Jump to content

వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/Documentation

వికీపీడియా నుండి
మొదటి పేజి
Main
కార్యక్రమ ప్రణాళిక
Program Details
10వ వార్షికోత్సవ సంబరాలు
10th Anniversary Celebrations
ఖర్చులు
Budget
స్పాన్సర్స్
Sponsors
చర్చ
Discussion
నివేదిక
Documentation
కార్యవర్గం
Committee

కార్యక్రమ నివేదిక

[మార్చు]
Cake of Telugu Wiki 10th Celebrations at Vijayawada

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు 2014,ఫిబ్రవరి 15న విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకొరకు విశ్వనాధ్.బి.కె. అద్యక్షునిగా ఒక కార్య నిర్వహక వర్గం, కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ఎంపికమండలి కొరకు వైజాసత్య అధ్యక్షునిగా ఒక కార్యవర్గాలను ఎన్నుకోవడం జరిగాయి. ఈ కళాశాలలో దశాబ్ది ఉత్సవాలను జరపాలనే నిర్ణయం తరువాత ఆ కళాశాల విద్యార్ధుల ద్వారా కొన్ని కార్యక్రమాలు జరపాలని ఉత్సవ కమిటీ నిర్ణయించడం జరిగింది మరియు ఉత్సవాలకు ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నారు. అలా మొదలైన మూడు రోజుల కార్యక్రమ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి

15 వతేదీ దశాబ్ది ఉత్సవాల తొలి కార్యక్రమాలు

[మార్చు]
తెలుగు వికీ దశాబ్ది ఉత్సవ జ్ఞాపిక మూల చిత్రం

తెలుగు వికీపీడియా 10 సంవత్సరాలు పూర్తిచేసుకుని 55వేలకు పైగా వ్యాసాలతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించుకోవడం పట్ల ప్రారంభోపన్యాసం ద్వారా వికీమీడియా భారతదేశ చాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిహెచ్.అర్జున రావు హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందే వికీదశాబ్ది ఉత్సవాలకు విచ్చేసిన వికీపీడియన్లు, ఔత్సాహికులు, పాల్గొనేందుకు విచ్చేసిన విద్యార్థులు, ఇతరులు కే.బి.ఎన్ కాలేజి ఆవరణలో ఏర్పాటుచేసిన స్వాగత వేదిక వద్ద సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు.

ప్రారంభ సభ

[మార్చు]

ఉదయం 10.37 గంటలకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, వికీమీడియా ఇండియా చాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిహెచ్.అర్జునరావు, సి.ఐ.ఎస్. సంస్థ అధికారి పి.విష్ణువర్థన్, తెవికీ దశాబ్ది ఉత్సవాల సంఘం అధ్యక్షుడు బి.కె.విశ్వనాథ్, కె.బి.ఎన్. కళాశాల అధ్యక్షుడు ఉత్పల సాంబశివరావు, కార్యదర్శి రజిత్ కుమార్, ప్రాచార్యుడు(ప్రిన్సిపాల్) కృష్ణమూర్తి తదితరులు జ్యోతిప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2014-15 సంవత్సరాన్ని తెలుగు వికీపీడియా సంవత్సరంగా గుర్తించి భవిష్యత్ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాల కన్నా తెలుగు భాషా సంస్కృతుల పట్ల తెలుగు వికీపీడియానే ఎక్కువ కృషి చేసిందని పేర్కొన్నారు. తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని రూపొందించిన కొమఱ్ఱాజు లక్ష్మణరావు, నిబద్ధ చరిత్రకారుడు మల్లంపల్లి వంటి మహానుభావులు కూడా ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు చేయలేనంత కృషి చేశారన్నారు. ఆ వైతాళికుల్లాగానే తెలుగు వికీపీడియన్లు కూడా వైతాళికులుగా గుర్తుండిపోతారని, తెలుగు జాతి వారికి ఋణపడుతుందని పేర్కొన్నారు. అధికార భాష సంఘం అధ్యక్షునిగానే కాక తెలుగు భాషాభిమానిగా వ్యక్తిగతంగా కూడా తాను తెవికీకి సంపూర్ణంగా సహకారం అందిస్తానన్నారు. కేబీఎన్ కళాశాల కార్యదర్శి రజిత్ కుమార్ మాట్లాడారు. కళాశాల విద్యార్థిని మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. తెవికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రూపొందించిన టీషర్టును మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. అర్జునరావు, విష్ణు తదితరులు బుద్ధప్రసాద్ కు జ్ఞాపిక, టీషర్టులతో సత్కారం చేశారు. కార్యక్రమానంతరం టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేకులో భాగంగా ఆహూతులకు తేనీరు, చిరుతిండి(స్నాక్స్)తో ఆతిథ్యమిచ్చారు.

లాబ్ సెషన్స్

[మార్చు]

లాబొరేటరీలో ఔత్సాహికులైన వి.వి.ఐ.టి., కె.బి.ఎన్.కళాశాలల విద్యార్థులకు రెహమానుద్దీన్, విష్ణు వర్థన్, కొందరు ఇతర వికీపీడియన్లు తెలుగు వికీపీడియాలో వ్యాసాలు వ్రాయడంపై, వివిధ పద్ధతుల్లో కృషి చేయడంపై అవగాహన కల్పించారు.

కంప్యూటర్లో గత దశాబ్దిలో తెలుగు గమనం

[మార్చు]

కంప్యూటర్లో గత దశాబ్దిలో తెలుగు గమనం అంశంపై కొమఱ్ఱాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ అవార్డు గ్రహీత వీవెన్(వీర వెంకట చౌదరి) అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దశాబ్ది క్రితం 2004లో అంతర్జాలంలో తెలుగు వ్రాయడం, చదవడంలో ఉన్న సమస్యలు, 2014కు అవి తొలగిపోయిన క్రమం, భవిష్యత్తులో సాంకేతికంగా తెలుగు భాషను అభివృద్ధి చేసేవారి ముందున్న సమస్యలు వివరించారు.

దశాబ్ది క్రితం కంప్యూటర్లో తెలుగు

[మార్చు]

2000 నుంచి తెలుగు టైప్ చేసే వీలు ఉంది కానీ చాలా కష్టంగా ఉండేదన్నారు. 2006 నుంచి మాత్రమే తేలిగ్గా వెబ్సైట్ లో టైప్ చేయగలవి తయారయ్యాయని, 2004లో గౌతమి, పోతన, వేమన తదితర 3-4 ఫాంట్లు ఉండేవని తెలిపారు. 2004లో కొన్ని బ్లాగులు మాత్రమే ఉండేవని పేర్కొన్నారు. ఈమాట, కౌముది వంటి కొన్నే జాలపత్రికలు ఉండేవన్నారు.

ప్రస్తుతం కంప్యూటర్లో తెలుగు స్థితి

[మార్చు]

మైక్రో సాఫ్ట్ ఆఫీస్, లిబ్రా ఆఫీస్, అడోబ్ ఇన్ డిజైన్, అడోబ్ ఫోటోషాప్ వంటి అనువర్తనాల్లో తెలుగు వాడవచ్చునని వివరించారు. మైక్రోసాఫ్ట్ విండోస్, విస్టా, ఎక్స్.పి., ఉబంటు, ఫెడోరా, దేబియన్, లినక్సుల్లో నేడు తెలుగు వాడడం వీలవుతుందని తెలిపారు. మొబైలు ఫోన్లు, ఐ.పాడ్లు, ఆండ్రాయిడ్లు తెలుగు ఉపయోగాన్ని సమర్థిస్తున్న సంగతి వివరించారు.

భవిష్యత్తులో రానున్న అభివృద్ధి, ముందున్న సవాళ్లు

[మార్చు]

రానున్న దశాబ్దిలో కంప్యూటర్లో తెలుగు వాడకం విషయంలో బాగా అభివృద్ధి చెందనుందని పేర్కొన్నారు. వచ్చే పదేళ్ళలో స్పెల్ చెకింగ్, రాత నుంచి మాట, మాట నుంచి పాఠ్యం వంటివి తెలుగులో సాధ్యం చేయడం మన ముందు ఉన్న లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు తెలుగు బాగా వచ్చిన సాంకేతిక నిపుణులు, సాంకేతికంగా సామర్థ్యం ఉన్న తెలుగు పండితులు అవసరమవుతారని తెలిపారు.

వాడకం కూడా పెరగాలి

[మార్చు]

తెలుగులో రాసేందుకు సాంకేతిక ఉపకరణాలు, సాంకేతికాంశాల అభివృద్ధి చెందడమే కాక అంతర్జాలంలో తెలుగు వాడకం కూడా బాగా పెరగాలని ఆకాంక్షించారు. గూగుల్లో తెలుగు క్వైరీలు, అంతర్జాలంలో తెలుగులో విషయాలు పెరగాలని పేర్కొన్నారు.

వికీ గురించి అవగాహన

[మార్చు]

ఈ సందర్భంగా వికీలో ట్రాన్స్ లేట్ వికీ.నెట్, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్స్, ఒమేగా వికీ వంటి ప్రాజెక్టుల్లో ఎలా కృషిచేయవచ్చో వివరించారు. విద్యార్థినులు భవ్య, ఐశ్వర్య, సుస్మితలు వికీమ్యాప్స్, ట్రాన్స్లేట్ వికీ వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు వీవెన్ సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి అర్జునరావు సంధానకర్తగా పనిచేశారు.

వికీడేటా అంశంపై సదస్సు

[మార్చు]

వికీడేటా అంశంపై తెలుగు వికీపీడియా ఛైర్మన్ రహమానుద్దీన్ షేక్ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రధానంగా వికీడేటా ప్రాజెక్టు ముఖ్యోద్దేశం, ప్రణాళిక, వివిధ దశలు వంటివి వివరించారు. ఒక పదానికి వివిధ భాషల్లోని వికీపీడియాల్లో ఏ సమాచారం లభిస్తోందో(బొమ్మలతో సహా) వికీడేటా ద్వారా సంగ్రహీకరించబడుతుందని వివరించారు. రెహమానుద్దీన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు 3 దశల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఒక అంశాన్ని అన్ని భాషలలోని వికీపీడియాల్లోనూ లింక్ చేస్తూపోవడం మొదటి దశ అనీ, ఆపై ముఖ్యమైన బొమ్మలు, శీర్షికలు కేంద్రీకృతం చేయడం రెండవ దశ అని, మూడవ దశలో వ్యాసానికి సంబంధించిన అంశాలను, వర్గీకరణలను కాపీ చేస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఫలవంతమయ్యే సరికి ఏ భాషలో ఒక వర్గంలో ఒక విషయాన్ని అన్వయించినా అన్ని భాషల్లోనూ అది అన్వయమవుతుందని వివరించారు. ఈ విషయాన్ని ఎల్.సీ.డీ. ప్రొజెక్టరు ద్వారా తెవికీలోని మామిడిచెట్టు వ్యాసాన్ని ఉదాహరణగా తీసుకుని వివరించారు. తర్వాత తల్లి అనే పదాన్ని ఉదాహరణగా తీసుకుని వికీ డేటా ద్వారా వెతికితే అన్ని భాషల్లోనూ తల్లి అనే పదం ఎలా వస్తుందో చూపించారు. అలా జరిగేందుకు ఒక పదాన్ని ఎలా లింకింగ్ చేయాలో తెవికీలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల తెలుగు వ్యాసానికి సంబంధిత కాలేజ్ ఆంగ్లవ్యాసానికి లింక్ చేసి చూపించారు. కేబీఎన్ కళాశాల వ్యాసం ప్రైమరీ కోడ్ ను చూపారు. వికీసోర్సుకూ, కామన్స్ కూ ఎలా లింక్ చేయాలో చూపి వివరించారు. తదుపరి దశల్లో ఒక భాషా వికీపీడియాలో ఉన్న వ్యాసాన్ని అవసరమైతే ఇతర భాషల వికీపీడియాల్లో తయారుచేసేందుకు ఈ వికీసోర్సును ఉపయోగించుకుంటామని తెలిపారు. ఉదాహరణకు బిహు డాన్స్ గురించి అస్సామీ భాషలో మాత్రమే వ్యాసం ఉండి ఉన్నా తెలుగులో ఆ వ్యాసం తయారుకావాల్సిన అవసరం ఉంటే వికీసోర్సును ఉపయోగించి తయారు చేసే సాంకేతికత తర్వాతి దశల్లో వస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు ఎలా కృషి చేయవచ్చో ఆయన సోదాహరణంగా వివరించారు. అనంతరం విష్ణువర్థన్ కొనసాగిస్తూ తమిళ వికీపీడియన్, స్టూడెంట్ అయిన నీచెల్ కరణ్ వికీడేటాకు సంబంధించి చేసిన యాప్ ను గురించి వివరించారు. విద్యార్థి దశలోనే అందరూ ఇలాంటి యాప్ లు తయారు చేయవచ్చునని ఉత్సాహపరిచారు. ఆపై రెహమానుద్దీన్ రెండవ దశలో జరిగే మార్పులు, దీనివల్ల ప్రయోజనాలు, సాధించవలసిన సమస్యలను గురించి వివరించి ముగించారు. అనంతరం భోజన విరామం స్వీకరించారు.

ఇతర భాషల వికీపీడియన్ల అనుభవాలు

[మార్చు]

విరామానంతరం ప్రారంభమయిన సెషన్లో ఇతర భాషల వికీపీడియన్లు తమ భాషల వికీపీడియాల్లో జరుగుతున్న కార్యకలాపాల వివరాలు తెలుగు వికీపీడియన్లతో పంచుకున్నారు.

తమిళ వికీపీడియా గురించి

[మార్చు]

తమిళ వికీపీడియన్ తమిళ వికీపీడియాను అభివృద్ధి చేయడంలో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళ వికీపీడియా అభివృద్ధికి ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు కీలకమైన సహకారం అందిస్తున్నాయని తెలిపారు. వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు ఎంతో సమాచారాన్ని డిజిటల్ రూపంలో తమిళనాడు ప్రభుత్వ శాఖలు అందించాయని పేర్కొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలను తమిళ వికీపీడియా తమ కృషిలో భాగస్వాములను చేసుకుందని తెలిపారు. విద్యాబోధనలో పాఠ్యాంశంగా కూడా తమిళ వికీపీడియా గురించి చేర్చారని, వీటన్నిటి ఫలితంగా తమిళ వికీ అభివృద్ధి సాధ్యపడుతోందని వివరించారు. తాను స్వయంగా తన స్నేహితులను వికీపీడియన్లుగా చేస్తూంటానని ప్రతీ వికీపీడియన్ తమ స్నేహితులకు వికీ గురించి చెప్పడం వల్ల సత్ఫలితాలు ఉంటాయని తెలిపారు.

ఒడియా వికీపీడియా గురించి

[మార్చు]

ఒడియా వికీపీడియన్ మృత్యుంజొయ్ మాట్లాడుతూ ఒడియా వికీపీడియాలో పలువురు ప్రముఖులు తమ పేరును తాము ఎలా పలుకుటారో తెలిపే వాయిస్ క్లిప్స్ చేర్చామని తెలిపారు. ఒడియా భాషలోని వ్యాసాలకు ఆంగ్ల రీడైరెక్టులు తయారు చేస్తున్నామని, దీనివల్ల వెతికేప్పుడు చాలా సౌలభ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. క్రియాశీలక వికీపీడియా ఎడిటర్స్ కొరత తమను వేధిస్తోందని, దీన్ని అధిగమించేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.

మలయాళ వికీపీడియా గురించి

[మార్చు]

మలయాళ వికీపీడియన్ కె.మనోజ్ మాట్లాడుతూ వికీసోర్సు విషయంలో భారతదేశంలోకెల్లా ఎక్కువ సమాచారాన్ని పొందుపరచడంలో మలయాళ వికీపీడియా విజయానికి గల కారణాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ మలయాళ సాహిత్య అకాడెమీ వారితో సమన్వయంతో పనిచేయడం వల్ల కాపీరైట్ హక్కులు లేని 200 వందల పుస్తకాలు వికీసోర్సులో చేర్చగలిగామని వివరించారు. వారు అందించిన మరో 800 పైచిలుకు గ్రంథాలు వికీసోర్సులో చేర్చే పని సాగుతోందని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులను పాఠశాలలతో సమన్వయం చేసుకుని వికీపీడియన్లుగా చేయగలిగామని, ఈ పుస్తకాలను వికీసోర్సులో చేర్చేందుకు వారి సహకారం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు.

కొంకిణీ వికీ విశేషాలు
[మార్చు]

కొంకిణీ వికీపీడియన్ దర్శన్ మాట్లాడుతూ 2007లోనే ప్రారంభమైనా కొంకణీ వికీపీడియా క్రియాశీలక సభ్యుల లోటువల్ల ఈమధ్య వరకూ అభివృద్ధి చెందలేదని, కానీ గత ఏడాది గోవా విశ్వవిద్యాలయ విద్యార్థులు దీన్ని ఒక ప్రాజెక్టులా స్వీకరించడంతో వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైందని తెలిపారు. 290 వరకూ వ్యాసాలే ప్రస్తుతానికి(2014 ఫిబ్రవరి నాటికి) కొంకిణీ వికీపీడియాలో ఉన్నా కొంకిణీ ఎన్సైక్లోపీడియాను డిజిటలైజ్ చేయడం వంటి ప్రణాళికల వల్ల అనతికాలంలోనే మంచి అభివృద్ధి సాధించనుందన్నారు.

ఉర్దూ వికీపీడియా సంగతులు

[మార్చు]

తెలుగు వికీపీడియాలో విశేష కృషి చేస్తూ ఉర్దూ వికీపీడియాలో కూడా తమ కృషిని కొనసాగిస్తున్న అహ్మద్ నిసార్ ఉర్దూ వికీలో తన అనుభవాలను, ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఉర్దూ భాష జన్మించింది, అభివృద్ధి చెంది విశ్వవ్యాప్తమైంది భారతదేశంలోనే ఐనా ఉర్దూ వికీపీడియాలో భారతదేశం నుంచి క్రియాశీలక సభ్యులు ఇద్దరు ముగ్గురే ఉండడం దురదృష్టకరమన్నారు. ఐనా పాకిస్తాన్ తదితర దేశాల నుంచి క్రియాశీలక సభ్యులతో భారతీయ ఉర్దూ వికీపీడియన్లు సమన్వయం సాధిస్తూ ఉర్దూ వికీని అభివృద్ధి చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. జాతీయ గీతం (కౌమీ తరానా) అనే వ్యాసాన్ని సార్వజనీనంగా భావిస్తూ తాను వ్యాసాన్ని రాయగా కౌమీ తరానా (జాతీయ గీతం) అనే పేరుతో పాకిస్తాన్ జాతీయ గీతాన్ని గురించి రాసిన వ్యాసం అప్పటికే ఉండడంతో వివాదం చెలరేగిందనీ, పాకిస్తాన్ దేశానికే కాక ప్రపంచంలోని చాలా దేశాలకు వారి వారి జాతీయ గీతాలు ఉన్నందున సంకుచితమైన దృక్పథంతో రాయకూడదని చర్చించి వివాదం పరిష్కరించానని తెలిపారు. వేర్వేరు దేశాల వికీపీడియన్లు పని చేయవలసి వస్తే కలిగే ఇబ్బందులు, దొరికే వెసులుబాట్లు, పొందే అనుభవాలు వివరించారు. భారతదేశంలో 800ఏళ్ళ చరిత్ర కలిగిన ఉర్దూ భాషకు భారతదేశం నుంచి 8 మందే వికీపీడియన్లు ఉండడమనేది బాధాకరమని, ఈ సంఖ్యను వీలున్నంతగా పెంచే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

పెద్దబాలశిక్ష నా స్వార్జితం కాదు, జాతి సంపద:గాజుల సత్యనారాయణ

[మార్చు]

పెద్దబాలశిక్ష తన స్వార్జితంగా భావించట్లేదని, ఇది తెలుగు జాతి విజ్ఞాన సంపదగా తరతరాలకు అందాలనుకుంటున్నానని పెద్దబాలశిక్ష రచయిత గాజుల సత్యనారాయణ పేర్కొన్నారు. పెద్దబాలశిక్ష చరిత్రను విశదీకరించారు. బ్రౌన్ పండితుని కాలంలో పెద్దబాలశిక్షను వివేక చంద్రిక పేరిట తయారు చేయడం, కొత్తగా అమల్లోకి వస్తున్న ఆంగ్లేయశైలి పాఠశాల విద్యకు పెద్దబాలశిక్షను పాఠ్యప్రణాళికలో భాగం చేయడం వంటి పరిణామాలు వివరించారు. తెలుగు సంస్కృతిలో పెద్దబాలశిక్ష పొందిన ప్రాధాన్యతను తెలిపారు. ఆపై పెద్దబాలశిక్ష క్రోడీకరించే ఆలోచన తనకు ఎలా వచ్చిందో, తానెలా దాన్ని చేశారో వివరించారు. ఆ క్రమంలో వివరాలను గ్రంథాలయాల నుంచి, ఇతర మూలాల నుంచి స్వీకరించిన పద్ధతిని వివరించారు. విజ్ఞాన సర్వస్వ వ్యాసాల్లాంటి పెద్దబాలశిక్ష వివరాలు ఎలా కూర్చారన్నది తెలిపారు. తెవికీ సభ్యులు ఆయనను ప్రశ్నించి మూలాల సేకరణ, ప్రామాణికత నిర్ధారణ వంటి వాటిలో సత్యనారాయణ అవలంబించిన పద్ధతులు ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వై.వి.ఎస్.రెడ్డి ప్రశ్నకు జవాబిస్తూ తాను పెద్దబాలశిక్ష ప్రచురించిన కొత్తల్లో ఒక వ్యక్తి దశావతారాలు, అష్టాదశ పురాణాలు వంటి జాబితాలు తన గ్రంథం నుంచే రాశారనీ కనుక తనకు 5లక్షల రూపాయలు ఇవ్వాలని ఉత్తరాలు రాశారని, మధ్యవర్తులను పంపారని తెలిపారు. దానికి తాను ఐదు రూపాయలు కూడా ఇవ్వలేనని ఇదంతా పూర్వుల విజ్ఞానమే తప్ప మీ స్వంత పరిశోధన కాదని జవాబిచ్చినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో తన పెద్దబాలశిక్ష కూడా పూర్వుల విజ్ఞానమే అవుతుందని కనుక వికీపీడియా కోసం తన పుస్తకంలోని ఏ వ్యాసమైనా ఉపయోగించుకోవడానికి అభ్యంతరంలేదని స్పష్టంచేశారు.

కొ.ల.రా.వి.పురస్కారాల గురించి వివరాల వెల్లడి

[మార్చు]

తొలిరోజు కార్యక్రమాల ముగింపు సమయంలో అర్జునరావు కొ.ల.రా.వి. పురస్కారాల కమిటీ తరఫున పురస్కారాల లక్ష్యం, ప్రతిపాదనలు, ఎంపిక కమిటీ, ఎంపిక చేసేందుకు కొలమానాలు వంటివి సవివరంగా తెలిపారు. ఈ ప్రక్రియలోని పారదర్శకతను వికీ సభ్యులకు, విద్యార్థి వికీపీడియన్లకు వివరించారు. అనంతరం పురస్కార గ్రహీతల గురించి, వారి కృషి గురించి తెలిపారు. పురస్కార గ్రహీతలైన పలువురు వికీపీడియన్లను మాట్లాడించారు. వారి మాటలు ఇలా ఉన్నాయి:

వీవెన్

[మార్చు]
Certificate of komarraju lakshmanarao Award for who are given long and good service to Telugu Wikipedia (తెలుగు వికీపీడియాలో విశేషసేవలు అందించినందుకు కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార గ్రహీతలకు ఇవ్వబడిన ప్రశంసాపత్రం)

మొదట్లో నేను ఇంగ్లీషు వికీపీడియాలో రాసేవాణ్ణి చదివేవాణ్ణి. ఆపై స్థానికీకరణ ప్రారంభమయ్యాకా నేను వికీలో యాక్టివ్ గా ప్రయత్నాలు ప్రారంభించాను. ముఖ్యంగా వికీపీడియాకు సాంకేతిక ఉపకరణాలు తయారు చేశాను. ముఖ్యంగా కంప్యూటర్లలో తెలుగు వాడటాన్ని గురించి విస్తృతమైన ప్రచారమైతే నేను చేపట్టాను.

రవిచంద్ర

[మార్చు]

ఇంగ్లీషు వికీపీడియాను ఎం.టెక్ చదివేరోజుల్లో సమాచారం కోసం ఉపయోగించేవాణ్ణి. వికీ పేజీలో తెలుగు చూసి ఇక్కడికి వచ్చాను. మొదట్లో హిందూ మతం గురించి, పురాణ పాత్రల గురించి వ్యాసాలు లేకపోవడంతో నేను అభివృద్ధి చేశాను. నన్ను ఇతర సభ్యులు మంచి ప్రోత్సాహం అందించారు. ఆపై నేను అర్థరాత్రులలో కూడా వికీపైనే పనిచేస్తూ లాబొరేటరీల్లో పనిచేశాను. వికీలో నేను మా అమ్మమ్మ గారి ఊరి గురించి వ్యాసం రాశాను. దాంతో చాలామంది గ్రామాల గురించి రాశారు. నాకు ఈ విషయంపై చాలా సంతోషం కలిగింది. ఇది వికీలో చాలా సంతృప్తినిచ్చిన విషయం.

పాలగిరి

[మార్చు]

మా అమ్మాయి పెళ్లయ్యాకా చదివేప్పుడు ఒకమారు వ్యాసాలు కావాల్సి వస్తే నేను ఇంగ్లీషు వికీలోకి వెళ్ళి అనువదించి ఇచ్చాను. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తే వెతికారు. కానీ దొరకలేదట. మా అమ్మాయి ద్వారా ఫోను చేసి వ్యాసాలు దొరకలేదన్నారు. ఎలా వెతికారంటే తెలుగులో వెతికామన్నారు. సరే ఇంగ్లీషులో వెతకమని చెప్పాను. అప్పుడు అర్థమైంది మొత్తానికి తెలుగులో అంతర్జాలం ఉందని. దాంతో అప్పటి నుంచీ కృషి మొదలుపెట్టాను. నేను కన్నడ వికీలో కూడా కృషి ప్రారంభించాను. తెవికీతో పోలిస్తే కన్నడ వికీ పెద్దగా అభివృద్ధిలో లేదు. 15వేల వ్యాసాలు ఉంటే 5వేల వ్యాసాలు ఏక వాక్యాలు. మిగిలినవాటిలో ఇంగ్లీషు అనువాదాలు ఎక్కువ. పైగా తమ గురించి తాము గొప్పలు రాసుకునే లక్షణాలు కనిపిస్తున్నాయి.

నిసార్ అహ్మద్

[మార్చు]

2 దశాబ్దాలకు పైగా నేను ఉపాధ్యాయునిగా పనిచేశాను. ఇంగ్లీష్ వికీపీడియా ద్వారా తెవికీకి వచ్చాను. తెవికీలో నేను చేసిన గొప్ప పనులేమీ లేవు కానీ నేర్చుకున్నదే ఎక్కువ. తెవికీలో కనీసం ఉండాల్సిన వెయ్యి వ్యాసాల జాబితాపై కృషిచేశాను, లోక్ సభ, శాసన సభ నియోజకవర్గాల గురించి కృషి చేశాను. మతాలపై అవగాహన ఉంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ, జొరాస్ట్రియానిజం వంటి వాటిపై కృషి చేశాను.

డిల్లీలో ఉద్యోగం చేసే రోజుల్లో తెలుగుదనం, తెలుగుమాట వెతికినా దొరికేది కాదు. అప్పట్లో తెలుగుతో గడపడం నాకు అవసరమైంది. అందుకే తెవికీలో కృషి ప్రారంభించాను. అదే నన్ను ఈ రోజుల్లో తెలుగు వికీపీడియా కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార గ్రహీతగా నిలబెట్టింది. బట్టలంటే ఆసక్తి ఉంది. అందుకే నేను దుస్తులపై వ్యాసాలు వ్రాసాను. పంచెలు, ధోవతులు, ఫాంట్లు మొదలుపెట్టి భారతీయ దుస్తులు, భారతీయులు ధరించే పాశ్చాత్య దుస్తులు అన్న వ్యాసం చేశాను. బెంగళూరు తెలుగు వికీపీడియా సమావేశాలను నిర్వహించాను. ఇంకా చేయదలుచుకున్నాను.

జె.వి.ఆర్.కె.ప్రసాద్

[మార్చు]

(ఆరోగ్యం బాగా లేకపోవడంతో అర్జునరావు గారే చెప్పారు) విక్షనరీని ఎంతగానో విస్తరించారు. కొత్తవారికి స్వాగతాలు చేప్తూంటారు.(ప్రసాద్ గారి మాట) నమస్కారాలు. అందరికీ ధన్యవాదాలు.

భాస్కర నాయుడు

[మార్చు]

నేను వికీపీడియా తొలినాళ్ళ నుంచీ నేను చూస్తూండేవాణ్ణి. వికీసోర్స్ మొదలుకొని అన్ని ప్రాజెక్టుల్లోనూ పనిచేస్తూంటాను. నాకు పెద్దగా పని ఉండదు. ఆ ఖాళీ సమయం అంతా ఇక్కడ(తెవికీలో) ఉపయోగిస్తూంటాను.

హోటల్ ఐలాపురంలో జరిగిన చర్చ

[మార్చు]

అనంతరం తెవికీలో తొలిరోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాత్రి 8గంటల నుంచి 9.30 వరకూ ఐలాపురం హోటల్ కాన్ఫరెన్స్ హాలులో విష్ణు వర్థన్, రెహమానుద్దీన్ షేక్ ల ఆధ్వర్యంలో తెవికీ సభ్యుల మధ్య మరో సెషన్ నిర్వహించారు. సరదాగా ప్రారంభించిన ఆ సెషన్స్ లో ప్రతివారికీ కాగితం ఇచ్చి అయిదేళ్ళ తర్వాత తెవికీ ఎలా ఉండాలన్న దానిపై తమ దార్శనికత, అందుకు తాము ఏం చేస్తాము అన్న విషయాలు రాయించారు. అనంతరం ప్రతివారూ తమ ప్రణాళిక, దార్శినికతల గురించినవి చదివి వివరించారు. సరదాగా సాగిన ఈ సెషన్ వల్ల పరస్పరం అభిప్రాయాలూ, ప్రణాళికలను పంచుకున్నారు.

చర్చల సారాంశం

[మార్చు]

చర్చలో భాగంగా పలువురు తెవికీ అభివృద్ధి కోసం చేసిన సూచనలు ఇవి:

  • తెవికీలో వ్యాసాల నాణ్యత పెరగాలి
  • తెవికీతో పాటుగా సోదర ప్రాజెక్టులైన వికీసోర్స్, వికీవ్యాఖ్య, వికీపుస్తకాలు, విక్షనరీలకు ప్రాధాన్యతనివ్వాలి
  • మహిళలతో సహా అందరికీ సహాయం, సహకారం మరియు శిక్షణనివ్వాలి
  • రెండు రకాలుగా తెవికీలో పని జరగాలి, ఒక రకం వారు పూర్తి స్థాయిలో వ్యాసాలు రాస్తూ పోవాలి, రెండవ రకం వారు మొదటి రకం వారు రాసిన వ్యాసాలను వికీకరించడం, శుద్ధి చేయడం లాంటివి చేయాలి
  • వికీ శిక్షణా శిబిరాలలో వయోవృద్ధులపై ఎక్కువ శ్రద్ధ ఉండాలి.
  • చరిత్రలో ఈ రోజు సరిగా నిర్వహించాలు
  • తెలుగు వికీపీడియాలో ఎడిటింగ్ పై వీడియో ట్యుటోరియల్స్ రూపొందించాలి
  • పాఠ్యం నుండి మాట - మాట నుండి పాఠ్యం (Text to speech, Speech to text) వికీపీడియా వేదికగా పరిశోధన జరిపి అభివృద్ధి పరచాలి.
  • వికీపీడియా వ్యాసాలలో వీలైనన్ని చలన చిత్రాలు (గిఫ్ యానిమేషన్) చేర్చాలి.
  • తెలుగు వికీ ట్రెండ్స్ ఆధారంగా మార్పులు జరగాలి
  • మొలకలను అభివృద్ధి పరిచి, నాణ్యతా పరంగా మంచి వ్యాసాలను అభివృద్ధి పరచాలి.
  • వ్యాసాల నాణ్యతకు ఒక పాలిసీ రూపొందించాలి.
  • మొలకలు సృష్టించిన వాడుకరిని అనుసరించి, అతని చర్చా పేజీలో ఆయా మొలకల పేజీలను అభివృద్ధి పరచమని కోరాలి
  • వికీలో కచ్చితంగా ఉండాల్సిన వెయ్యి వ్యాసాల జాబితా రూపొందించి వాటిని పూర్తి స్థాయి వ్యాసాలుగా తీర్చిదిద్దాలి.
  • పోటీ పరీక్షలకు అవసరమయ్యే అంశాలను వ్యాసాలలో చేర్చాలి
  • మండల స్థాయిలో వికీపీడియా అవగాహనా సదస్సులు నిర్వహించి, విద్యార్థులకు మరింత చేరువగా వికీపీడియాను తీసుకుపోవాలి
  • 366 రోజులు - 366 ప్రాదేశిక వ్యాసాలు
  • విద్యా వ్యవస్థలోకి వికీపీడియాను అనుసంధానం చేయాలి
  • సమాచార పెట్టెల గురించి అభివృద్ధి - అవగాహన జరగాలి
  • ప్రముఖుల చిత్రాలు వికీపీడియాకు రావాలి
  • తెలుగువారు తప్పక చదవాల్సిన వంద పుస్తకాల గురించిన వ్యాసాలు తెవికీలో రావాలి
  • వికీ ప్రాజెక్టుగా సాహిత్యం ప్రాజెక్టును చేపట్టాలి.

16 వతేదీ దశాబ్ది ఉత్సవాల రెండవ రోజు కార్యక్రమాలు

[మార్చు]

కార్యక్రమాలకు ముందు పరిచయాలు

[మార్చు]
Telugu Wiki 10th Anniversary Advertisement Poster (తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవ గోడపత్రం

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల్లో 16.2.2014న రెండవరోజు కార్యక్రమం విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాలలోని కళానికేతన్ ప్రాంగణంలోనూ, సెమినార్ హాల్లోనూ జరిగింది. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందుగా ఉదయం 10.40 గంటలకు వికీపీడియన్, కొ.ల.రా.వి.పు గ్రహీత అహ్మద్ నిస్సార్ సంచాలకత్వంలో వికీపీడియన్ల పరిచయం జరిగింది. కొత్తగా వికీపీడియంలైన విద్యార్థులకు, సమావేశానికి వచ్చిన ఇతరులకు సీనియర్ వికీపీడియన్లు, వారి కృషి వంటివి తెలిపే లక్ష్యంతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా వికీపీడియా భారతదేశ చాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షులు అర్జునరావు, కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కార గ్రహీతలు జె.వి.ఆర్.కె.ప్రసాద్, వీవెన్, సీనియర్ వికీపీడియన్లు సుజాత, శర్మలు సభకు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్బంగా అర్జునరావు మాట్లాడుతూ “2008లో బెంగళూరులో జిమ్మీవేల్స్ ను కలిశాను. భారతదేశ వికిపీడియా సంస్థను 2011 ప్రారంభించాము. కొన్నాళ్లు జాతీయ అధ్యక్షునిగా పనిచేసి ప్రస్తుతం వికీకార్యకర్తగా పనిచేస్తున్నాను. 2,3ఏళ్ల నుంచి నిత్యం తెలుగులోనే కంప్యూటర్, ఇతర సాంకేతిక ఉపకరణాలు వాడుతున్నాను. వచ్చే 5ఏళ్లలో తెలుగు భారతీయ భాషలతో సరిసాటిగా ఎదగాలని నా ఆకాంక్ష” అన్నారు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ మాట్లాడుతూ మా అబ్బాయి నాలుగేళ్ళ క్రితం వినాయకచవితి విదేశాల్లో జరుపుకుందామనుకున్నారు. ఏ రకమైన పురోహితులూ దొరకరు. అప్పుడు వికీపీడియాలో అప్డేట్ చేశాను. అతను చదివి పండగ జరుపుకున్నారు. చుట్టుపక్కల వారు, తెలిసిన వారు అందరూ వచ్చి పండుగ చేసుకుని సంతోషించారు. ఇలాంటి ఎన్నో అనుభవాలు వికీలో నాకు ఉన్నాయని పేర్కొన్నారు. తన గురించి పరిచయం చేసుకుంటూ తాను విజయవాడ వ్యక్తిననీ. రైల్వేలో పనిచేసి పదవీవిరమణ చేశాననీ. ఆయన కూతురు విజయవాడలో గైనకాలజిస్టుగా, కొడుకు సాఫ్ట్ వేర్ సంస్థలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్నారని వివరించాలి. వీవెన్ మాట్లాడుతూ “నా పేరు వీవెన్. నేను తెలుగు, సాంకేతికం ఎక్కడ కలిసినా నేను అక్కడ ఉండే ప్రయత్నం చేస్తాను. వ్యాసాల్లో మార్పులు, సాంకేతిక అభివృద్ధి చేస్తూంటాను. వికీపీడియాతో పాటు వికీడేటా అనే కొత్త వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థను అభివృద్ధి చేసే కృషిలో నేను పనిచేస్తున్నాను.” అన్నారు.

రెండవరోజు కార్యక్రమ ప్రారంభం

[మార్చు]

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల్లో రెండవరోజు ప్రారంభ వేడుకలలో సుప్రసిద్ధ హృద్రోగ నిపుణుడు రమేష్ బాబు, ప్రముఖ రచయిత జి.వి.పూర్ణచంద్, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు తుర్లపాటి కుటుంబరావు, వికీపీడియా ఇండియా చాప్టర్ మొదటి అధ్యక్షుడు సిహెచ్.అర్జునరావు, తెవికీ దశాబ్ది ఉత్సవాల అధ్యక్షుడు బి.కె.విశ్వనాథ్, కె.బి.ఎన్.కళాశాల కార్యదర్శి ఎస్.వి.ఎస్.ఎం.రజిత్ కుమార్, కళాశాల ప్రాచార్యులు(ప్రిన్సిపాల్) డాక్టర్.బి.కృష్ణమూర్తి తదితరులు వేదికనలంకరించారు. వికీపీడియా లోగోను తలపించేలా ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన జ్యోతిని ప్రజ్వాలన చేశారు. అనంతరం ముఖ్య అతిథి రమేష్ బాబు మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో చదువుకునేందుకు గ్రంథాలయం తెరిచే ముందే తయారుగా కూర్చుంటే కానీ పుస్తకాలు దొరికేవి కావని, ఒక్క పుస్తకం నలుగురు ఐదుగురు మార్చి మార్చి చదువుకోవాల్సి వచ్చేదని అన్నారు. ఇప్పుడు వికీపీడియా వల్ల ప్రతివారూ చదువుకుని, విజ్ఞానం అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తోందన్నారు. తెలుగులో వైద్యవిజ్ఞానం అందుబాటులో ఉండడం వల్ల సామాన్యులు సులభంగా రోగ లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అర్థం చేసుకోవచ్చని, అందుకు తెవికీ వైద్యవ్యాసాలను అభివృద్ధి చేయడానికి సమాచారాన్ని తనవంతుగా పంచుకుంటానని పేర్కొన్నారు. తెవికీ దశాబ్ది టీషర్టును రమేష్ బాబు ఆవిష్కరించారు. తుర్లపాటి కుటుంబరావు చేతుల మీదుగా డాక్టర్ రమేష్ బాబుకు టీషర్టు, జ్ఞాపికలను అందజేశారు. అర్జునరావు మాట్లాడుతూ ఇంగ్లీషులో వికీపీడియా ఆవిర్భావం, తెలుగులో వికీపీడియా ప్రారంభం నుంచి మొదలుకొని అంతర్జాలంలో తెలుగు స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం ఎదుగుదలలోని ప్రధానమైన మైలురాళ్లను గురించి వివరించారు. ఆ ప్రసంగాన్ని ముగిస్తూ “స్వేచ్చా విజ్ఞాన సర్వస్వాన్ని వ్యాసాల పరంగా కానీ, సాంకేతికంగా కానీ అభివృద్ధి చేయడం ద్వారా విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచిపెట్టడమే కాక వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుందని” వివరించారు.

“వికీపీడియా రుణాన్ని తీర్చుకుంటాను”

[మార్చు]

రచయిత, వైద్యనిపుణులు జి.వి.పూర్ణచంద్ మాట్లాడుతూ తాను రచించిన “నైలు నుంచి కృష్ణ దాకా” పుస్తకానికి 4 పేజీల ఆన్లైన్ రిఫరెన్సులు ఉంటే దానిలోని మూడు పేజీలు వికీపీడియా నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. ఏ అంశంపైనైనా వికీపీడియా ద్వారా సమగ్రమైన అవగాహన పొందవచ్చని అన్నారు. తాను భాషా శాస్త్రాంశాలు, ఆహారచరిత్ర తదితర అంశాలపై పుస్తకాలు వెలువరించగలగడం వికీపీడియా సహకారంతోనే జరిగిందని తెలిపారు. ఇన్నేళ్లుగా వికీపీడియా నుంచి విజ్ఞానాన్ని పొందానని తెవికీకి తిరిగివ్వడం ద్వారా ఆ రుణాన్ని కొంతమేరకు తీర్చుకోదలిచానని పేర్కొన్నారు.

క్యూ.ఆర్.కోడ్లపై అవగాహన

[మార్చు]

తెలుగు వికీపీడియన్, కె.బి.ఎన్.కళాశాల విద్యార్థి మల్లాది విద్యారణ్య క్యూ.ఆర్.కోడ్లపై అవగాహన కల్పించారు. “మనం ఏదైనా షాపింగ్ కి వెళ్లినప్పుడు బార్ కోడ్లు ఉంటాయి. అలాగే వికీలో 55వేల వ్యాసాలున్నాయి. మనం మరో వ్యాసం రాద్దామంటే వికీలో ఉందో లేదో వెతుక్కోవాలి. వెతుక్కోవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కేబిఎన్ కాలేజీ అని ఒకరు, కేబిఎన్ కళాశాల అని మరొకరు వ్యాసాలు రాస్తే సమస్య. క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేస్తే ఆ వివరాలను అందులో పొందుపరిచినట్టు అవుతుంది. ప్రతి ఆర్టికల్ కి క్యూఆర్ కోడ్ ఇవ్వడం వల్ల వాటికి మనం విశిష్టతను ఇవ్వవచ్చు. కళాశాలను గురించి, 21వినాయక పత్రుల గురించీ, పాలభాయంత్రం గురించీ మనం రాసి క్యూ.ఆర్. కోడ్ చేశాం. ఆ అంశంపై స్మార్ట్ ఫోన్ కెమెరా పెడితే ఆటోమేటిక్ గా ఆర్టికల్ తెరచుకుంటుంది.” అన్నారు.

“అందరికీ ఉచిత విజ్ఞానం అన్న ఆశయమే నన్ను నడిపించింది”-తుర్లపాటి

[మార్చు]
ఆహూతుల మధ్యలో మాట్లాడుతున్న తుర్లపాటి కుటుంబరావు
ఆహూతుల మధ్యలో మాట్లాడుతున్న తుర్లపాటి కుటుంబరావు

మరో ముఖ్య అతిథి ప్రఖ్యాత పాత్రికేయులు, సంపాదకులు, గ్రంథాలయ అభివృద్ధి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తుర్లపాటి కుటుంబరావు తన జీవితవిశేషాలను, తెలుగు భాషావైభవాన్ని వివరించారు. ఈ సందర్భంలో ఆయన వేదికపై నుంచి ఆహూతుల మధ్యకు వెళ్ళి వారితో మమేకమై మాట్లాడడంతో పలువురు ఆశ్చర్యానందాలు వ్యక్తంచేశారు. “అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా అందరికీ ఉచితంగా విజ్ఞానమనే తెవికీ ఆశయాన్ని బలపరచాలనే సంకల్పబలమే ఇక్కడివరకూ తీసుకువచ్చింద”ని తెలిపారు.

"నా కలం నా గళం" పుస్తకం స్వేచ్ఛా నకలు హక్కుల విడుదల

[మార్చు]

ఉచితంగా విజ్ఞానాన్ని అందజేయడం అనే ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకుని తుర్లపాటి కుటుంబరావు తాను రచించిన, తనకు కాపీహక్కులు గల "నా కలం - నా గళం" పుస్తకం స్వేచ్ఛా నకలు హక్కులతో విడుదల చేశారు. తెలుగు సాహిత్యరంగంలో తొలిసారిగా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ స్వేచ్చా నకలు హక్కుల ద్వారా విడుదల చేశారు. ఇది భావితరాల రచయితలకు ఆదర్శం కావాలని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేదికపైనే సంబంధిత పత్రాలపై సంతకం చేశారు.

కాకరపర్తి భావనారాయణ కళాశాల నిర్వాహకులు, సిబ్బందిలకు సత్కారం

[మార్చు]
Telugu Wiki 10th Anniversary Certificate for KBN Collage Science Department (కేబిఎన్ కళాశాల వారికి ఇవ్వబడిన 24x20 ఫోటో ప్రశంసాపత్రం)
Telugu Wiki 10th Anniversary Certificate for KBN Collage Science Department (కేబిఎన్ కళాశాల వారికి ఇవ్వబడిన 24x20 ఫోటో ప్రశంసాపత్రం)

కార్యక్రమ నిర్వహణకు సహకరించిన కళాశాల కాకరపర్తి భావనారాయణ కళాశాల నిర్వాహకులకు, స్టాఫ్ కు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. డాక్టర్ బి.కృష్ణమూర్తి, కళాశాల ప్రిన్సిపాల్, కంప్యూటర్ డిపార్టుమెంటు అధ్యాపకులు డేవిడ్ జాన్సన్, కార్యదర్శి ఎస్.వి.ఎస్.ఎం.రజిత్ కుమార్ మాట్లాడారు. ప్రతీ సంవత్సరం కొత్త విద్యార్థులను వికీపీడియన్లుగా చేస్తామని, తద్వారా వికీపీడియాలో మరింత సమాచారం చేరుస్తామని హామీ ఇచ్చారు. వికీపీడియా వారు చేసిన రెండు రోజుల కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ కళాశాలను వికీ కాలేజీగా మారుస్తామని రజిత్ కుమార్ పేర్కొన్నారు.

క్యూ.ఆర్.కోడ్ ల ఆవిష్కరణ

[మార్చు]

వికీపీడియాలో సభ్యులైన పలువురు కాకరపర్తి భావనారాయణ కళాశాల విద్యార్థులు తయారు చేసిన కాకరపర్తి భావనారాయణ కళాశాల వ్యాసం, కలభయంత్రం(సన్ డయల్) వ్యాసం, 21 గణపతి పత్రుల గురించిన వ్యాసాలకు క్యూ.ఆర్.కోడ్ లు తయారుచేశారు. తెవికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన క్యూ.ఆర్.కోడ్ లను మధ్యాహ్నం భోజన విరామానికి ముందు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం భోజన విరామం తీసుకున్నారు. విరామంలో పలువురు విద్యార్థులు వికీపీడియన్లను వ్యాస రచన గురించి, ఇతర సాంకేతికాంశాల గురించి ప్రశ్నించి అవగాహన ఏర్పరుచుకున్నారు.

కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారాల ప్రదానం

[మార్చు]

తెలుగు వికీపీడియా అభివృద్ధికి సహకరించిన వికీపీడియన్లకు కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తెలుగు వికీపీడియాలో వ్యాసరచనలో, సాంకేతిక అభివృద్ధిలో, వ్యాసేతర అంశాల్లో అభివృద్ధి చేసినందుకు గాను వీవెన్ (వీర వెంకట చౌదరి) (హైదరాబాద్), అహ్మద్ నిసార్ (పూణే), జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ (విజయవాడ), పాలగిరి రామకృష్ణారెడ్డి (అనపర్తి), జంగం వీరశశిధర్ (కర్నూలు), ఎల్లంకి భాస్కరనాయుడు (హైదారాబాద్), ఇనగంటి రవిచంద్ర (బెంగళూరు)లను పురస్కారంతో సత్కరించారు. పురస్కారాన్ని పొందినా వేర్వేరు కారణాలతో చదువరి (జబల్పుర్), మాకినేని ప్రదీప్ (అమెరికా), చావా కిరణ్ (హైదారాబాద్)లు హాజరు కాలేదు. పురస్కార గ్రహీతలకు పురస్కార జ్ఞాపికను, రూ.10 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ పురస్కారాలను పలువురు అతిథులు, వికీపీడియన్లు వారికి అందజేసారు. అనంతరం తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కృషి చేసిన వికీపీడియన్లకు జ్ఞాపికలు ప్రదానం చేసి సత్కరించారు.

విద్యార్థులకు బహుమతుల ప్రదానం

[మార్చు]

తెవికీలో విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వ్యాసరచనలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. వి.వి.ఐ.టి. (పెదకాకాని), కేబీఎన్(విజయవాడ) కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో గెలుపొందగా వారికి ప్రోత్సాహకంగా నగదు బహుమతి, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

వికీపీడియా కేకు కోత

[మార్చు]

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికీపీడియా కేకును కోశారు. సీనియర్ వికీపీడియన్లు, సదస్సుకు హాజరైన విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భవిష్యత్తు తరం అంటూ కొత్తగా తెవికీలో కృషి ప్రారంభించిన విద్యార్థుల చేత కేకును కోయించడం విశేషం. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

హోటల్ ఐలాపురంలో చర్చ

[మార్చు]

అనంతరం హోటల్ ఐలాపురంలోని 401 రూములో తెవికీ అభివృద్ధిని గురించి చర్చాగోష్టి జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ వికీపీడియన్, కొ.ల.రా. వి.పురస్కార గ్రహీత చదువరి కార్యక్రమంలో చేరారు. ఆయనకు పురస్కార జ్ఞాపిక, చెక్కులను అక్కడే అందజేశారు. వికీపీడియన్, తెలుగు భాషోద్యమకారుడు ఎన్.రెహమతుల్లా విచ్చేసి గోష్టిలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా తెవికీ భవిష్యత్ ప్రణాళిక, చేపట్టవలసిన ప్రాజెక్టులు, జరుగుతున్న-జరిగిన ప్రాజెక్టుల రివ్యూ, సాంకేతిక సందేహాల నివృత్తి పై ఇది నడిచింది

  • పాలగిరి గారికి మూసలు, సమాచార పెట్టెలు, రిఫరెన్స్ మరియు ఇతర సాంకేతిక ఇబ్బందులున్నాయి - వీటిపై డాక్యుమెంటేషన్/శిక్షణ కోరారు
  • కాపీరైటుపై చాలా మందికి చాలా సందేహాలున్నాయి, వీటిపై సీఐఎస్ ఒక ఎఫ్బఏక్యూ రూపొందిస్తుంది
  • వికీసోర్స్ అభివృద్ధి జరగాలి
  • ఇంగ్లిష్ - తెలుగు అనువాద ఉపకరణాలు అందుబాటులోకి రావాలి
  • చేపట్టల్సిన ప్రాజెక్టులు
  • రాబోయే ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఎంఎల్ఏ, ఎంపీ లపై వ్యాసాలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాలపై వ్యాసాలు, ఎన్నికల స్థానాలపై వ్యాసాలు అభివృద్ధి జరగాలి
  • భారతదేశంలో అన్ని జిల్లాలపై వ్యాసాలు (పర్యాటక ప్రదేశాల గురించి ముఖ్యంగా వ్రాస్తూ)
  • వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యత అభివృద్ధి
  • కథానిలయం ప్రాజెక్టు
  • సాహిత్య అకాడెమీ, జ్ఞానపీఠ మొ॥ సాహిత్య పురస్కారాలు, అవి పొందిన సాహితీకారులపై వ్యాసాల అభివృద్ధి
  • గ్రామ వ్యాసాల విస్తరణ, అభివృద్ధి

17వ రోజు కార్యక్రమం

[మార్చు]

మూడవ రోజున అన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో విష్ణువర్థన్, రహమానుద్దీన్ షేక్, సుజాత, శ్రీరామమూర్తి, విశ్వనాథ్, కశ్యప్, మల్లాది కామేశ్వరరావు, పవన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికీపీడియన్లు ఇష్టప్రకారం కృష్ణానది స్నానఘట్టం, దుర్గాదేవి ఆలయానికి నడకదారి, కనకదుర్గ ఆలయం, మల్లేశ్వరస్వామి ఆలయం, విజయవాడ నగరానికి దగ్గరలోని ఉండవల్లి గుహాలయాలు వంటి ప్రదేశాలకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లోని వ్యక్తులకు కంప్యూటర్ ఫర్ యూ మేగజైన్, చీట్ కోడ్స్ వంటివి ఇచ్చి, తెవికీ గురించి వివరించారు. పలువురికి తెవికీలో కృషిచేయడం, తెవికీ ద్వారా విజ్ఞానం పొందడం వంటి అంశాలను వివరించారు. కృష్ణా స్నానఘట్టంలో వీరుల కొలువు, ఉండవల్లిలో గుహాలయాలు వంటివాటిని ఫోటోలు తీసుకుని, వివరాలు సేకరించి వ్యాసాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రదేశంలోనూ రెండు వేర్వేరు జట్లుగా విడిపోయి ప్రచారం కొనసాగించారు. ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి అర్చక సమాఖ్య సభ్యులకు తెవికీపై అవగాహన కల్పించారు. సాయంత్రం ప్రసిద్ధి చెందిన బాబాయ్ హోటల్లో తెవికీ గురించి పలువురికి అవగాహన కల్పించి, 70 ఏళ్లుగా నిర్వహిస్తూ, రాష్ట్రపతి ప్రశంసాపత్రం మొదలుకొని ఎందరో ప్రముఖుల ప్రశంసలు పొందిన బాబాయ్ హోటల్ వివరాలు సేకరించి, పత్రికల్లోని వ్యాసాల ద్వారా మూలాలను నిర్ధారించుకున్నారు.

Tewiki 10th anniversary documentation

[మార్చు]

Tewiki 10th anniversary celebration 2014, started on February 15 in Vijayawada kakaraparti bhavanarayana College. The organizer Ch.Arjuna Rao expressed his happiness on Telugu Wikipedias completion of 10 years and 55000 articles in telugu on the inauguration of decade celebrations. .

Early turnout

[మార్చు]

The founding president of the Wikimedia India Chapter CH.Arjunarao , C.I.S company official P.Vishnu, President of the decade ceremonial committee BK Viswanath. K.B.N.college officials Samba siva rao, Rajith kumar and Krishnamurthy inaugurated the function by jyothi prajwalana.


Talking on the occasion The chairman of Andhrapradesh official languages commission Buddha Prasad said , the year 2014-15 year, must be declared as the year of the Telugu Wikipedia and to make the most of it by more exciting activities. Telugu Wikipedia has done more effort than Governments , universities, to the culture of the Telugu language. Many great personalities served telugu language and culture were remembered in this occasion including Lakshmanrao, Mallampalli.

President of the association, has unveiled the T-shirt designed by this organisation for this occasion. After this program gave the tea break .

Telugu computer - past , present , future of the Convention

[మార్చు]

Komarraju laxmana rao visishta Wikipedian award-winner veeven organised an awareness seminar. On this occasion, veeven talked about, in 2004, a decade ago, the Internet Telugu writing, reading, the problems, and in 2014, how they got eliminated in the sequence, the future development of the technology used in the Telugu language. Micro-soft Office, Libre Office, Adobe In Design, Adobe Photoshop will be used as the applications in Telugu. Microsoft, Windows, Vista, ex. P., Ubuntu, Fedora, debiyan, linaksullo Today Telugu is expected to be used. Mobile phones, i. Pods, explained that justifies the use of Android in Telugu. Spell checking in the next ten years, from the written word, the word of the text in front of us and claimed that to be possible. The technicians who came to Telugu well, technically, is a requirement of the scholars said that it is able to Telugu. Late in the wiki wiki Trans. Networking, Open Street Maps, omega wiki explained how such projects. Students bhavya, Aishwarya, Sushmita vikimyaps, Translate, but I answered questions on issues such as the wiki.

Convention on wikideta

[మార్చు]

Telugu Wikipedia, the chairman of the seminar,rahamanuddin, discussed about the topic of wikidata. The main objective of the project at the conference wikideta , its planning , is explained in different steps . Linking an article in all languages is the first step and linking diagrams and figures is the second step and in third stage classification is included. He explained it with examples of Mango tree and the word 'mother'. After that he showed how the link the particular article to the word. Then he told that Tamil students developed an app to link particular word to the article and urged that people should start using these apps from student stage then only development in this field is possible. Took a lunch break


experiences of other languages Wikipedians

[మార్చు]

Some tamilians shared their experience in developing tamil wiki. He said that govt and other organisations helped a lot in developing tamil wiki. Govt organisation helped a lot in filing data in digital form. Many educational institutions have take part in this project. Some even proposed that tamil wiki might be made part of the education for students. They said that they shared this info about tamil wiki to various friends and organisations.

From Odisha wiki Mrutunjay said that they attached the voice app feature to help with pronounciation. They attached the orrisa files to english words so that it will be useful for easy search. He also mentioned that there is a lack of creative writers in odisha and they are trying to overcome this problem.

Malayalam wiki K.Manoj said that from wikisource Malayalam remains the top in Indian language to obtain various data from a specific language. He said that over 200 books and 800 articles were included in the Malayalam wiki. They organised the structure in such a way that students will be able to use it from very early age. These books in wikisource were used by many students.Konkini wiki Darsan said that in 2007 they started the Konkini wiki. Goa students made a significant contribution to the development of this project. They uploaded 290 articles till now and they are trying to digitalise konkini wiki and other projects to help them develop.

Making a substantial contribution to the Telugu Wikipedia Nisar Ahmed also continued their efforts in Urdu Wikipedia. He came to share his experience with others. He said Urdu language , was born in India and in the globalized Urdu wikipedia there are only two to three urdu wikipedians from India, However, Indian members colloborated with the active members of the Hall. the active members of the Pakistani and from other countries to coordinate the development of a wiki. He wrote that article into the public domain under the name of the national anthem, the national anthem of Pakistan was already being written about the article appear to dispute , the country of Pakistan and many other countries of the world, because of their narrow view of the national anthems.He further discussed how to solve the conflict. However, the difficulties caused by different countries to work Wikipedians , available options about how to solve those problems and to gain experiences are fairly discussed.

Pedda Bala Siskha is not my own property: Satyanarayana

[మార్చు]

I donot belive that the pedda bala siksha is mine. I believe that it belongs to all telugu people said Gajula Satyanarayana, editor of pedda bala siksha. He explained brief history of the book. He said that it was the book included by colonial rulers in curriculum. He remembered how he decided to compile the information present in it. Then he discussed about the libraries and other sources of info he got. Then some interesting things were shared to the members regarding the history and anthology and other pieces of information. He later explained his experience with a person who claimed the information in pedda bala siksha as his copyrighted material and concluded that all the information present in it was knowledge from ancient times, so we can use it freely in telugu wiki without having to bother about any ones permission.

About komarraju laxmanarao visishta wikipedian award

[మార్చు]

At the end of the programs Arjunarao introduced the Awardees and selection process on behalf of the Committee. He explained the proposals , the selection committee , such as the selection of measures. The transparency of this process was explained to the members of a wiki , and to the students. The award recipients and their work is detailed. Recipients of the award addressed the meeting. Their words are:

Veeven: At first I used to work on english wiki. After that I started to work on wiki seriously. I taught many people about telugu keyboard and typing in telugu in web.

Palagiri: Once my daughter was searching for an article in telugu but she couldn't be able to find it. Then she asked me about that article and I started to convert it from english to telugu. Then I started working on telugu wiki. Later I used to work in Kannada wiki. Compared to telugu wiki Kannada wiki far less developed with 15k articles but you will find that they will boast about them in their wiki.

Ahmed Nisar : I have worked as a teached for over two decades. I have come to telugu wiki from english wiki and I have not done any great works. I worked on Assembly and Parliament constituencies and on religions like hindu, christian and muslims in telugu. And I worked on 1000 essential articles those should be present in telugu wikipedia.

Shashi: when I was working in Delhi, I used to look for telugu people and from then onwards I started working on telugu wiki. That start turned me to a long journey towards receiving wikimedia kommaraju lakshmanrao award. I like outfits. That is why I wrote so many articles about outfits. Most of my Articles are about Indian traditional wear and western wears used by Indians. I will continue to write for telugu wiki.

J.V.R.K.Prasad: (Arjunarao addressed meeting on behalf of prasad, because prasad is unable to speak due to ill-health)

Bhaskara Naidu: I used to observe telugu wikipedia from its start, After I started editing wikipedia I work on all the projects including wikisource . I do not have much to work with . So most of my leisure I spend here.

Discussion in Hotel Ilapuram

[మార్చు]

At Ilapuram Hotel Conference Hall, from 8 pm to 9.30 Vishnu vardhan and Sk.rehmanuddin conducted another session among the members of Wikipedia . This session was started as a leisure session and soon every one was asked to write about their vision to develop tewiki and their suggestions and how would they like to see this telugu Wikipedia after five years. After that every one read their plan of action for five years. And many important suggestions were made. Negotiations Summary: As part of the discussion these suggestions are made:

  • The quality of the articles should be improved
  • Along with Wikipedia, wiki sister projects , Wikiquote , Wikibooks etc., should be given importance.
  • To help, support and train people to write in wikipedia
  • Tewiki work should be done in two ways, first kind of people should create and edit pages in wiki and second kind of people should modify the pages created and content already written.
  • wiki training camps should pay more attention to the elderly people.
  • charitralo ee roju(Today in history) should maintained properly
  • Telugu Wikipedia should create video tutorials on editing
  • Research about Text to speech, Speech to text must be done in Wikipedia and should take necessary steps to develop it.
  • Wikipedia articles about motion pictures(Gipf animation ) must be included.
  • changes to be done basing on Wikitrends
  • stubs should be expanded and editors should develop stub articles into good articles in terms of quality .
  • create a policy to ensure the quality of the article .
  • create a list of thousand articles that should be there in telugu wikipedia. list should be completed and develop the articles.
  • include items that will be useful to competitive examinations
  • Awareness seminars should be conducted to make tewiki closer to students.
  • 366 days - 366 territorial Articles must be written.
  • Wikipedia should be part of education system.
  • Awareness on Info boxes and development of it should be increased.
  • Articles of 100 must read telugu books should be created.
  • project telugu literature should be taken up at wiki projects.

Second day in Telugu Wiki decade celebrations

[మార్చు]

Second day of Telugu Wiki decade celebrations programme (16.2.2014) was held on Kakaparthi building college near Kalaniketan seminar hall.

Introductions before programme

[మార్చు]

Komarraju Laxmana Rao visishta wikipedian award winner Ahmad nissar introduced each other wikipedians. He introduced senior wikipedians to newly joined students. Wikimedia India Chapter founder Arjunrao, Kommaraju Lakshman rao Wikiaward winner J.V.R.K.Prasad. and other senior wikipedians like Sujata and Sharma was introduced to the dias.
Arjunrao said that "I met Jimmy Wells in Bangalore in 2008. Indian Wiki was founded in 2011. I am now working as a member of Wiki after been worked as national president. Working on computers and other software products from the past 3 years and in the coming 5 years I hope that Telugu language will develop equally with all the other religions in India."
G.V.K.Prasad shared his experience that one time his son wanted to celebrate Vinayakachaviti in Western countries and there is a shortage of telugu priests. Then he uploaded all the Slokas and vinayakachaviti process in telugu wiki which was a great helpful to both his son and to the neighbouring telugu communities living in Western world. He introduced himself as a Vijayawada person. Prasad said that he worked in railways and his daughter is a gynecologist and his son is a software employee. Veeven said "I used to be present at every occasion where telugu and literature meets. Edits in articles and technical development were my primary works. Now I am working on wikidata also"

Second day programme

[మార్చు]

On the second day Ramesh Babu, famous writer Purnachandra, Andhrapradesh state Libraries committee president Turlapati kutumbarao, Wiki India chapter president Arjunrao, decade celebrations president Viswanath, K.B.N college president Ranjith Kumar, Principal Krishnamurthy was on the dias.
Chief guest Ramesh Babu remembered his college days. He said that in those days students used to compete for books and one book has to be shared with more than 6 students with in a week and now with the introduction of wiki, obtaining books and access to the knowledge has become easy. He released the Tewiki 10th anniversary Tshirt. Kutumbarao honoured Ramesh Babu with Tshirt and a memento on behalf of Telugu wikipedia.
Arjun Rao talked about Telugu wiki development. He concluded the speech with sharing how important it is and how it helps for the overalll development of individual and society.

G.V.purnachand speech

[మార్చు]

Writer, Medical specialist Purnachand said for his book "From Nile to Krishna" most of the references are from wiki. From wiki any one can learn about anything he said. He then told the members that most of his research work in language and food history was from wiki. He concluded the speech by saying that till now I have got so much information from wiki and now I will start contributing tewiki.

Knowledge in Q.R. Codes

[మార్చు]

Telugu wikipedian and K.B.R. college student Vidyaranya shared his knowledge about Q.R.Codes. In his words: We see bar codes on every item in shopping malls. There are nearly 55k articles in wiki. If we want to write an article about something we must know if it has been already written or not. And in searching we find many difficulties like some people will write under the name of KBN College and some other will write under KBN Institute. So by attaching Q.R. Codes we are giving the article a special identity and later we can easily identify it by searching it with smart phone.

Free knowlege for everyone motivated me: Turlapati

[మార్చు]

Another chief guest and famous journalist, Andhra pradesh state libraries committee president Turlapati Kutumbarao talked about language importance and his lifes lessons. On this occasion he went into the audience from dias and mingled with them which surprised some people. He said "even though I am not feeling well I came here today because free knowledge for everyone motivated me and made me come here."

"Naa kalam Naa galam" book free licence was released:

[మార్చు]

Turlapati motivated by the idea of free knowledge to every one, signed a free licence to his autobiography "Naa kalam Naa galam" on the stage. He said that this should be an inspiration to every one and every one must share their knowledge to everyone.

Felicitation to Kakaparti College president and staff

[మార్చు]

Kakparti Bhavanarayana college President and staff was given mementos for their contribution to 10th anniversary celebrations. On this occasion Krishna Murthy, principal, Computer department staff Johnson and college secretery Ranjith kumar gave speeches. Ranjith Kumar said that they will turn this college into wiki college.

Release of Q.R.Codes

[మార్చు]

Q.R.codes for some articles like sun dial and 21 other articles written by college students who are also members of wiki were created and exhibited at relevant places in college. They were released in afternoon.

Kommaraju Lakshmanrao visishta wikipedian awards

[మార్చు]

People who contributed to the development of telugu wiki was awarded with Kommaraju Lakshmanrao visishta wikipedian awards. Veeven(Veera Venkata Chowdary) (HYD), Ahmed Nisar (Pune), Jalasutram Venkata Ramakrishna (Vijayawada), Palagiri Ramakrishna Reddy (Anaparthy), Jangam Veera sasidhar (Kurnool), Ellaki Baskarnaidu (HYD), Inuganti Ravichandra (Bangalore) received the award for their contributions in telugu wikipedia. Chaduvari (Jabalpur), Manikeni pradeep (USA), Chava Kiran (HYD) eventhough won the awards were not able to attend the function because of various reasons. A memento was presented to the award winners and Rs.10,000 cash prize was given. After that mementos were given to the people who contributed to the celebrations.

Prize distribution for essay writing competition winners

[మార్చు]

Essay writing competitions were held in telugu wikipedia for students and the winners were awarded with cash and certificates. The winners are from VVIT (Peddakakani), KBN (Vijayawada) colleges.

Telugu Wikipedia Cake cutting

[మార్చు]

On this occasion of telugu wikipedia 10th anniversary cake cutting took place. And the wikipedians made the students cut the cake as they are the future generations to the wiki.

Discussions in Hotel Ilapuram

[మార్చు]

Discussions were held at hotel room no 401 after the function. On this senior wikipedians Chaduvari and N.Rehamatulla were also participated along with others. They discussed about future projects and developments that should be done in present projects to improve wiki. Chaduvari was felicitated with Komarraju laxmanarao visishta wikipedia award memento and cash prize.

  • Palagiri asked for clarifications about info box and other technical problems. The people asked documentation and training regarding this.
  • Many people has so many queries regarding copyright laws. A new FAQ was being created on this.
  • Development of wiki source must happen.
  • English telugu translation tools must come in handy.
  • Projects that should be undertaken
Articles about MLA and MP must be written as elections are going to be announced in this year to Loksabha, Legislative assemblies, and other local bodies
Articles about all the famous places in India and other tourist places must be written
Quality improvement based on wikitrends
Kathanikam project
Articles about famous writers and poets who won prestigious awards like Sahitya Academy and Gnanapeet.
About village articles and its development

సదస్సులో ప్రదర్శనల వివరాలు

[మార్చు]
నమూనా

T Vishnu Vardhan // So many languages: Challenges and opportunities for the Wikimedia movement in India

[మార్చు]

పేనల్ డిస్కషన్ వివరాలు

[మార్చు]

సాధారణ కార్యక్రమ వివరాలు

[మార్చు]
  • 15 వతేదీ మొదలైన కార్యక్రమంలో కేబీఎన్ ద్వారా ఏర్పాటుచేసిన స్వాగత సన్నాహాల ద్వారా అతిధులను ఆహ్వానించడం జరిగింది.
  • స్వాగత సందేశం అతిధుల రాక ద్వారా కొంత ఆలస్యమైనప్పటికీ జ్యోతి ప్రజ్వలనతో మొదలయింది.
  • ప్రార్ధన అనంతరం ముఖ్యాతిధులు శ్రీ మండలి బుద్దప్రసాద్‌గారి ఉపన్యాసం సాగింది.

ఛాయాచిత్రాలు

[మార్చు]

commons:Category:Telugu Wikipedia 10th anniversary

వీడియోలు

[మార్చు]

తదుపరి చర్యలు

[మార్చు]

బ్లాగులు

[మార్చు]

మెటాలో ఈ కార్యక్రమ పేజీ

[మార్చు]

https://meta.wikimedia.org/wiki/Tewiki_Dasabdi

చిట్కాలు, నజరానాలు, సూచనలు, సలహాలు

[మార్చు]