అరుణ్ యోగిరాజ్
అరుణ్ యోగిరాజ్ | |
---|---|
జననం | 1983 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | శిల్పి, కళాకారుడు |
గుర్తించదగిన సేవలు | అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహం, కేదార్‌నాథ్‌లోని ఆది శంకరాచార్య విగ్రహం, మైసూర్ జిల్లాలోని చుంచనకట్టె వద్ద 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం మొదలైనవి |
జీవిత భాగస్వామి | విజేత |
బంధువులు | సూర్యప్రకాష్ యోగిరాజ్ (సోదరుడు) |
పురస్కారాలు | మైసూరు జిల్లా యంత్రాంగం ద్వారా రాజ్యోత్సవ అవార్డు కర్ణాటక ప్రభుత్వంచే జకనాచారి అవార్డు |
వెబ్‌సైటు | https://arunyogiraj.com/ |
అరుణ్ యోగిరాజ్, మైసూరుకు చెందిన భారతీయ శిల్పి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి వెనుక పందిరిలో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ 30 అడుగుల విగ్రహాన్ని చెక్కిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1][2]
అయోధ్యలోని రామ మందిరంలో 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కాబడిన బాల రాముడు (రామ్ లల్లా) దివ్య విగ్రహం రూపొందించి ఆయన మరింత ప్రాచుర్యంలోకి వచ్చాడు.[3][4][5] ముదురు రంగు కృష్ణశిలపై రామ్ లల్లా 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు, బాణం పట్టుకుని దర్శనమిస్తాడు.[6]
నేపథ్యం
[మార్చు]అరుణ్ యోగిరాజ్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరానికి చెందిన ఐదు తరాల శిల్పుల కుటుంబానికి చెందినవాడు.[7][8] ఆయన తండ్రి యోగిరాజ్, తాత బసవన్నలు కూడా ప్రసిద్ధ శిల్పులు. ఎంబిఎ చదివిన ఆయన 2008 నుండి పూర్తి సమయం శిల్పకళకు కేటాయించడానికి ముందుగా ప్రైవేట్ కంపెనీలో చేరాడు.[9]
అతని తండ్రి యోగిరాజ్ శిల్పి అక్టోబరు 2021లో మరణించాడు. అతనికి ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు.[10] అతను విజేతను వివాహం చేసుకున్నాడు.[11] శిల్పి కూడా అయిన అతని సోదరుడు సూర్యప్రకాష్ మైసూర్‌లో వారితో నివసిస్తున్నాడు.
అవార్డులు
[మార్చు]ఆయన 2014లో భారత ప్రభుత్వంచే సౌత్ జోన్ యంగ్ ఆర్టిస్ట్ అవార్డును, మైసూరు జిల్లా పరిపాలన నుండి రాజ్యోత్సవ అవార్డును పొందాడు.[12] 2021లో, ఆయన కర్ణాటక ప్రభుత్వ జకనాచారి అవార్డును అందుకున్నాడు.[13] అలాగే, ఆయనను శిల్పుల సంఘం శిల్ప కౌస్తుభ పురస్కారంతో సత్కరించారు.[14]
మూలాలు
[మార్చు]- ↑ "Who is Arun Yogiraj, 5th Generation Sculptor Whose Idol Has Been Selected for Ayodhya's Ram Temple". News18 (in ఇంగ్లీష్). 2024-01-02. Retrieved 2024-01-02.
- ↑ "Arun Yogiraj: Meet the MBA-turned sculptor whose Ram idol has been selected for Ayodhya temple". The Economic Times. 2024-01-02. ISSN 0013-0389. Retrieved 2024-01-02.
- ↑ "శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది? | Shri Ram Lalla Idol Sculpted By Arun Yogiraj Will Be Placed In Garbha Griha On Jan 18th, Know About Him In Telugu - Sakshi". web.archive.org. 2024-01-22. Archived from the original on 2024-01-22. Retrieved 2024-01-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Renowned sculptor Arun Yogiraj's idol of Ram Lalla chosen for Ayodhya's grand temple". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-01-02. Retrieved 2024-01-02.
- ↑ "Who is Arun Yogiraj, sculptor whose Ram Lalla idol selected for grand temple in Ayodhya?". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-01-02. Retrieved 2024-01-02.
- ↑ "Ayodhya Ram Mandir: బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక అప్‌డేట్స్ | Ayodhya Ram Mandir Inauguration Highlights, Live Updates In Telugu - Sakshi". web.archive.org. 2024-01-22. Archived from the original on 2024-01-22. Retrieved 2024-01-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "City sculptor carves 12-ft. statue of 'Adi Shankaracharya'". Star of Mysore (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-13. Retrieved 2024-01-02.
- ↑ "Ayodhya's grand temple: Who is sculptor Arun Yogiraj whose Ram Lalla idol got selected for Garbha Griha". Business Today (in ఇంగ్లీష్). 2024-01-02. Retrieved 2024-01-02.
- ↑ "Ayodhya's grand temple: Who is sculptor Arun Yogiraj whose Ram Lalla idol got selected for Garbha Griha". Business Today (in ఇంగ్లీష్). 2024-01-02. Retrieved 2024-01-02.
- ↑ Correspondent, Special (2021-10-02). "Sculptor Yogiraj Shilpi dead". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-01-02.
- ↑ "Sculptor Arun Yogiraj's Ram Lalla will now be Ayodhya Ram Mandir's cynosure". Moneycontrol (in ఇంగ్లీష్). 2024-01-03. Retrieved 2024-01-03.
- ↑ Kumar, R. Krishna (2021-11-06). "Meet the man who sculpted the statue in Kedarnath unveiled by Modi". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-01-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2024-01-02. Retrieved 2024-01-22.
- ↑ Mehrotra, Puja (2022-09-13). "MBA to master sculptor — Arun Yogiraj's journey to pulling off 28-ft Netaji statue at India Gate". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-01-02.