ఆదివారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యుడు ప్రతిరూపం

ఆదివారం (Sunday) అనేది వారంలో శనివారంనకు, సోమవారంనకు మధ్యలో ఉంటుంది. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఇది వారంలో ఆఖరి రోజు కాగా, చాలా సంప్రదాయాలు, సంస్కృతుల్లో ఇది వారంలో మొదటిరోజు.ఆంగ్లేయులు ఇండియాను పాలించినపుడు భారతదేశ ప్రజలు ఒక రోజు సెలవు కావాలి అని అడిగితే ఆంగ్లేయులు బాగా ఆలోచించి ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. అప్పటి నుండి ఆదివారం సెలవు దినంగా మారిపోయింది. ప్రపంచం మొత్తం సెలవు దినంగా మారింది

ఇతర పేర్లు

[మార్చు]
  • తెలుగు - ఆదివారం అనే పదం ఆదిత్య వారం నుంచి పుట్టింది.
  • సంస్కృతం-భానువారం అని పిలుస్తారు
  • భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివార్గా పిలువబడుతుంది.

వారంలో స్థానం

[మార్చు]

ఐఎస్ఓ 8601

[మార్చు]

తేదీలు, సమయాలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణమైన ఐఎస్ఓ 8601 ప్రకారం ఆదివారం వారంలో ఏడవ, ఆఖరి రోజు.[1] తేదీలు, కాలాలను అసందిగ్ధంగా ప్రతిబింబించడం అన్నది 1988లో మొదట ప్రచురితమైంది.

సంస్కృతి, భాషలు

[మార్చు]

యూదు సంప్రదాయంలో, కొన్ని కొన్ని క్రైస్తవ, ఇస్లామీయ సంప్రదాయాల్లో, ఆదివారాన్ని వారంలో తొలిరోజుగా భావిస్తారు. ఈ అంశాన్ని వ్యక్తం చేసేందుకు ఆరోజుకు పేరుపెట్టడం కానీ, మిగతా రోజుకు అందుకు అనుగుణంగా పేరుపెట్టడం కానీ జరిగింది. హిబ్రూలో యోమ్ రిషోన్, అరబిక్‌లో అల్-అహద్, పర్షియన్, ఇతర అనుబంధ భాషల్లో యెక్-షన్బే, తెలుగులో ఆదివారం అన్న పదాలు అన్నీ మొదటి అన్న పదాన్నే వ్యక్తీకరిస్తోంది. గ్రీకు భాషలో సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారాల ("Δευτέρα", "Τρίτη", "Τετάρτη" and "Πέμπτη") పేర్లకు అర్థాలు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు. దీంతో ఆదివారం మొదటిరోజు అన్న ఉద్దేశం తేలుతోంది. ప్రస్తుత కాలంలో గ్రీకు భాషలో ఆదివారానికి పేరు కైరియకె, ఇది గ్రీకు భాషలో దేవుడిని సూచించే పదం కైరియోస్ నుంచి వచ్చింది - కైరియకె అంటే దేవుని రోజు. పోర్చుగీసు భాషలోనూ, వియత్నామీస్ భాషలోనూ ఆదివారానికి దేవుని రోజు అని, సోమ, మంగళ మొదలైన వారాలకు రెండు, మూడు, నాలుగు అంటూ వరసగా సంఖ్యలు సూచించే పేర్లు ఉన్నాయి.

ఇటాలియన్, ఫ్రెంచ్, రొమానియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో కూడా దేవుని భాష అన్న అర్థమున్న పదాలే ఆదివారానికి ఉన్నాయి. స్లావిక్ భాషల్లో సోమవారానికి మొదటి రోజు అని అర్థం, ఆ రకంగా ఆదివారం ఏడోరోజు అవుతుంది. రష్యన్ భాషలోని బోక్‌పెసెన్ (ఆదివారం) అంటే (ఏసుక్రీస్తు) పునరుత్థానం అని అర్థం (వారంలో ఆదివారం ఏసుక్రీస్తు పునరుత్థానానికి స్మారక దినం అన్న ఉద్దేశంలో). పాత రష్యన్‌లో ఆదివారానికి హేన్ర్ అన్న పదం ఉండేది, దీనికి పని ఉండని రోజు అని అర్థం, అయితే ప్రస్తుత రష్యన్ భాషలో ఈ పదానికి వారం అని అర్థం ఉంది. హంగేరియన్లు వసార్నాప్ అన్న పదాన్ని ఆదివారానికి వాడతారు, దీనికి అర్థం సంత రోజు (లేక మార్కెట్ రోజు). మాల్టీస్ భాషలో

అయితే చాలావరకూ ఐరోపా క్యాలెండర్లలో ఐఎస్ఓ 8601ను అనుసరించే విధంగా సోమవారాన్ని వారానికి మొదటిరోజుగా పరిగణిస్తున్నారు.[2] పర్షియన్ క్యాలెండర్ ప్రకారం ఆదివారం రెండో రోజు, అయితే లెక్క సున్నాతో మొదలవుతూండడంతో ఆదివారాన్ని ఒకటిగా లెక్కిస్తారు - శనివారాన్ని 00గా పరిగణిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "సోమవారం ఏ కాలండర్ వారంలోనైనా తొలి కాలండర్ రోజుగా గుర్తించాలి, మిగిలిన కాలెండర్ రోజులు వరుసగా ఆదివారం (ఏడవ కాలండర్ రోజు) దాకా లెక్కించాలి.": |http://www.npl.co.uk/science-technology/time-frequency/time/faqs/which-is-the-first-day-of-the-week-and-which-is-week-1-of-the-year-(faq-time) (Archive here: https://archive.today/20160716145156/http://www.npl.co.uk/science-technology/time-frequency/time/faqs/which-is-the-first-day-of-the-week-and-which-is-week-1-of-the-year-(faq-time)
  2. J. R. Stockton. "Calendar Weeks". Archived from the original on 2014-01-13. Retrieved 2010-01-05.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆదివారం&oldid=4344481" నుండి వెలికితీశారు