు వేసే తారు (ఆస్ఫాల్టు/బిట్యుమెన్) గురించి చెప్పదలచారా? అయితే ఇక్కడ "ఇంధనాలను" అని వాడరాదు. తారును వాడేది ఇంధనంగా కాదు -బైండరుగా వాడుతారు.

వాడుకరి:YVSREDDY గారూ, నేను ఇవన్నీ రాయడానికి రెండు కారణాలున్నాయి:

  1. మామూలుగా మనకు చాలా విషయాలు తెలుసు, లేదా తెలుసనుకుంటాం. కానీ రాతలో పెట్టేటపుడు అవి ఎంత ఖచ్చితంగా ఉన్నాయో పరిశీలించుకోవాలి, తెలుసుకోవాలి. దానికి అత్యంత ముఖ్యమైన పద్ధతి "మూలం". మనం రాసేదానికి మూలం చూపించాలి. మూలం కోసం వెతికినప్పుడు మనం రాసేది తప్పో రైటో తెలుస్తుంది. ఎంత ఖచ్చితంగా ఉందో తెలుస్తుంది. మీరొక్కరే కాదు, అందరం అంతే. అందుకే.. వికీపీడియాకు మూలమంత్రం - "మూలం".
  2. తప్పుల్లేని సమాచారం ఇవ్వాలంటే బాధ్యతగా పరిశోధించి, సమాచారం సేకరించి సేకరించిన దాన్ని వేరే మూలాలతో బేరీజు వేసుకుని రాయాల్సి ఉంటుంది. దీనికి దగ్గరిదారి ఇంగ్లీషు వికీపీడియా లోని వ్యాసాలను అనువదించడం. అక్కడ కూడా తప్పు సమాచారం ఉండే అవకాశం ఉంది. కానీ మన పనికి అతి దగ్గరి దారి అది.

ఈ రూపంలో ఈ వ్యాసం ఉండదగదు. తొలగించాలి. లేదా మొత్తం వ్యాసాన్ని ఆమూలాగ్రం సవరించాలి -భాషను సవరించాలి, సమాచారాన్ని సవరించాలి. తొలగించడం అంటే మీరు విముఖంగా ఉన్నారు కాబట్టి సమూలంగా, స"మూలంగా" సవరించండి. __చదువరి (చర్చరచనలు) 05:02, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పెద్ద బాలశిక్ష, వివిధ తరగతుల పాఠ్య పుస్తకాలు, వివిధ దినపత్రికల్లో ఉన్న సమాచారాన్ని తీసుకొని ఈ వాడుకరి యధాతధంగా వ్యాసాలు రాసినట్టు అనిపిస్తున్నది. మొలకస్థాయి దాటించడంకోసం 2,200kb వరకు మూలాలు లేకుండా రాసి, వ్యాసాలను వదిలేస్తున్నారు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:12, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పైన చదువరి గారి వెలిబుచ్చిన అభిప్రాయాలు చూసాక ఈ వ్యాసం పూర్తిగా అర్థవంతమైన వాక్యాలతో సవరించవలసి ఉంది.అలా సవరించిన పక్షంలో తొలగించటానికి ఏకీభవిస్తున్నాను.సందర్బం వచ్చింది కాబట్టి కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నాను. YVSR గారు సృష్టించిన వ్యాసాలను గురించి నిర్వాహక భాద్యతలలో భాగంగా చొరవతీసుకుని ఒకసారి చరవాణి ద్వారా స్యయంగా మాట్లాడగా, ఇలా రాయటమో చాల ఎక్కువ అని శెలవు ఇచ్చాడు. ఇన్ని చర్చలు ద్వారా తెలియజేసిననూ ఏమీ మార్పురాకపోగా, ఇంకా వికీ నియమాలు, మార్గదర్శకాలు పాటించకుండా, వ్యతిరేఖదోరణిలో ప్రవర్తన సాగుతుంది. తొలగింపు చర్చలలో పాల్గొనడు.తొలగించినతరువాత ఆ వ్యాసానికి మరల చర్చాపేజీ సృష్టించి, అక్కడ ఆ వ్యాసాన్ని పెట్టి ఏదోదో రాస్తుంటాడు.మూలాలు ఉండవు.ఉన్న మూలాలు సహేతుకంగా ఉండవు.2050 బైట్స్ కు మించి ఏ వ్యాసం ఉండదు. మనం వికీపీడియాలో ఇతర వాడుకరులతో మంచిగా ప్రవర్తించాలి అనేది అర్థం చేసుకోవటంలేదు.వాడుకరిగా మనం మంచిగా ప్రవర్తిస్తే మన చరిత్ర మంచిగా రికార్డు అయింది. చెడుగా ప్రవర్తిస్తే చెడుగానే రికార్డు అయింది.ఈ వాస్తవం గమనించాలి.నిర్వహణ బాధ్యత చాలా కష్టంగా ఉంది.నేనైనా, yvsr గారైనా, ఇంకొకరైనా ఈ రకంగా ప్రవర్తించినప్పుడు నిరోధిస్తే తప్పేమిటి? ఆలోచించండి.నిర్వహకులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నమాట వాస్తవం. ఇంతకుముందు చదువరిగారు అభ్యర్థించారు.నేను కూడా yvsr గారిని ప్రవర్తన మార్చుకొని ఇతర వాడుకరులు, నిర్వహకులుతో సమన్యయంగా ఉండాల్సిందిగా అభ్యర్తిస్తున్నాను.మనకే అన్ని అవకాశాలు ఉంటాయని అనుకోవటం మంచిదికాదని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 06:47, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:YVSREDDY వ్యాసాలకు సంబంధించి ఏడు సంవత్సరాల క్రితం రచ్చబండలో విస్తృతమైన చర్చలు జరిగాయి. ఈ ఏక వాక్య వ్యాసాల చర్చల ఫలితమే ఈ "మొలక నియంత్రణ విధానం". ఈ నియంత్రణ విధానంలో ఉన్న కనీస స్థాయి 2000 బైట్లను అడ్డు పెట్టుకొని విస్తరించగలిగిన వ్యాసాలను కూడా ఆ హద్దు వరకు తెచ్చి వదిలివేస్తున్నాడు. ఈ "శిలాజ ఇంధనం" వ్యాసం ఎవరూ వృద్ధి చేయరు. అదే మొత్తం రాయమంటే వికీ విధానాల ప్రకారం ఎవరైనా రాయవచ్చు. అలా ముఖ్యమైన వ్యాసాలలో కూడా ఒకటి లేదా రెండు వాక్యాలు చేర్చి అలా వదిలివేస్తున్నాడు. తొలగింపు చర్చలలో పాల్గొనడు సరికదా, ఆ వ్యాసం తొలగింపు వరకు ఎదురు చూసి, తొలగించిన వెంటనే ఇదివరకు ఉన్న సమాచారాన్ని మొలక స్థాయిలో చేర్చుతుంటాడు. మూలాలు ఉండవు. నిర్వాహకుల మాటలను పట్టించుకోడు. మనకు ఈ మొలక వ్యాసాలను, లోప భూయిష్టమైన యాంత్రిక అనువాద వ్యాసాలను సమీక్షించడానికే అధిక శ్రమ అవుతుంది. తొలగింపు చర్చలలో మన శ్రమ వృధా అవుతుంది. ఆ సమయంలో ఎన్నో ముఖ్యమైన అంశాలలో పాల్గొనవచ్చు కదా. అందువలన వికీ విధానాలు పాటించకుండా ఉన్న అతనిని కొంత కాలం పాటు నిరోధిస్తే మంచినదని నా అభిప్రాయం. కె.వెంకటరమణ (చర్చ) 07:44, 19 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]